తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ipl 2025 Auction: వేలంలో అమ్ముడుపోని డేవిడ్ వార్న‌ర్‌, దేవ్‌ద‌త్ ప‌డిక్క‌ల్‌
ఐపీఎల్ 2025 మెగా వేలం
ఐపీఎల్ 2025 మెగా వేలం

IPL 2025 Auction: వేలంలో అమ్ముడుపోని డేవిడ్ వార్న‌ర్‌, దేవ్‌ద‌త్ ప‌డిక్క‌ల్‌

24 November 2024, 18:52 IST

IPL 2025 Auction Live Updates: ఐపీఎల్ 2025 మెగా వేలంలో రిష‌బ్ పంత్‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ రికార్డులు క్రియేట్ చేశారు. రిష‌బ్ పంత్‌ను 27 కోట్ల‌కు ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ సొంతం చేసుకోగా... శ్రేయ‌స్ అయ్య‌ర్‌ను 26.75 కోట్ల‌కు పంజాబ్ కింగ్స్ ద‌క్కించుకున్న‌ది.

24 November 2024, 18:52 IST

గ‌త ఏడాది కంటే త‌క్కువ‌కే అమ్ముడుపోయిన హ‌ర్ష‌ల్ ప‌టేల్‌

టీమిండియా క్రికెట‌ర్ హ‌ర్ష‌ల్ ప‌టేల్ గ‌త ఏడాది కంటే త‌క్కువే ఈ ఐపీఎల్ మెగా వేలంలో అమ్ముడుపోయాడు. ఈ ఆల్‌రౌండ‌ర్‌ను స‌న్‌రైజ‌ర్స్ 8 కోట్ల‌కు సొంతం చేసుకున్న‌ది. గ‌త వేలంలో 10.75 కోట్ల‌కు ఆర్‌సీబీ హ‌ర్ష‌ల్ ప‌టేల్‌ను కొనుగోలు చేయ‌డం గ‌మ‌నార్హం.

24 November 2024, 18:45 IST

మెక్ గుర్క్‌కు తొమ్మిది కోట్లు...

ఫ్రేజ‌ర్ మెక్ గుర్క్‌ను ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఏకంగా తొమ్మిది కోట్ల‌కు సొంతం చేసుకున్న‌ది. బేస్ ధ‌ర కంటే ఏడు కోట్లు ఎక్కువ‌కే అమ్ముడుపోయాడు.

24 November 2024, 18:41 IST

రాహుల్ త్రిపాఠికి జాక్‌పాట్ - అమ్ముడుపోని వార్న‌ర్‌

క్రికెట‌ర్ రాహుల్ త్రిపాఠికి అదృష్టం క‌లిసివ‌చ్చింది. 75 ల‌క్ష‌ల బేస్ ధ‌ర‌తో వేలంలోకి వ‌చ్చిన అత‌డిని 3.4 కోట్ల‌కు చెన్నై ద‌క్కించుకున్న‌ది. ఆస్ట్రేలియ‌న్ హిట్ట‌ర్ డేవిడ్ వార్న‌ర్ వేలంలో అమ్ముడుపోలేదు. రెండు కోట్ల బేస్ ధ‌ర‌కు కూడా అత‌డిని ఏ ఫ్రాంచైజ్ కొన‌డానికి ఆస‌క్తిని చూప‌లేదు.

24 November 2024, 18:32 IST

హ్యారీ బ్రూక్ 6.25 కోట్లు...

ఇంగ్లాండ్ క్రికెట‌ర్ హ్య‌రీ బ్రూక్ 6.25 కోట్ల‌కు ఢిల్లీ క్యాపిట‌ల్స్ సొంతం చేసుకోగా...సౌతాఫ్రికా క్రికెట‌ర్ మార్‌క్ర‌మ్‌ను రెండు కోట్ల బేస్ ధ‌ర‌కు ల‌క్నో సొంతం చేసుకున్న‌ది.

24 November 2024, 18:30 IST

వేలంలో అమ్ముడుపోని దేవ‌ద‌త్ ప‌డిక్క‌ల్

టీమిండియా క్రికెట‌ర్ దేవ‌ద‌త్ ప‌డిక్క‌ల్‌కు ఫ్రాంచైజ్‌లు పెద్ద షాకిచ్చాయి. అత‌డిని కొనేందుకు ఎవ‌రూ ఆస‌క్తిని చూప‌లేదు. ఐపీఎల్ మెగావేలంలో అమ్ముడుపోని తొలి క్రికెట‌ర్‌గా నిలిచాడు.

