తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ipl 2024 Playoffs Race: ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్ చేరేది ఎవరు.. 16 మ్యాచ్‌లు.. ఇంకా రేసులోనే ఉన్న 9 టీమ్స్

IPL 2024 Playoffs race: ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్ చేరేది ఎవరు.. 16 మ్యాచ్‌లు.. ఇంకా రేసులోనే ఉన్న 9 టీమ్స్

Hari Prasad S HT Telugu

06 May 2024, 15:35 IST

    • IPL 2024 Playoffs race: ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్ రేసు రోజురోజుకూ రసవత్తరంగా మారుతోంది. ఇంకా లీగ్ స్టేజ్ లో 16 మ్యాచ్ లు ఉండగా.. ఇప్పటికీ 9 జట్లు ఆ నాలుగు బెర్తుల కోసం రేసులోనే ఉండటం విశేషం.
ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్ చేరేది ఎవరు.. 16 మ్యాచ్‌లు.. ఇంకా రేసులోనే ఉన్న 9 టీమ్స్
ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్ చేరేది ఎవరు.. 16 మ్యాచ్‌లు.. ఇంకా రేసులోనే ఉన్న 9 టీమ్స్ (PTI)

ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్ చేరేది ఎవరు.. 16 మ్యాచ్‌లు.. ఇంకా రేసులోనే ఉన్న 9 టీమ్స్

IPL 2024 Playoffs race: ఐపీఎల్ ప్లేఆఫ్స్ రేసు ప్రతి ఏడాది ఆకస్తికరమే. మొదట్లో కొన్ని టీమ్స్ వరుస విజయాలతో టాప్ లోకి దూసుకెళ్లడం, ఆ టీమ్స్ ప్లేఆఫ్స్ చేరడం ఖాయం అనుకున్న సమయంలో కింద ఉన్న జట్ల సంచలన విజయాలతో చివరి లీగ్ మ్యాచ్ వరకూ ఉత్కంఠ నెలకొనడం సాధారణమైపోయింది. ఐపీఎల్ 2024లోనూ అదే జరుగుతోంది. ఇప్పటికే 54 లీగ్ మ్యాచ్ లు ముగిసినా.. రేసులో ఒక్క ముంబై ఇండియన్స్ తప్ప మిగిలిన 9 జట్లూ ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు

RCB vs CSK : ధోనీ కోపం.. కోహ్లీ ఎమోషనల్​- ట్రెండింగ్​లో ‘డెఫినెట్లీ నాట్​’! క్రికెట్​ అంటే ఇదే..

Virat Kohli: అంపైర్‌తో గొడవకు దిగిన విరాట్ కోహ్లీ.. అలా చేయమంటూ ఒత్తిడి.. చివరికీ..!

CSK vs RCB: ప్లేఆఫ్స్ చేరిన బెంగళూరు.. చిన్నస్వామిలో అద్భుత విజయం.. వరుసగా ఆరో గెలుపు.. చెన్నై ఎలిమినేట్

RCB vs CSK: బాదేసిన బెంగళూరు.. డుప్లెసిస్, కోహ్లీ, పాటిదార్ మెరుపులు.. చెన్నై ముందు భారీ టార్గెట్.. ప్లేఆఫ్స్ చేరాలంటే..

ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్ రేసు

ఐపీఎల్ 2024లో ఆదివారానికి (మే 5) రెండు జట్లు మినహా మిగిలిన అన్ని టీమ్స్ 11 మ్యాచ్ లు ఆడేశాయి. సన్ రైజర్స్ సోమవారం (మే 6) తన 11వ మ్యాచ్ ఆడనుంది. ఇప్పటికీ ఒక్క జట్టు కూడా ప్లేఆఫ్స్ కు అర్హత సాధించలేదు. రాజస్థాన్ రాయల్స్ చేరువగా వచ్చినా.. సన్ రైజర్స్ చేతుల్లో ఒక్క పరుగు ఓటమితో ఇంకా వేచి చూడాల్సి వస్తోంది. ప్రస్తుతం కేకేఆర్ 11 మ్యాచ్ లలో 16 పాయింట్లతో టాప్ లో ఉండగా.. ముంబై అవే 11 మ్యాచ్ లలో కేవలం మూడు విజయాలతో చివరి స్థానంలో ఉంది.

ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ అవకాశాలు దాదాపుగా లేనట్లే. వర్చువల్ గా చూస్తే మిగిలిన 9 జట్లూ నాలుగు ప్లేఆఫ్స్ బెర్తుల కోసం రేసులో ఉన్నాయి. మరి వీటిలో ఏ జట్టు పరిస్థితి ఎలా ఉంది? వీళ్లలో ప్లేఆఫ్స్ చేరేది ఎవరో ఇక్కడ చూడండి.

రాజస్థాన్ రాయల్స్

రాజస్థాన్ రాయల్స్ 10 మ్యాచ్ లలో 8 గెలిచింది. మరో నాలుగు మ్యాచ్ లు మిగిలి ఉన్నాయి. వీటిలో ఒక్కటి గెలిచినా ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయమవుతుంది. ఢిల్లీ, చెన్నై, పంజాబ్, కోల్‌కతాలతో చివరి నాలుగు మ్యాచ్ లు ఉన్నాయి. మంగళవారం (మే 7) ఢిల్లీపై గెలిస్తే రాయల్స్ ప్లేఆఫ్స్ చేరుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరి కంటే ఎక్కువ ప్లేఆఫ్స్ అవకాశాలు రాయల్స్ కే ఉన్నాయి.

కోల్‌కతా నైట్ రైడర్స్

కోల్‌కతా నైట్ రైడర్స్ 11 మ్యాచ్ లలో 8 గెలిచి, మూడు ఓడింది. ప్రస్తుతం టాప్ లో ఉంది. వాళ్ల నెట్ రన్ రేట్ అన్ని టీమ్స్ కంటే చాలా బాగుంది. ఆ టీమ్ ఇంకా ముంబై, గుజరాత్, రాజస్థాన్ లతో ఆడాల్సి ఉంది. నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉండటంతో ఈ మూడింట్లో కనీసం ఒక్కటి గెలిచినా ప్లేఆఫ్స్ చేరడం ఖాయం. గుజరాత్ పై కేకేఆర్ గెలవడం కాస్త సులువు కావచ్చు.

చెన్నై సూపర్ కింగ్స్

డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ 11 మ్యాచ్ లలో 6 గెలిచి, ఐదు ఓడింది. ఆదివారం (మే 5) పంజాబ్ కింగ్స్ పై గెలుపుతో మళ్లీ మూడో స్థానంలోకి వచ్చింది. ఆ టీమ్ ఇంకా గుజరాత్, రాజస్థాన్, ఆర్సీబీలతో ఆడాల్సి ఉంది. అయితే మూడింట్లో కనీసం రెండు కచ్చితంగా గెలవాలి. అలా అయితే మిగిలిన జట్ల ఫలితాలతో సంబంధం లేకుండా ప్లేఆఫ్స్ పై ఆశలు పెట్టుకోవచ్చు.

సన్ రైజర్స్ హైదరాబాద్

సన్ రైజర్స్ ప్రస్తుతం 10 మ్యాచ్ లలో ఆరు విజయాలతో నాలుగో స్థానంలో ఉంది. వాళ్ల దగ్గర 12 పాయింట్ల ఉన్నాయి. సోమవారం (మే 6) ముంబై ఇండియన్స్ తో ఆడనుంది. ఇది కాకుండా లక్నో, గుజరాత్, పంజాబ్ లతో మ్యాచ్ లు ఉన్నాయి. చివరి మూడు మ్యాచ్ లూ సొంత మైదానంలో ఉండటం వాళ్లకు కలిసి వచ్చేదే. ఈ నాలిగింట్లో కనీసం రెండు కచ్చితంగా గెలవాలి.

