Ravindra Jadeja: అప్ఘనిస్తాన్ సిరీస్‌కు కెప్టెన్‌గా జడేజా - హార్దిక్, సూర్యకుమార్ డౌట్
25 December 2023, 11:35 IST
Ravindra Jadeja: జనవరిలో అప్ఘనిస్థాన్‌తో జరుగనున్న టీ20 సిరీస్‌కు టీమిండియా కెప్టెన్‌గా రవీంద్ర జడేజాను నియమించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అతడితో పాటు శ్రేయస్ అయ్యర్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది.
రవీంద్ర జడేజా
Ravindra Jadeja: జనవరిలో అప్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్‌లో తలపడనుంది టీమిండియా. మూడు మ్యాచ్‌ల సిరీస్‌కు టీమిండియా కెప్టెన్ ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. రోహిత్ టీ20లకు దూరమై చాలా కాలమైంది. అతడి స్థానంలో టీమిండియా టీ20 కెప్టెన్‌గా హార్దిక్ పాండ్య కొనసాగుతోన్నాడు.
వరల్డ్ కప్‌లో గాయపడ్డ హార్దిక్ పాండ్య ప్రస్తుతం టీమ్‌కు దూరమయ్యాడు. పాండ్య స్థానంలో ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా టీ20 సిరీస్‌లకు సూర్యకుమార్ యాదవ్‌కు బీసీసీఐ సారథ్య బాధ్యతల్ని అప్పగించింది.
సౌతాఫ్రికాతో మూడో టీ20లో ఫీల్డింగ్ చేస్తూ సూర్యకుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడి చీలమండలో చీలిక వచ్చినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. కాలికి బ్యాండేజ్ కట్టుకొని వాకింగ్ స్టిక్‌తో నడుస్తోన్న ఫొటోలను సూర్యకుమార్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
అప్ఘనిస్తాన్‌తో జరుగనున్న టీ20 సిరీస్‌కు సూర్యకుమార్ దూరం కావడం కన్ఫామ్‌గా మారింది. ఈ నేపథ్యంలో అప్ఘనిస్థాన్ సిరీస్‌కు సారథ్య బాధ్యతల్ని ఎవరికి అప్పగిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
హార్దిక్, సూర్యకుమార్ దూరం కావడంతో ప్రత్యామ్నాయాలపై టీమ్ మేనేజ్‌మెంట్ దృష్టిసారించినట్లు సమాచారం. స్పిన్నర్ రవీంద్ర జడేజాకు సారథ్య బాధ్యతలు అప్పగించాలని ఫిక్స్ అయినట్లు తెలిసింది. అతడితో పాటు కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. ఈ ఇద్దరిలో ఎవరు కెప్టెన్ అన్నది జనవరి ఫస్ట్ వీక్‌లో తేలనుంది. ఇండియా, అప్ఘనిస్థాన్ టీ20 సిరీస్ జనవరి 11 నుంచి 17 వరకు జరుగనుంది.