24 November 2024, 18:02 IST

గ‌తంలో 17 కోట్లు - ఇప్పుడు 14 కోట్లు...

గ‌త ఐపీఎల్ వేలంలో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ కేఎల్ రాహుల్‌ను 17 కోట్ల‌కు కొన్న‌ది. గ‌త ఏడాదితో పోలిస్తే మూడు కోట్ల‌కు త‌క్కువే ఈ సారి రాహుల్ అమ్ముడుపోయాడు.

24 November 2024, 17:39 IST

ఇప్ప‌టివ‌ర‌కు వేలంలో అమ్ముడుపోయిన క్రికెట‌ర్లు వీళ్లే...

అర్ష‌దీప్ సింగ్ - పంజాబ్ కింగ్స్ - 18 కోట్లు

ర‌బాడా - గుజ‌రాత్ టైటాన్స్ - 10.75 కోట్లు

శ్రేయ‌స్ అయ్య‌ర్ - పంజాబ్ కింగ్స్ - 26.75 కోట్లు

బ‌ట్ల‌ర్ - గుజ‌రాత్ టైటాన్స్ - 15.75 కోట్లు

మిచెల్ స్టార్క్ - ఢిల్లీ క్యాపిట‌ల్స్ - 11.75

పంత్ - ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ - 27 కోట్లు

కేఎల్ రాహుల్ - ఢిల్లీ క్యాపిట‌ల్స్ - 14 కోట్లు

మ‌హ్మ‌ద్ సిరాజ్ - గుజ‌రాత్ టైటాన్స్ - 12.25 కోట్లు

డేవిడ్ మిల్ల‌ర్ - ల‌క్నో - 7.50 కోట్లు

చాహ‌ల్ - పంజాబ్ కింగ్స్ - 18 కోట్లు

లివింగ్ స్టోన్ - ఆర్‌సీబీ -8.75 కోట్లు

ష‌మీ - స‌న్‌రైజ‌ర్స్ - ప‌దికోట్లు

24 November 2024, 17:31 IST

14 కోట్ల‌కు అమ్ముడుపోయిన కేఎల్ రాహుల్‌...

ఐపీఎల్ మెగా వేలంలో టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కేఎల్ రాహుల్‌ను 14 కోట్ల‌కు అమ్ముడుపోయాడు. పంజాబ్ కింగ్స్ అత‌డిని కొనుగోలు చేసింది.

24 November 2024, 17:19 IST

ఆర్‌సీబీ టీమ్‌లోకి హిట్ట‌ర్‌...

వేలంలో ఆర్‌సీబీ తొలి ఆట‌గాడినికి కొన్న‌ది. ఇంగ్లండ్ హిట్ట‌ర్ లియ‌మ్ లివింగ్‌స్టోన్‌ను 8.75 కోట్ల‌కు ఆర్‌సీబీ పోటీప‌డి ద‌క్కించుకున్న‌ది.

24 November 2024, 17:14 IST

గుజ‌రాత్‌కు సిరాజ్‌...

హైద‌రాబాదీ పేస‌ర్ మ‌హ్మ‌ద్ సిరాజ్ ఐపీఎల్ 2025లో గుజ‌రాత్ టైటాన్స్ త‌ర‌ఫున బ‌రిలో దిగ‌బోతున్నాడు. రెండు కోట్ల బేస్ ధ‌ర‌తో ఐపీఎల్ వేలంలో నిలిచిన అత‌డిని గుజ‌రాత్ 12.25 కోట్ల‌కు కొన్న‌ది.

24 November 2024, 17:09 IST

18 కోట్లు ధ‌ర ప‌లికిన చాహ‌ల్‌...

టీమిండియా స్పిన్న‌ర్ యుజ్వేంద్ర చాహ‌ల్ ఐపీఎల్ వేలంలో భారీ ధ‌ర ప‌లికాడు. ప‌దికొట్ట‌కు పంజాబ్ కింగ్స్ ఈ స్పిన్న‌ర్‌ను ద‌క్కించుకున్న‌ది. సౌతాఫ్రికా హిట్ట‌ర్ డేవిడ్ మిల్ల‌ర్‌ను ఏడున్న‌ర కోట్ల‌కు ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ కొనుగోలు చేసింది.

