తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Afghanistan Cricketers: న‌వీన్ ఉల్ హాక్‌కు షాక్‌- ఐపీఎల్‌కు దూరం కానున్న అప్ఘ‌న్ క్రికెట‌ర్లు వీళ్లే!

Afghanistan Cricketers: న‌వీన్ ఉల్ హాక్‌కు షాక్‌- ఐపీఎల్‌కు దూరం కానున్న అప్ఘ‌న్ క్రికెట‌ర్లు వీళ్లే!

26 December 2023, 12:04 IST

google News
  • Afghanistan Cricketers: అప్ఘ‌నిస్థాన్ క్రికెట‌ర్లు న‌వీన్ ఉల్ హ‌క్‌తో పాటు ముజీబ్ ఉర్ రెహ‌మాన్‌, ఫ‌జ‌ల్ హ‌క్ ఫ‌రూఖీ ఐపీఎల్‌లో ఆడ‌టం అనుమానంగా మారింది. ఐపీఎల్‌ ఆడ‌టానికి ఈ ముగ్గురు ప్లేయ‌ర్ల‌కు ఆ దేశ బోర్డు ఎన్‌వోసీ ఇవ్వ‌డానికి నిరాక‌రించిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

న‌వీన్ ఉల్ హ‌క్‌
న‌వీన్ ఉల్ హ‌క్‌

న‌వీన్ ఉల్ హ‌క్‌

Afghanistan Cricketers అప్ఘ‌నిస్థాన్ క్రికెట‌ర్లు న‌వీన్ ఉల్ హ‌క్‌, ముజీబ్ ఉర్ ర‌హ‌మాన్‌తో పాటు ఫ‌జ‌ల్ హ‌క్ ఫ‌రూఖీల‌కు ఆ దేశ క్రికెట్ బోర్డు షాకిచ్చింది. ఐపీఎల్‌తో పాటు విదేశీ లీగ్‌ల‌లో ఆడ‌కుండా వారిపై నిషేధం వించిన‌ట్లు స‌మాచారం. విదేశీ లీగ్‌ల‌లో ఆడ‌టానికి వారికి నో అబ్జెక్ష‌న్ స‌ర్టిఫికెట్ ఇవ్వ‌డానికి అప్ఘ‌న్ క్రికెట్ బోర్డు నిరాక‌రించిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ ముగ్గురు క్రికెట‌ర్లు ఐపీఎల్‌కు దూర‌మ‌య్యే అవ‌కాశాలు క‌నిపిస్తోన్నాయి.

ఐపీఎల్‌తో పాటు ఇత‌ర విదేశీ లీగ్‌ల‌లో అప్ఘ‌నిస్థాన్ క్రికెట‌ర్లుకు డిమాండ్ పెరిగింది. లీగ్‌ల ద్వారా కోట్ల‌లో డ‌బ్బు వ‌స్తుండ‌టంతో అప్ఘ‌నిస్థాన్ క్రికెట‌ర్లు జాతీయ జ‌ట్టు కంటే ఐపీఎల్ వంటి లీగ్‌ల‌లో ఆడ‌టానికే ఎక్కువ‌గా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఈ లీగ్‌ల కార‌ణంగా న‌వీన్ ఉల్ హ‌క్‌, ముజీబ్ ఉర్ రెహ‌మాన్‌తో పాటు ఫ‌జ‌ల్ హ‌క్ ఫ‌రూఖీ చాలా కాలంగా జాతీయ జ‌ట్టుకు దూరంగా ఉంటున్నారు.

దాంతో ఈ ముగ్గురు క్రికెట‌ర్ల నేష‌న‌ల్ కాంట్రాక్టుల‌ను ర‌ద్దు చేయాల‌ని అప్ఘ‌నిస్థాన్ క్రికెట్ బోర్డు నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం. అప్ఘ‌నిస్థాన్ క్రికెట‌ర్లు ఐపీఎల్‌తో పాటు విదేశీ లీగ్‌ల‌లో ఆడ‌టానికి బోర్డు నుంచి నో అబ్జ‌క్ష‌న్ స‌ర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. న‌వీన్ ఉల్ హ‌క్‌తో పాటు ముజీబ్‌, ఫ‌రుఖీల‌కు రెండేళ్ల పాటు నో అబ్జ‌క్ష‌న్ స‌ర్టిఫికెట్ ఇవ్వ‌కూడ‌ద‌ని బోర్డు నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు చెబుతున్నారు.

దాంతో ఈ ముగ్గురు క్రికెట‌ర్లు ఐపీఎల్‌కు దూరం కానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. న‌వీన్ ఉల్ హ‌క్ ఐపీఎల్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ టీమ్‌కు ప్రాతినిథ్యం వ‌హిస్తున్నాడు. ముజీబ్ ఉర్ రెహ‌మాన్ కోల్‌క‌తా, ఫ‌రుఖీ హైద‌రాబాద్ స‌న్‌రైజ‌ర్స్‌కు త‌ర‌ఫున ఆడుతోన్నారు.

టాపిక్

For latest cricket news, live scorestay connected with HT Telugu
తదుపరి వ్యాసం