తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Virat Kohli: బ‌ర్త్‌డే రోజు సౌతాఫ్రికాపై కోహ్లి 50వ సెంచ‌రీ చేస్తాడు - గ‌వాస్క‌ర్ జోస్యం

Virat Kohli: బ‌ర్త్‌డే రోజు సౌతాఫ్రికాపై కోహ్లి 50వ సెంచ‌రీ చేస్తాడు - గ‌వాస్క‌ర్ జోస్యం

26 October 2023, 10:32 IST

google News
  • Virat Kohli: ఈడెన్ గార్డెన్ వేదిక‌గా సౌతాఫ్రికాపై  పుట్టిన‌రోజు నాడు జ‌రుగ‌నున్న‌ మ్యాచ్‌తో కోహ్లి యాభై సెంచ‌రీలు మైలురాయిని అందుకుంటాడ‌ని టీమ్ ఇండియా దిగ్గ‌జ క్రికెట‌ర్ సునీల్ గ‌వాస్క‌ర్ జోస్యం చెప్పాడు. కోహ్లి 50 సెంచ‌రీల‌పై గ‌వాస్క‌ర్ చేసిన కామెంట్స్ వైర‌ల్ అవుతోన్నాయి.

విరాట్ కోహ్లి
విరాట్ కోహ్లి

విరాట్ కోహ్లి

Virat Kohli: వ‌న్డేల్లో కోహ్లి యాభ‌య్య‌వ సెంచ‌రీ కోసం అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. టీమిండియా త‌ర‌ఫున వ‌న్డేల్లో అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన ప్లేయ‌ర్‌గా స‌చిన్ టెండూల్క‌ర్ (49 సెంచ‌రీలు) ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. అత‌డి రికార్డును బ్రేక్ చేసేందుకు కోహ్లి ఇంకో రెండు సెంచ‌రీల దూరంలోనే ఉన్నాడు.

కోహ్లి 50వ సెంచ‌రీపై టీమిండియా దిగ్గ‌జ క్రికెట‌ర్ సునీల్ గ‌వాస్క‌ర్ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశాడు. కోహ్లి 50వ సెంచ‌రీని అత‌డి బ‌ర్త్‌డే రోజు త‌ప్ప‌కుండా చేస్తాడ‌ని అన్నాడు. కోహ్లి బ‌ర్త్ డే న‌వంబ‌ర్ 5. అదే రోజు వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సౌతాఫ్రికాతో ఈడెన్ గార్డెన్ వేదిక‌గా టీమ్ ఇండియా మ్యాచ్ ఆడ‌నుంది. అదే మ్యాచ్‌లో కోహ్లి 50 సెంచ‌రీల మైలురాయిని అందుకుంటాడ‌ని గ‌వాస్క‌ర్ జోస్యం చెప్పాడు.

బ‌ర్త్ డే రోజు యాభై సెంచ‌రీల‌ మైలురాయిని చేరుకోవ‌డానికి ఈ మ్యాచ్ రూపంలో కోహ్లికి గొప్ప అవ‌కాశం దొరికింద‌ని సునీల్ గ‌వాస్క‌ర్ పేర్కొన్నాడు. ఒక‌వేళ కోహ్లి అనుకున్న‌ట్లుగానే 50వ సెంచ‌రీ పూర్తిచేస్తే ప్రేక్ష‌కులు అత‌డికి త‌ప్ప‌కుండా స్టాండింగ్ ఒవేష‌న్ ఇస్తారు. అభిమానుల చ‌ప్ప‌ట్లు, ఈల‌ల‌తో స్టేడియంలో సంబ‌రాలు మిన్నంటుతాయి.

ఆ సంతోష క్ష‌ణాలు కోహ్లి జీవితంలో ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేనివిగా మిగిలిపోతాయ‌ని గ‌వాస్క‌ర్ అన్నాడు. కోహ్లి 50వ సెంచ‌రీ గురించి గ‌వాస్క‌ర్ చేసిన కామెంట్స్ వైర‌ల్ అవుతోన్నాయి. భార‌త్ వేదిక‌గా జ‌రుగుతోన్న 2023 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో కోహ్లి ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. ఐదు మ్యాచుల్లో 354 ప‌రుగులు చేసిన కోహ్లి ఈ వ‌ర‌ల్డ్ క‌ప్ టాప్ స్కోర‌ర్స్ లిస్ట్‌లో సెకండ్ ప్లేస్‌లో కొన‌సాగుతోన్నాడు.

ఒక సెంచ‌రీ, మూడు హాఫ్ సెంచ‌రీల‌తో దూకుడు మీదున్నాడు. న్యూజిలాండ్‌తో జ‌రిగిన గ‌త మ్యాచ్‌లో 95 ప‌రుగులు చేసిన కోహ్లి తృటిలో సెంచ‌రీ మిస్స‌య్యాడు.

తదుపరి వ్యాసం