24 November 2024, 16:54 IST

రిష‌బ్ పంత్ టాప్‌...

ఇప్ప‌టివ‌ర‌కు ఐపీఎల్ వేలంలో రిష‌బ్ పంత్‌, శ్రేయ‌స్ అయ్య‌ర్‌, అర్ష‌దీప్ సింగ్‌, మ‌హ్మ‌ద్ ష‌మీ తో పాటు విదేశీ క్రికెట‌ర్లు కాసిగో ర‌బాడా, బ‌ట్ల‌ర్‌, స్టార్క్ అమ్ముడుపోయారు. ఇందులో 27 కోట్ల‌తో పంత్ టాప్‌లో నిల‌వ‌గా...26.75 కోట్ల‌తో శ్రేయ‌స్ అయ్య‌ర్ రెండో స్థానంలో ఉన్నాడు.

24 November 2024, 16:53 IST

ష‌మీకి ప‌ది కోట్లు...

టీమిండియా పేస‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీని కొనేందుకు కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌, చెన్నై పోటీప‌డుతూ ధ‌ర‌ను పెంచుతూ వ‌చ్చాయి. ఎనిమిది కోట్ల వ‌ద్ద ల‌క్నో పోటీలోకి వ‌చ్చింది. చివ‌ర‌కు ప‌ది కోట్ల‌కు స‌న్‌రైజ‌ర్స్ ఆర్‌టీఎమ్ ఆప్ష‌న్ విధానంలో ష‌మీని కొనుగోలు చేసింది.

24 November 2024, 16:41 IST

రిష‌బ్ పంత్ 27 కోట్లు...

రిష‌బ్ పంత్ ఐపీఎల్ మెగా వేలంలో 27 కోట్ల‌కు అమ్ముడుపోయాడు. అత‌డిని ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ వేలంలో ద‌క్కించుకున్న‌ది. ఐపీఎల్‌లో అత్య‌ధిక ధ‌ర‌కు అమ్ముడుపోయిన టీమిండియా ప్లేయ‌ర్‌గా రిష‌బ్ పంత్ నిలిచింది. 20.75కి అత‌డిని ద‌క్కించుకోవాల‌ని ల‌క్నో అనుకున్న‌ది. ఆర్‌టీఎమ్ ఆప్ష‌న్ కార‌ణంగా అత‌డి ధ‌ర 27 కోట్ల‌కు చేరుకుంది.

24 November 2024, 16:32 IST

శ్రేయ‌స్ అయ్య‌ర్ రికార్డ్‌

శ్రేయ‌స్ అయ్య‌ర్ గ‌త ఏడాది ఐపీఎల్ వేలంలో 12.25 కోట్ల‌కు అమ్ముడుపోగా...ఈ సారి ఏకంగా 26.75 కోట్ల ధ‌ర ప‌లికాడు. ఐపీఎల్‌లోనే అత్య‌ధిక ధ‌ర‌కు అమ్ముడుపోయిన టీమిండియా క్రికెట‌ర్‌గా రికార్డ్ క్రియేట్ చేశాడు.

24 November 2024, 16:29 IST

ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు స్టార్క్‌...

ఆస్ట్రేలియా ఆల్‌రౌండ‌ర్ మిచెల్ స్టార్క్‌ను ఢిల్లీ క్యాపిట‌ల్స్ 11.75 కోట్ల‌కు సొంతం చేసుకున్న‌ది.

24 November 2024, 16:26 IST

గుజ‌రాత్‌కు జోస్ బ‌ట్ల‌ర్‌

ఇంగ్లండ్ హిట్ట‌ర్ జోస్ బ‌ట్ల‌ర్‌ను 15.75 కోట్ల‌కు గుజ‌రాత్ టైటాన్స్ కొన్న‌ది.

24 November 2024, 16:21 IST

ఇప్ప‌టివ‌ర‌కు అమ్ముడు పోయిన క్రికెట‌ర్లు వీళ్లే...