లక్నో సూపర్ జెయింట్స్

ఆదివారం (మే 5) కేకేఆర్ చేతుల్లో భారీ ఓటమి తర్వాత టాప్ 4 నుంచి లక్నో వెళ్లిపోయింది. ఆ టీమ్ 11 మ్యాచ్ లలో 6, గెలిచి, 5 ఓడి ఐదో స్థానంలో ఉంది. నెట్ రన్ రేట్ కూడా నెగటివ్ గా ఉంది. దీంతో చివరి మూడు మ్యాచ్ లలో సన్ రైజర్స్, ఢిల్లీ, ముంబైలపై కనీసం రెండింట్లో అయినా భారీ విజయాలు సాధించాల్సి ఉంటుంది. అయితే ఈ మూడూ ప్రత్యర్థి మైదానాల్లో కావడం ఆ జట్టుకు ప్రతికూలాంశం.

ఢిల్లీ క్యాపిటల్స్

ఢిల్లీ క్యాపిటల్స్ సీజన్ మధ్యలో అనూహ్యంగా దూసుకొచ్చింది. ఆ టీమ్ 11 మ్యాచ్ లలో 5 గెలిచి, 6 ఓడింది. ఇక చివరి మూడు మ్యాచ్ లను రాజస్థాన్, ఆర్సీబీ, లక్నోలతో ఆడాల్సి ఉంది. ఈ మూడూ గెలిస్తే ప్లేఆఫ్స్ పై ఆశలు పెట్టుకోవచ్చు. రెండు గెలిస్తే మాత్రం మిగిలిన జట్ల నుంచి తమకు అనుకూల ఫలితాలు ఆశించాల్సి ఉంటుంది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

ఆర్సీబీ కూడా హ్యాట్రిక్ విజయాలతో ప్లేఆఫ్స్ ఆశలు మిణుకుమిణుకుమంటున్నాయి. అయితే అది అస్సలు సులువు కాదు. ఆ టీమ్ 11 మ్యాచ్ లలో నాలుగు గెలిచి, ఏడు ఓడింది. మిగిలి మూడు మ్యాచ్ లను పంజాబ్, ఢిల్లీ, చెన్నైలతో ఆడాలి. మూడు కచ్చితంగా గెలవాలి. అలా అయితే 14 పాయింట్లకు వెళ్తారు. అప్పటికి కూడా మిగిలిన జట్ల ఫలితాలు, తమ నెట్ రన్ రేట్ పై ఆధారపడాలి.

పంజాబ్ కింగ్స్

చెన్నై సూపర్ కింగ్స్ చేతుల్లో ఓటమితో పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్ ఆశలు దెబ్బ పడింది. ఆ టీమ్ కూడా 11 మ్యాచ్ లలో కేవలం 4 గెలిచి, ఏడు ఓడింది. మిగిలిన మూడు మ్యాచ్ లను ఆర్సీబీ, రాజస్థాన్, సన్ రైజర్స్ తో ఆడాల్సి ఉంది. మూడింట్లోనూ కచ్చితంగా గెలవాలి. అయితే అది అస్సలు సులువు కాదు. ఒకవేళ గెలిచినా మిగిలిన జట్ల గెలుపోటములపై ఆధారపడాలి.

గుజరాత్ టైటన్స్

గతేడాది ఫైనలిస్టులు గుజరాత్ టైటన్స్ 11 మ్యాచ్ లలో 4 గెలిచి, ఏడు ఓడింది. ఆ టీమ్ చివరి మూడు మ్యాచ్ లలో చెన్నై, కేకేఆర్, సన్ రైజర్స్ తో ఆడాల్సి ఉంది. మూడు కచ్చితంగా గెలవాల్సిందే. నెట్ రన్ రేట్ కూడా బాగా లేకపోవడంతో వీటిలో భారీ విజయాలు సాధించడమే కాదు.. మిగిలిన జట్ల ఫలితాలపై ఆధారపడాలి.

తదుపరి వ్యాసం