MS Dhoni: “చాక్లెట్స్ ఇచ్చెయ్”: అభిమానితో ధోనీ: వీడియో వైరల్
11 September 2023, 17:40 IST
- MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఈ సందర్భంగా ఓ అభిమానికి ఆటోగ్రాఫ్ ఇచ్చారు.
MS Dhoni: “చాక్లెట్స్ ఇచ్చెయ్”: అభిమానితో ధోనీ: వీడియో వైరల్ (Photo: Twitter)
MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్, క్రికెట్ లెజెండ్ మహేంద్ర సింగ్ ధోనీకి అభిమానగణం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు ఫుల్ క్రేజ్ ఉంది. మహీ అంటే అభిమానులు చాలా ఇష్టపడతారు. తాను ఎంత ఎదిగినా.. ధోనీ మాత్రం ఒదిగే ఉంటారు. కొన్నిసార్లు అభిమానులతో సరదాగా మాట్లాడుతుంటారు. అలాంటి విషయమే తాజాగా జరిగింది. యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ చూసేందుకు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు ధోనీ. అక్కడ కూడా ఆయనను అభిమానులు కలుస్తున్నారు.
ఈ క్రమంలో అమెరికాలో ఓ అభిమానికి ఎంఎస్ ధోనీ ఆటోగ్రాఫ్ ఇచ్చారు. ఫ్యాన్ తెచ్చిన చిన్న బ్యాట్‍పై సంతకం చేశారు. అయితే, ఆ సమయంలో అభిమాని చాక్లెట్ల బాక్స్ తీసుకెళ్లారు. దీంతో చాక్లెట్లు ఇవ్వండని ధోనీ సరదాగా అడిగారు. దీంతో ఆ అభిమాని గట్టిగా నవ్వి చాలా సంతోషించారు. చాక్లెట్ బాక్స్ ధోనీకి ఇచ్చారు. ఆ తర్వాత ఆయనతో ఫొటో కూడా దిగారు ధోనీ. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ధోనీ సరదా ఉన్న తీరును నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం అని పొగుడుతున్నారు.
కాగా, గత శుక్రవారం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍తో కలిసి గోల్ఫ్ ఆడారు ధోనీ. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తుఫాన్ సృష్టించాయి. ధోనీ ఈజ్ గ్రేట్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేశారు. కాగా, గోల్ఫ్ ఆడదామంటూ ధోనీకి స్వయంగా ట్రంప్ ఆహ్వానం పంపారని సమాచారం. గతంలోనూ కొన్ని సందర్భాల్లో మహీ గోల్ఫ్ ఆడారు.
ఇటీవలే యూఎస్ ఓపెన్ టోర్నీలో కార్లోస్ అల్కరాజ్, అలెగ్జాండర్ జ్వెరెవ్ మధ్య జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‍కు హాజరయ్యారు ధోనీ. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
మూడేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్‍కు గుడ్‍బై చెప్పిన ఎంఎస్ ధోనీ.. ఐపీఎల్‍లో కొనసాగుతున్నారు. ఈ ఏడాది ఐపీఎల్‍లో ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్.. ఐదోసారి ఐపీఎల్ టైటిల్ దక్కించుకుంది. శరీరం సహకరిస్తే వచ్చే ఏడాది సీజన్ కూడా ఆడతానని ధోనీ చెప్పారు.