ఇప్ప‌టివ‌ర‌కు ఐపీఎల్ వేలంలో ముగ్గురు క్రికెట‌ర్లు అమ్ముడుపోయారు. అర్ష‌దీప్ సింగ్ 18 కోట్లు (పంజాబ్ కింగ్స్‌)...కాసిగో ర‌బాడా (గుజ‌రాత్ టైటాన్స్ ) -10.75 కోట్ల‌కు అమ్ముడుపోయారు. శ్రేయ‌స్ అయ్య‌ర్ 26.75 కోట్ల‌కు పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది. ఐపీఎల్‌లో అత్య‌ధిక ధ‌ర‌కు అమ్ముడుపోయిన టీమిండియా క్రికెట‌ర్‌గా శ్రేయ‌స్ అయ్య‌ర్ రికార్డ్ క్రియేట్ చేశాడు.

24 November 2024, 16:18 IST

శ్రేయ‌స్ అయ్య‌ర్‌క‌కు 26 కోట్ల 75 ల‌క్ష‌లు...

టీమిండియా క్రికెట‌ర్ శ్రేయ‌స్ అయ్య‌ర్‌ను కొనేందుకు కోల్‌క‌తా, పంజాబ్ ఆస‌క్తిని చూపాయి. ఆ త‌ర్వాత పోటీలోకి పంజాబ్‌, ఢిల్లీ వ‌చ్చాయి. ధ‌ర‌ను ఇర‌వై కోట్ల‌కుపైగా పెంచుతూ పోతాయి. చివ‌ర‌కు 26 కోట్ల 75 ల‌క్ష‌ల‌క‌కు పంజాబ్ కింగ్స్ శ్రేయ‌స్ అయ్య‌ర్‌ను ద‌క్కించుకున్న‌ది.

24 November 2024, 16:02 IST

ర‌బాడాను 10.75 కోట్ల‌కు ద‌క్కించుకున్న గుజ‌రాత్‌

సౌతాఫ్రికా పేస‌ర్ కాసిగో ర‌బాడాను ఐపీఎల్ వేలంలో ద‌క్కించుకునేందుకు అన్ని ఫ్రాంఛైజ్‌లు పోటీప‌డ్డాయి. 10.75 కోట్ల‌కు గుజ‌రాత్ టైటాన్స్ ర‌బాడాను సొంతం చేసుకున్న‌ది. ఐపీఎల్ మెగా ఆక్ష‌న్ 2025లో అమ్ముడుపోయిన ఫ‌స్ట్ విదేశీ ప్లేయ‌ర్‌గా ర‌బాడా నిలిచాడు.

24 November 2024, 15:58 IST

18 కోట్ల‌కు అమ్ముడుపోయిన అర్ష‌దీప్ సింగ్‌...

ఐపీఎల్ 2025లో వేలంలోకి వ‌చ్చిన ఫ‌స్ట్ క్రికెట‌ర్‌గా అర్ష‌దీప్ సింగ్ నిలిచాడు. రెండు కోట్ల బేస్ ధ‌ర‌తో అత‌డు వేలంలోకి వ‌చ్చాడు. ఈ పేస‌ర్ కోసం చెన్నై, ఢిల్లీ పోటీప‌డ్డాయి. ఆ త‌ర్వాత మిగిలిన ఫ్రాంఛైజ్‌లు పోటీలోకి వ‌చ్చాయి. ధ‌ర‌ను పెంచుతూ పోయాయి. ప‌ద్దెనిమిది కోట్ల‌క‌కు పంజాబ్ కింగ్స్ అత‌డిని సొంతం చేసుకున్న‌ది. రైట్ టూ మ్యాచ్ ఆప్ష‌న్ ద్వారా అత‌డిని సొంతం చేసుకున్న‌ది.

24 November 2024, 15:38 IST

ఆక్షనర్‌గా మల్లికా సాగర్

ఐపీఎల్ 2025 మెగా వేలానికి ఆక్షనర్‌గా మల్లికా సాగర్ వ్యవహరిస్తున్నారు. ఆమె ఐపీఎల్ 2024 మినీ వేలానికీ కూడా ఆక్షనర్‌‌‌గా పనిచేశారు. అలానే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలానికి కూడా ఆక్షనర్‌గా వ్యవహరించారు.

24 November 2024, 15:30 IST

జేమ్స్ అండ‌ర‌న్స్ 42 ఏళ్లు- వైభ‌వ్ సూర్య వ‌న్షీ 13 ఏళ్లు...

