తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Pak Vs Ban: ఎట్టకేలకు గెలిచిన పాకిస్థాన్.. బంగ్లాకు వరుసగా ఆరో ఓటమి

PAK vs BAN: ఎట్టకేలకు గెలిచిన పాకిస్థాన్.. బంగ్లాకు వరుసగా ఆరో ఓటమి

31 October 2023, 20:53 IST

    • PAK vs BAN ICC World Cup 2023: వన్డే ప్రపంచకప్‍లో బంగ్లాదేశ్‍పై పాకిస్థాన్ విజయం సాధించింది. అలవోకగా గెలిచింది. వివరాలివే..  
అబ్దుల్లా షఫీక్, ఫకర్ జమాన్
అబ్దుల్లా షఫీక్, ఫకర్ జమాన్ (PTI)

అబ్దుల్లా షఫీక్, ఫకర్ జమాన్

PAK vs BAN ICC World Cup 2023: వన్డే ప్రపంచకప్‍లో ఎట్టకేలకు మళ్లీ గెలుపు బాట పట్టింది పాకిస్థాన్. టోర్నీలో నాలుగు వరుస ఓటముల తర్వాత ఓ విజయాన్ని రుచిచూసింది. ప్రపంచకప్‍లో భాగంగా కోల్‍కతా ఈడెన్ గార్డెన్స్ మైదానంలో నేడు (అక్టోబర్ 31) జరిగిన మ్యాచ్‍లో పాకిస్థాన్ 7 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‍పై విజయం సాధించింది. 105 బంతులు మిగిల్చి భారీగా గెలిచింది పాక్.

ట్రెండింగ్ వార్తలు

Rohit Sharma vs Hardik Pandya: హార్దిక్ పాండ్యా రాగానే లేచి వెళ్లిపోయిన రోహిత్, సూర్యకుమార్

Team India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ పదవిపై కన్నేసిన ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్.. ద్రవిడ్ తర్వాత అతడేనా?

T20 Worlcup : టీమిండియా టీ20 వరల్డ్ కప్​​ జట్టులో హార్దిక్ వద్దని చెప్పిన రోహిత్​.. కానీ!​

GT vs KKR IPL 2024: మ్యాచ్ వర్షార్పణం.. ప్లేఆఫ్స్ రేసును నుంచి గుజరాత్ ఔట్.. కోల్‍కతాకు టాప్-2 పక్కా

ఈ మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 45.1 ఓవర్లలో 204 పరుగులకు ఆలౌటైంది. మహమ్మదుల్లా (56), లిటన్ దాస్ (45), షకీబల్ హసన్ (43) రాణించగా.. మిగిలిన బంగ్లా బ్యాటర్లు విఫలమయ్యారు. పాకిస్థాన్ బౌలర్లలో షహిన్ షా అఫ్రిదీ, మహమ్మద్ వాసిమ్ చెరో మూడు వికెట్లతో అదరగొట్టారు. హరిస్ రవూఫ్‍కు రెండు, ఇప్తికార్, ఉసామాకు చెరో వికెట్ దక్కింది. ఈ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది పాక్. 32.3 ఓవర్లలో 3 వికెట్లకు 205 రన్స్ చేసి విజయం సాధించింది పాకిస్థాన్. ఓపెనర్లు ఫకర్ జమాన్ (81), అబ్దుల్లా షఫీక్ (68) అర్ధ సెంచరీలతో అదరగొట్టడంతో పాక్ అలవోకగా గెలిచింది. బంగ్లాదేశ్ బౌలర్లలో మెహదీ హసన్ మిరాజ్ ఒక్కడే మూడు వికెట్లు పడగొట్టాడు.

205 పరుగుల లక్ష్యఛేదనలో పాకిస్థాన్ ఏ దశలోనూ ఇబ్బంది పడలేదు. మెహదీ హసన్ మిరాజ్ మినహా బంగ్లాదేశ్ బౌలర్లందరూ తేలిపోయారు. పాక్ ఓపెనర్ ఫకర్ జమాన్ 74 బంతుల్లోనే 81 పరుగులు చేసి గెలుపుకు బాటలు వేశాడు. అబ్దుల్లా షఫీక్ కూడా అర్ధ శకతంతో మెరిశాడు. దీంతో 128 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం నమోదైంది. అబ్దుల్లా షఫీక్ ఔటయ్యాక.. పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ (9) విఫలమయ్యాడు. కాసేపటికే ఫకర్ కూడా పెవిలియన్ బాటపట్టాడు. అయితే, మహమ్మద్ రిజ్వాన్ (26 నాటౌట్), ఇఫ్తికార్ అహ్మద్ (17 నాటౌట్) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. చివరి వరకు నిలిచి పాకిస్థాన్‍ను గెలిపించారు.

పాకిస్థాన్ బౌలర్లు సమిష్టిగా విజృంభించడంతో ఈ మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 204 పరుగులకే చాపచుట్టేసింది. ఏడుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్‍కే పరిమితం అయ్యారు. మహమ్మదుల్లా అర్ధ శకతం చేసి జట్టును ఆదుకున్నాడు. లిటన్ దాస్, షకీబ్ పర్వాలేదనిపించారు. అయితే, మిగిలిన బ్యాటర్లు ఎక్కువ సేపు నిలువలేకపోయారు.

ఈ ప్రపంచకప్‍లో బంగ్లాదేశ్‍కు ఇది వరుసగా ఆరో ఓటమిగా ఉంది. తొలి మ్యాచ్ మినహా అన్నింటా ఓడింది బంగ్లా. దీంతో ఇప్పటికే సెమీస్ రేసు నుంచి ఔట్ అయింది. గ్రూప్ స్టేజీలో మిగిలిన రెండు మ్యాచ్‍లు గెలిచినా ఆ జట్టుకు సెమీస్ అవకాశాలు లేవు. మరోవైపు, ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‍ల్లో మూడింట గెలిచింది పాకిస్థాన్. ఆరు పాయింట్లతో పట్టికలో ఐదో స్థానానికి వచ్చింది. తనకు మిగిలిన రెండు మ్యాచ్‍లు గెలిచినా.. ఇతర జట్ల సమీకరణాలపై పాక్ సెమీస్ అవకాశాలు ఆధారపడి ఉంటాయి.

తదుపరి వ్యాసం