తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Indian Street Premier League: ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్.. తెరపైకి కొత్త క్రికెట్ లీగ్.. ఎప్పటి నుంచంటే?

Indian Street Premier League: ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్.. తెరపైకి కొత్త క్రికెట్ లీగ్.. ఎప్పటి నుంచంటే?

Hari Prasad S HT Telugu

28 November 2023, 14:45 IST

google News
    • Indian Street Premier League: ఇండియాలో తెరపైకి మరో కొత్త క్రికెట్ లీగ్ వచ్చింది. దీని పేరు ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్. గల్లీ క్రికెటర్ల కోసం తెచ్చిన ఈ లీగ్.. వచ్చే ఏడాది మార్చిలో ప్రారంభం కానుంది.
ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ అనౌన్స్‌మెంట్ సందర్భంగా టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి
ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ అనౌన్స్‌మెంట్ సందర్భంగా టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి

ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ అనౌన్స్‌మెంట్ సందర్భంగా టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి

Indian Street Premier League: ఇండియాలోని లక్షల సంఖ్యలో ఉన్న గల్లీ క్రికెటర్ల కోసం సరికొత్త లీగ్ ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ISPL) వచ్చేస్తోంది. ఈ లీగ్ వచ్చే ఏడాది మార్చి 2 నుంచి ప్రారంభం కానున్నట్లు ఆర్గనైజర్లు వెల్లడించారు. ఇదొక టీ10 ఫార్మాట్ లో జరగబోయే టెన్నిస్ బాల్ టోర్నమెంట్. ఇందులో మొత్తం ఆరు జట్లు పాల్గొంటాయి.

ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ఐఎస్‌పీఎల్) మొత్తం ముంబైలోనే జరగనుంది. అయితే ఇందులో ఆరు జట్లను ఆరు ఫ్రాంఛైజీలు కొనుగోలు చేశాయి. అందులో ముంబైతోపాటు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, శ్రీనగర్ లాంటి టీమ్స్ ఉన్నాయి. ఈ లీగ్ లో భాగంగా మొత్తం 19 మ్యాచ్ లు జరగనున్నాయి. ఈ ఐఎస్‌పీఎల్ కోర్ కమిటీలో బీసీసీఐ కోశాధికారి ఆశిశ్ షేలార్ సభ్యుడిగా ఉండటం విశేషం.

"ఈ ఐఎస్‌పీఎల్ సరికొత్త డైనమిక్, ఎంటర్‌టైనింగ్ క్రికెట్ ఫార్మాట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంది. అంతేకాదు ఇప్పటి వరకూ ఎవరూ గుర్తించని అత్యద్భుతమైన టాలెంట్ ఉన్న ప్లేయర్స్ ఈ లీగ్ ద్వారా అవకాశాలు పొందుతారు" అని ఆశిశ్ షేలార్ అన్నారు. ఈ లీగ్ అనౌన్స్‌మెంట్ సందర్భంగా ముంబై క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అమోల్ కాలే కూడా మాట్లాడారు.

స్టేడియాల్లో ఆడాలని కలలు కనే ఎంతో మంది ప్లేయర్స్ కు ఈ లీగ్ ఓ మంచి ప్లాట్‌ఫామ్ అని ఆయన అన్నారు. ఇక టీమిండియా మాజీ కెప్టెన్, మాజీ కోచ్ రవిశాస్త్రి మాట్లాడుతూ.. ఈ లీగ్ నుంచి ఎన్నో సక్సెస్ స్టోరీలు తెరపైకి వస్తాయనడంలో సందేహం లేదని, వాటిని చూడటానికి తాను చాలా ఆతృతగా ఉన్నట్లు చెప్పాడు. ఈ లీగ్ కు రవిశాస్త్రి కమిషనర్ గా ఉండటం విశేషం.

ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ ఇలా..

ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ మార్చి 2 నుంచి 9 వరకూ వారం రోజుల పాటు జరగనుంది. స్ట్రీట్ లీగే అయినా.. మ్యాచ్ లను స్టేడియాల్లో నిర్వహించనున్నారు. ప్రతి జట్టులో గరిష్ఠంగా 16 మంది ప్లేయర్స్, ఆరుగురు సపోర్ట్ స్టాఫ్ ఉంటారు. ఒక్కో ఫ్రాంఛైజీకి ప్లేయర్స్ కొనుగోలు కోసం రూ.కోటి పరిమితి ఉంటుంది. ఒక్కో ప్లేయర్ వేలంలో కనీస ధర రూ.3 లక్షలుగా ఉంది. ప్లేయర్స్ కోసం ఫిబ్రవరి 24న జరుగుతుంది.

తదుపరి వ్యాసం