తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Chandrayaan 3 Team India: చంద్రయాన్ 3 విజయాన్ని సెలెబ్రేట్ చేసుకున్న టీమిండియా: వీడియో

Chandrayaan 3 Team India: చంద్రయాన్ 3 విజయాన్ని సెలెబ్రేట్ చేసుకున్న టీమిండియా: వీడియో

23 August 2023, 19:31 IST

google News
  • Chandrayaan 3 Team India: చంద్రయాన్-3 సక్సెస్‍ను భారత క్రికెట్ జట్టు సెలెబ్రేట్ చేసుకుంది. ఈ వీడియోను బీసీసీఐ పోస్ట్ చేసింది. ఐర్లాండ్‍తో నేడు మూడో టీ20 ఆడనుంది భారత జట్టు.   

చంద్రయాన్ 3 సక్సెస్‍ను సెలెబ్రేట్ చేసుకుంటున్న టీమిండియా
చంద్రయాన్ 3 సక్సెస్‍ను సెలెబ్రేట్ చేసుకుంటున్న టీమిండియా

చంద్రయాన్ 3 సక్సెస్‍ను సెలెబ్రేట్ చేసుకుంటున్న టీమిండియా

Chandrayaan 3 Team India: భారతదేశం చరిత్ర సృష్టించింది. చంద్రయాన్-3 విజయవంతంగా చంద్రుడిపై అడుగుపెట్టింది. జాబిల్లిపై విక్రమ్ ల్యాండర్ బుధవారం సురక్షితంగా దిగింది. చంద్రుడి దక్షిణ ధృవంపై వ్యోమనౌకను విజయవంతంగా దింపిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. ఇస్రో చరిత్రలో చంద్రయాన్-3 అతిగొప్ప విజయంగా నిలిచింది. భారత దేశ ప్రజల ఆకాంక్షలను నిజం చేస్తూ చంద్రయాన్ 3 విజయవంతమైంది. దీంతో దేశమంతా సంబరాల్లో మునిగితేలుతోంది. ఐర్లాండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు కూడా చంద్రయాన్-3 విజయాన్ని సెలెబ్రేట్ చేసుకుంది.

ఇండియా, ఐర్లాండ్ మధ్య నేడు (ఆగస్టు 23) మూడో టీ20 జరగనుంది. అయితే, ఇంత కంటే ముందే చంద్రయాన్-3 ల్యాండర్ చంద్రుడిపై అడుగుపెట్టే క్షణాలను భారత ఆటగాళ్లు టీవీలో ప్రత్యక్షప్రసారం చూశారు. విక్రమ్ ల్యాండర్.. చంద్రుడి దక్షిణ ధృవంపై విజయవంతంగా అడుగుపెట్టిన తర్వాత భారత ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది చప్పట్లతో సంతోషం వ్యక్తం చేశారు. హర్షధ్వానాలు చేశారు.

ఈ వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. “డబ్లిన్ నుంచి చరిత్రను వీక్షిస్తున్నాం. భారత విక్రమ్ ల్యాండర్.. చంద్రుడి దక్షిణ ధృవాన్ని విజయవంతంగా తాకిన సందర్భం” అంటూ ఈ వీడియోను షేర్ చేసింది. భారత తాత్కాలిక కెప్టెన్ జస్‍ప్రీత్ బుమ్రా సహా భారత ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది ఈ వీడియోలో ఉన్నారు.

భారత్, ఐర్లాండ్ మధ్య నేడు (ఆగస్టు 23) జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా ఆలస్యమవుతోంది. వాన కారణంగా టాస్ ఆలస్యంగా పడనుంది. మూడు టీ20ల సిరీస్‍లో ఇప్పటికే తొలి రెండు మ్యాచ్‍లను టీమిండియా గెలిచింది. 2-0తో సిరీస్‍ను భారత్ ఖరారు చేసుకోగా.. నేడు లాంఛనమైన మూడో మ్యాచ్ జరగాల్సి ఉంది. భారత స్టార్ పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా 11 నెలల తర్వాత టీమిండియాలో ఈ సిరీస్ ద్వారా రీ-ఎంట్రీ ఇచ్చాడు. ఈ సిరీస్‍లో కెప్టెన్సీ కూడా చేస్తున్నాడు.

తదుపరి వ్యాసం