తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Srh Vs Csk Live: అప్పుడు రికార్డు స్కోరు.. ఇప్పుడు మోస్తరుకే పరిమితం.. సీఎస్కేను కట్టడి చేసిన సన్ రైజర్స్

SRH vs CSK Live: అప్పుడు రికార్డు స్కోరు.. ఇప్పుడు మోస్తరుకే పరిమితం.. సీఎస్కేను కట్టడి చేసిన సన్ రైజర్స్

Hari Prasad S HT Telugu

05 April 2024, 21:13 IST

google News
    • SRH vs CSK Live: సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఓ మోస్తరు స్కోరు పరిమితమైంది. ముంబై ఇండియన్స్ పై భారీ స్కోరు నమోదైన ఉప్పల్ స్టేడియం పిచ్.. ఈసారి మాత్రం భిన్నంగా వ్యవహరించింది
అప్పుడు రికార్డు స్కోరు.. ఇప్పుడు మోస్తరుకే పరిమితం.. సీఎస్కేను కట్టడి చేసిన సన్ రైజర్స్
అప్పుడు రికార్డు స్కోరు.. ఇప్పుడు మోస్తరుకే పరిమితం.. సీఎస్కేను కట్టడి చేసిన సన్ రైజర్స్ (PTI)

అప్పుడు రికార్డు స్కోరు.. ఇప్పుడు మోస్తరుకే పరిమితం.. సీఎస్కేను కట్టడి చేసిన సన్ రైజర్స్

SRH vs CSK Live: ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు 277 రన్స్ చేసింది. అదే ఉప్పల్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం తక్కువ స్కోరుకే పరిమితమైంది. ఆ పిచ్ తో పోలిస్తే ఇప్పటి పిచ్ పూర్తి నెమ్మదిగా ఉండటంతో సీఎస్కే 20 ఓవర్లలో 5 వికెట్లకు 165 రన్స్ చేసింది.

శివమ్ దూబె, రహానే మాత్రమే..

చెన్నై సూపర్ కింగ్స్ తరఫున శివమ్ దూబె, అజింక్య రహానే రాణించడంతో ఆ టీమ్ ఆ మాత్రం స్కోరైనా చేసింది. దూబె 24 బంతుల్లోనే 45 రన్స్ చేశాడు. మిగతా బ్యాటర్లు తడబడిన అదే పిచ్ పై అతడు మాత్రం 4 సిక్స్ లు, 2 ఫోర్లతో చెలరేగడం విశేషం. మరోవైపు వెటరన్ బ్యాటర్ అజింక్య రహానే 30 బంతుల్లో 35 రన్స్ చేశాడు. అతడు 2 ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు.

ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ముంబై ఇండియన్స్ పై టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ రికార్డు స్కోరు చేసింది. అలాంటిది ఈ మ్యాచ్ లో ఫీల్డింగ్ ఎంచుకోవడం ఆశ్చర్యం కలిగించింది. అయితే అతడు ఎందుకా నిర్ణయం తీసుకున్నాడో కాసేపటికే అర్థమైంది.

పిచ్ నెమ్మదిగా ఉండటంతో పరుగులు అంత సులువుగా రాలేదు. చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్లు రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్ అనుకున్న స్పీడులో ఇన్నింగ్స్ ప్రారంభించలేదు. 25 రన్స్ దగ్గర రవీంద్ర (12) ఔటయ్యాడు. తర్వాత కెప్టెన్ రుతురాజ్ కూడా 21 బంతుల్లో 26 రన్స్ చేసి పెవిలియన్ చేరాడు. ఈ సమయంలో రహానే, శివమ్ దూబె కలిసి మూడో వికెట్ కు 65 రన్స్ జోడించారు.

చివర్లో రవీంద్ర జడేజా 23 బంతుల్లోనే 31 రన్స్ చేయడంతో చెన్నై ఆ మాత్రం స్కోరైనా సాధించగలిగింది. మూడు బంతులు మిగిలి ఉండగా ధోనీ క్రీజులోకి వచ్చాడు. అతన్ని చూడగానే ఉప్పల్ స్టేడియం హోరెత్తిపోయింది. అయితే అతడు మాత్రం రెండు బాల్స్ ఆడిన ఒక పరుగు మాత్రమే చేశాడు.

సన్ రైజర్స్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 4 ఓవర్లలో 28 రన్స్ ఇచ్చిన ఒక వికెట్, కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 4 ఓవర్లలో 29 రన్స్ ఇచ్చి ఒక వికెట్, జైదేవ్ ఉనద్కట్ 4 ఓవర్లలో 29 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నారు. ఈ ముగ్గురు బౌలర్లు చెన్నై బ్యాటర్లను కట్టడి చేశారు. అయితే పిచ్ నెమ్మదిగా ఉండటంతో ఈ టార్గెట్ చేజ్ చేయడం కూడా సన్ రైజర్స్ కు అంత సులువు కాకపోవచ్చు.

తదుపరి వ్యాసం