తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Dc Vs Mi: తడాఖా చూపిన ఢిల్లీ.. భారీ లక్ష్యాన్ని ఛేదించలేకపోయిన ముంబై.. చివరి వరకు పోరాడిన తెలుగు ప్లేయర్ తిలక్

DC vs MI: తడాఖా చూపిన ఢిల్లీ.. భారీ లక్ష్యాన్ని ఛేదించలేకపోయిన ముంబై.. చివరి వరకు పోరాడిన తెలుగు ప్లేయర్ తిలక్

27 April 2024, 19:56 IST

    • IPL 2024 DC vs MI Result: ముంబై ఇండియన్స్ జట్టుపై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. భారీ లక్ష్యాన్ని ముంబై ఛేదించలేకపోయింది. తిలక్ వర్మ అద్భుతంగా పోరాడినా ఫలితం లేకపోయింది.
DC vs MI: తడాఖా చూపిన ఢిల్లీ.. భారీ లక్ష్యాన్ని ఛేదించలేకపోయిన ముంబై.. చివరి వరకు పోరాడిన తెలుగు ప్లేయర్ తిలక్
DC vs MI: తడాఖా చూపిన ఢిల్లీ.. భారీ లక్ష్యాన్ని ఛేదించలేకపోయిన ముంబై.. చివరి వరకు పోరాడిన తెలుగు ప్లేయర్ తిలక్ (AP)

DC vs MI: తడాఖా చూపిన ఢిల్లీ.. భారీ లక్ష్యాన్ని ఛేదించలేకపోయిన ముంబై.. చివరి వరకు పోరాడిన తెలుగు ప్లేయర్ తిలక్

Delhi Capitals vs Mumbai Indians: ఐపీఎల్ 2024 సీజన్‍లో ఢిల్లీ క్యాపిటల్స్ (DC) మరోసారి సత్తాచాటింది. క్రమంగా ప్లేఆఫ్స్ రేసులోకి వచ్చేస్తోంది. ముంబై ఇండియన్స్‌(MI)తో నేడు (ఏప్రిల్ 27) జరిగిన మ్యాచ్‍లో 10 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ హైస్కోరింగ్ పోరులో హోం టీమ్ తఢాకా చూపి గెలిచింది.

ట్రెండింగ్ వార్తలు

Nitish Kumar Reddy: ఆంధ్రా ప్రీమియర్ లీగ్‌లో నితీష్ కుమార్ రెడ్డికి భారీ ధర.. ఐపీఎల్ మెరుపులే కారణం

Virat Kohli on retirement: మళ్లీ మీకు కనిపించను.. రిటైర్మెంట్‌పై విరాట్ కోహ్లి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

IPL 2024: ఒక్క మ్యాచ్ ఆడ‌కుండా కోట్లు సంపాదించారు - ఈ ఐపీఎల్‌లో బెంచ్‌కే ప‌రిమిత‌మైన స్టార్ క్రికెట‌ర్లు వీళ్లే

India vs Pakistan: టీ20 ప్రపంచకప్‍లో ఇండియా, పాకిస్థాన్ సమరం జరిగే స్టేడియం ప్రారంభం.. లాంచ్ చేసిన పరుగుల వీరుడు

మెరిపించిన ఢిల్లీ

ఈ మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 257 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఈ సీజన్‍లో మరోసారి పరుగుల పండగ జరిగింది. యువ స్టార్ ఓపెనర్ జేక్ ఫ్రేజర్ మెక్‍గుర్క్ (27 బంతుల్లో 84 పరుగులు;11 ఫోర్లు, 6 సిక్స్‌) మెరుపు అర్ధ శకతంతో రెచ్చిపోయాడు. ఢిల్లీకి భారీ స్కోరుకు మంచి పునాది వేశాడు. 

ఆ తర్వాత షాయ్ హోప్ (17 బంతుల్లో 41 పరుగులు; 5 సిక్స్‌లు), ట్రిస్టన్ స్టబ్స్ (25 బంతుల్లో 48 పరుగులు; నాటౌట్), కెప్టెన్ రిషబ్ పంత్ (19 బంతుల్లో 29 పరుగులు) అదరగొట్టడంతో ఢిల్లీకి భారీ స్కోరు వచ్చింది. ఐపీఎల్‍లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఇదే అత్యధిక స్కోరు. ముంబై బౌలర్లు పియూష్ చావ్లా, జస్‍ప్రీత్ బుమ్రా, ల్యూక్ వుడ్, నబీ తలా ఓ వికెట్ తీశారు. 

చివరి ఓవర్ వరకు పోరాడిన తిలక్

ఈ కొండంత లక్ష్యఛేదనలో 20 ఓవర్లలో 9 వికెట్లకు 247 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్. చివరి వరకు పోరాడి ఓడింది. తెలుగు ప్లేయర్, ముంబై టీమ్ స్టార్ తిలక్ వర్మ 32 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్స్‌లు బాది 63 పరుగులు చేశాడు. ఆఖరి వరకు పోరాడాడు. చివరి ఓవర్లో రనౌట్ అయ్యాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (24 బంతుల్లో 46 పరుగులు), టిమ్ డేవిడ్ (17 బంతులు 37 పరుగులు) కూడా పర్వాలేదనిపించారు. అయితే, తిలక్‍కు తోడుగా నిలువలేకపోయారు. తిలక్ మాత్రం ఒంటరి పోరు కొనసాగించాడు. మొదట్లో రోహిత్ శర్మ (8), ఇషాన్ కిషన్ (20) విఫలమయ్యారు.

ఢిల్లీ బౌలర్లలో రసిక్ సలామ్, ముకేశ్ కుమార్ చెరో మూడు వికెట్లతో రాణించారు. ఈ హైస్కోరింగ్ గేమ్‍లో యంగ్ బౌలర్ రసిక్ 4 ఓవర్లలో 34 పరుగులే ఇచ్చి ఆకట్టుకున్నాడు. ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లు తీశాడు. 

కాగా, ప్రస్తుత ఐపీఎల్ సీజన్‍లో పరుగుల వరద మాత్రం కొనసాగింది. ఈ మ్యాచ్‍లో రెండు జట్లు కలిపి 504 పరుగులు చేశాడు. మరో మ్యాచ్‍లో 500పైగా రన్స్ నమోదయ్యాయి. 

ఢిల్లీ మరింత పైకి..

ఈ సీజన్ ఆరంభంలో ఐదు మ్యాచ్‍ల్లో నాలుగు ఓడి ఢిల్లీ నిరాశపరిచింది. అయితే, చివరి ఐదు మ్యాచ్‍ల్లో నాలుగు గెలిచి మళ్లీ ప్లేఆఫ్స్ రేసులోకి వచ్చేంది. ఈ సీజన్‍లో ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‍ల్లో గెలిచి.. 10 పాయింట్లలో పంత్ సేన ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది. 9 మ్యాచ్‍ల్లో ఆరు ఓడిన ముంబై ఇండియన్స్ తొమ్మిదో స్థానంలోనే ఉంది.

తదుపరి వ్యాసం