ఐపీఎల్ వేలంలో పోటీప‌డుతోన్న అత్య‌ధిక వ‌య‌స్కుడైన క్రికెట‌ర్‌గా ఇంగ్లండ్ పేస‌ర్ జేమ్స్ అండ‌ర్స‌న్ (42 ఏళ్లు) నిల‌వ‌నున్నాడు. అతి పిన్న వ‌య‌స్కుడిగా ఇండియాకు చెందిన అన్‌క్యాప్‌డ్ ప్లేయ‌ర్‌ వైభ‌వ్ సూర్య‌వ‌న్షీ అదృష్టాన్నీ ప‌రీక్షించుకోనున్నాడు.

24 November 2024, 14:36 IST

అదృష్టాన్ని పరీక్షించుకోనున్న విదేశీ స్టార్లు

విదేశీ స్టార్ ప్లేయర్లు కూడా రూ. కోట్ల కనీస ధరతో వేలంలో ఉన్నారు. వీరిలో ఆస్ట్రేలియాకి చెందిన డేవిడ్ వార్నర్‌, మిచెల్ స్టార్క్‌, మార్కస్‌ స్టాయినిస్‌, గ్లెన్ మాక్స్‌వెల్‌ భారీ ధర పలికే అవకాశం ఉంది. అలానే ఇంగ్లాండ్‌కి చెందిన జోస్ బట్లర్,హ్యారీ బ్రూక్‌, జానీ బెయిర్‌స్టో కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఫాస్ట్ బౌలర్లు ట్రెంట్‌ బౌల్ట్‌, కగిసో రబాడాకి ఫ్రాంఛైజీలు పెద్ద ఎత్తున ఖర్చు చేసే అవకాశం ఉంది.

24 November 2024, 14:35 IST

రూ.2 కోట్ల కనీస ధరతో వేలానికి భారత్ క్రికెటర్లు

రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్‌, శ్రేయాస్ అయ్యర్, స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, మణికట్టు స్పిన్నర్ యుజ్వేందర్ చాహల్, ఫాస్ట్ బౌలర్లు అర్షదీప్ సింగ్, మహ్మద్ షమీ, దీపక్ చాహర్, మహ్మద్ సిరాజ్ తదితరులు ఉన్నారు. వీరి కోసం ఫ్రాంఛైజీలు గట్టిగా పోటీపడే అవకాశం ఉంది. ఇక ఆల్‌రౌండర్లు వాషింగ్టన్ సుందర్‌, శార్దుల్‌ ఠాకూర్‌ కోసం ఫ్రాంఛైజీ భారీగా వెచ్చించేందుకు సిద్ధమవుతున్నాయి.

24 November 2024, 14:34 IST

ఏ ఫ్రాంఛైజీ వద్ద ఎంత డబ్బు?

పంజాబ్ కింగ్స్ వద్ద రూ.110.5 కోట్లు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వద్ద రూ.83 కోట్లు

ఢిల్లీ క్యాపిటల్స్ వద్ద రూ.73 కోట్లు

గుజరాత్ టైటాన్స్ వద్ద రూ.69 కోట్లు

లక్నో సూపర్ జెయింట్స్ వద్ద రూ.69 కోట్లు

చెన్నై సూపర్ కింగ్స్ వద్ద రూ.55 కోట్లు

కోల్‌కతా నైట్‌రైడర్స్ వద్ద రూ.51 కోట్లు

ముంబయి ఇండియన్స్ వద్ద రూ45 కోట్లు

సన్‌రైజర్స్ హైదరాబాద్ వద్ద రూ.45 కోట్లు

రాజస్థాన్ రాయల్స్ వద్ద రూ.41 కోట్లు

24 November 2024, 14:01 IST

367 మంది భార‌త క్రికెట‌ర్లు...

ఐపీఎల్ వేలంలో ప‌ది ఫ్రాంఛైజ్‌ల‌లో క‌లిపి 204 స్థానాలు మాత్ర‌మే ఖాళీగా ఉన్నాయి. వీటి కోసం 577 మంది క్రికెట‌ర్లు వేలంలో పోటీప‌డుతోన్నారు. ఇందులో 367 మంది భార‌త క్రికెట‌ర్లు ఉండ‌గా...210 మంది విదేశీ ప్లేయ‌ర్లు ఉన్నారు.

    ఆర్టికల్ షేర్ చేయండి