Nicholas Pooran: బౌన్సర్‌తో గాయపరచిన అర్షదీప్‌కు థాంక్స్ చెప్పిన పూరన్ - ట్వీట్ వైరల్
14 August 2023, 11:39 IST
Nicholas Pooran: ఆదివారం జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో టీమ్ ఇండియాను ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది వెస్టిండీస్. ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా పేసర్ అర్షదీప్ సింగ్ వేసిన లోయర్ బౌన్సర్‌కు పూరన్ గాయపడ్డాడు. తనను గాయపరచిన అర్షదీప్‌కు థాంక్స్ చెబుతూ పూరన్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
నికోలస్ పూరన్
Nicholas Pooran: వెస్టిండీస్‌తో జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో అర్షదీప్ వేసిన బౌన్సర్‌కు వెస్టిండీస్ హిట్టర్ నికోలస్ పూరన్ గాయపడ్డాడు. ఐదో టీ20 అర్షదీప్ సింగ్ వేసిన లోయర్ బౌన్సర్‌ను అంచనా వేయడంలో పూరన్ విఫలమయ్యాడు. మిస్సయిన ఈ బాల్ పూరన్ పొట్టభాగంపై బలంగా తగిలింది.
గాయంతో కొద్దిసేపు పూరన్ విలవిలలాడాడు. బాధను ఓర్చుకుంటూనే బ్యాటింగ్ కొనసాగించాడు.ఇదే మ్యాచ్‌లో వెస్టిండీస్ ఓపెనర్ బ్రెండన్ కింగ్ కొట్టిన ఓ పవర్‌ఫుల్ షాట్ పూరన్ చేతికి తాకింది. ఐదో టీ20లో తనకు తగిలిన ఈ రెండు గాయాల తాలూకు ఫొటోలను ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు నికోలస్ పూరన్. తనను గాయపరచిన అర్షదీప్‌సింగ్‌తో పాటు బ్రెండన్ కింగ్‌కు థాంక్స్ చెప్పాడు. పూరన్ ట్వీట్ వైరల్‌గా మారింది.
ఐదో టీ20 మ్యాచ్‌లో టీమ్ ఇండియాపై వెస్టిండీస్ ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్లో నష్టపోయి 165 పరుగులు చేసింది. సింపుల్ టార్గెట్‌ను కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 18 ఓవర్లలోనే ఛేదించింది వెస్టిండీస్.
ఈ గెలుపుతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3-2 తేడాతో వెస్టిండీస్ కైవసం చేసుకున్నాడు. ఈమ్యాచ్‌లో బ్రెండన్ కింగ్ 85 రన్స్, నికోలస్ పూరన్ 47 రన్స్‌తో రాణించారు. 2016 తర్వాత టీమ్ ఇండియాపై వెస్టిండీస్ గెలిచిన ద్వైపాక్షిక సిరీస్ ఇదే కావడం గమనార్హం. టీమ్ ఇండియా టీ20 చరిత్రలో ఓ సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఓడిపోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.