Jasprit Bumrah: బుమ్రాకు ముంబై ఇండియన్స్ ఇక రెస్ట్ ఇవ్వాలా? ఎందుకో చెప్పిన టీమిండియా మాజీ బ్యాటర్-mumbai indians should rest jasprit bumrah team india ex batter wasim jaffer comments ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Jasprit Bumrah: బుమ్రాకు ముంబై ఇండియన్స్ ఇక రెస్ట్ ఇవ్వాలా? ఎందుకో చెప్పిన టీమిండియా మాజీ బ్యాటర్

Jasprit Bumrah: బుమ్రాకు ముంబై ఇండియన్స్ ఇక రెస్ట్ ఇవ్వాలా? ఎందుకో చెప్పిన టీమిండియా మాజీ బ్యాటర్

Chatakonda Krishna Prakash HT Telugu
May 04, 2024 06:18 PM IST

Jasprit Bumrah - Mumbai Indians: ఐపీఎల్ 2024 సీజన్‍లో ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ అవకాశాలు దాదాపు ఆవిరయ్యాయి. ఈ తరుణంలో స్టార్ పేసర్ జస్‍ప్రీత్ బుమ్రాకు రెస్ట్ ఇవ్వాలని భారత మాజీ బ్యాటర్ వసీం జాఫర్ అభిప్రాయపడ్డారు. ఎందుకంటే..

Jasprit Bumrah: బుమ్రాకు ముంబై ఇండియన్స్ ఇక రెస్ట్ ఇవ్వాలా? ఎందుకో చెప్పిన టీమిండియా మాజీ బ్యాటర్
Jasprit Bumrah: బుమ్రాకు ముంబై ఇండియన్స్ ఇక రెస్ట్ ఇవ్వాలా? ఎందుకో చెప్పిన టీమిండియా మాజీ బ్యాటర్ (AP)

Jasprit Bumrah: ఐపీఎల్ 2024 సీజన్‍లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. హోం గ్రౌండ్ వాంఖడేలో శుక్రవారం కోల్‍కతా నైట్‍రైడర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‍లో ముంబై మోస్తరు టార్గెట్ ఛేదించలేక ఓడిపోయింది. దీంతో ఇప్పటి వరకు 11 మ్యాచ్‍ల్లో 3 మాత్రమే గెలిచి ఎనిమిది ఓడింది. దీంతో ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్.. ఈసారి ప్లేఆఫ్స్ చేరడం దాదాపు అసాధ్యంగా మారింది. హార్దిక్ పాండ్యా సారథ్యంలో ముంబై ఈ సీజన్‍లో నిరాశపరుస్తోంది. ఈ తరుణంలో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీకి భారత మాజీ బ్యాటర్ వసీం జాఫర్ ఓ సలహా ఇచ్చారు.

ముంబై ఇండియన్స్ ఓటముల పాలవుతున్నా.. ఆ జట్టు స్టార్ పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా మాత్రం అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. 11 మ్యాచ్‍ల్లో 17 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం పర్పుల్ క్యాప్‍ను కూడా సొంతం చేసుకున్నాడు. కేవలం 6.45 ఎకానమీనే నమోదు చేసి అదరగొట్టాడు. జూన్‍లో జరిగే టీ20 ప్రపంచకప్‍లో భారత జట్టులో బుమ్రానే కీలకంగా ఉండనున్నాడు.

రెస్ట్ ఇస్తే మంచిది

ప్లేఆఫ్స్ చేరడం సాధ్యం కాదని ఖరారైన తరుణంలో పేసర్ జస్‍ప్రీత్ బుమ్రాకు ముంబై మేనేజ్‍మెంట్ రెస్ట్ ఇవ్వాలని వసీం జాఫర్ అభిప్రాయపడ్డారు. బుమ్రాకు విశ్రాంతి ఇస్తే అది టీమిండియాకు మంచిదని అన్నాడు.

టీ20 ప్రపంచకప్ టోర్నీకి నెల కూడా సమయం లేని నేపథ్యంలో బుమ్రాకు రెస్ట్ ఇవ్వాలని జాఫర్ చెప్పారు. బుమ్రాకు విశ్రాంతి విషయంలో జాఫర్ స్పందిచారు. “అవును. ఓ మ్యాచ్ తర్వాత.. ఒకవేళ వాళ్లు ప్లేఆఫ్స్ వెళ్లలేమని తెలిస్తే బుమ్రాకు రెస్ట్ ఇవ్వాలి. ఇండియాలో ఉన్నప్పుడే అతడి విశ్రాంతిస్తే మంచిది” అని జాఫర్ చెప్పారు.

ముంబై తదుపరి మ్యాచ్‍లు

ఐపీఎల్ 2024 సీజన్ ప్లేఆఫ్స్ రేసు నుంచి ముంబై ఇండియన్స్ దాదాపు ఔట్ అయింది. 11 మ్యాచ్‍ల్లో 8 ఓడి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది. లీగ్ దశలో ఆ జట్టు ఇంకో మూడు మ్యాచ్‍లు ఆడాల్సిఉంది. ఆ మూడు మ్యాచ్‍లో గెలిచినా ప్లేఆఫ్స్ చేరడం దాదాపు అసాధ్యమే. మే 6వ తేదీన సన్‍రైజర్స్ హైదరాబాద్‍తో, మే 11న కోల్‍కతా నైట్‍రైడర్స్ జట్టుతో, మే 17న లక్నో సూపర్ జెయింట్స్‌తో ముంబై తలపడనుంది. ఇప్పటికే ఈ సీజన్‍లో ఆ జట్లతో ముంబై ఓడిపోయింది.

కోల్‍కతాతో శుక్రవారం జరిగిన మ్యాచ్‍లో ముంబై విఫలమైంది. 170 పరుగులు కూడా ఛేదించలేకపోయింది. 18.5 ఓవర్లలో కేవలం 145 పరుగులకే కుప్పకూలింది. సూర్యకుమార్ యాదవ్ (56) ఒక్కడే అర్ధ శతకంతో పోరాడగా మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు. దీంతో కనీసం పూర్తి ఓవర్లు ఆడి పోరాడలేకపోయింది ముంబై ఇండియన్స్. కోల్‍కతా బౌలర్ల దాటికి ముంబై వరుసగా వికెట్లు కోల్పోయింది. అంతకు ముందు తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‍కతా 19.5 ఓవర్లలో 169 పరుగులు చేసింది. ఆరంభంలో వికెట్లు పడినా.. వెంకటేశ్ అయ్యర్ (70), మనీష్ పాండే (42) అదరగొట్టారు. ముంబై పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా 3.5 ఓవర్లలో కేవలం 18 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. అయితే, బ్యాటింగ్‍లో విఫలమైన ముంబై మరో ఓటమిని మూటగట్టుకుంది. 10 మ్యాచ్‍ల్లో ఏడు గెలుపులతో కోల్‍కతా ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది.

Whats_app_banner