తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Sa 1st Odi: దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం.. తొలి వన్డేలో నిప్పులు చెరిగిన పేసర్లు

IND vs SA 1st ODI: దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం.. తొలి వన్డేలో నిప్పులు చెరిగిన పేసర్లు

Sanjiv Kumar HT Telugu

17 December 2023, 21:21 IST

google News
  • India Vs South Africa 1st ODI Highlights: సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్ పేసర్లు అత్యద్భుతమైన ప్రదర్శన చూపి రికార్డ్ క్రియేట్ చేశారు.

దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం.. తొలి వన్డేలో నిప్పులు చెరిగిన పేసర్లు
దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం.. తొలి వన్డేలో నిప్పులు చెరిగిన పేసర్లు

దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం.. తొలి వన్డేలో నిప్పులు చెరిగిన పేసర్లు

India Won 1st ODI With South Africa: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. జొహన్నెస్‌బర్గ్ వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా 8 వికెట్ల తేడాతో భారీ విజయం నమోదు చేసింది. టాస్ గెలిచి తొలుతు బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రిక 27.3 ఓవర్లలో 116 పరుగులకే ఆలౌట్ అయింది.

భారత్ యువ పేసర్లు అర్ష్‌దీప్ సింగ్, ఆవేష్ ఖాన్ తమ బౌలింగ్‌తో నిప్పులు చెరగడంతో బెంబేలు ఎత్తిపోయిన దక్షిణాఫ్రికా బ్యాటర్లు చేతులెత్తేశారు. అర్ష్‌దీప్ ఏకంగా 5 వికెట్స్ తీసి ప్రోటీస్ పతనానికి కారణం అయ్యాడు. ఆవేష్ ఖాన్ 4 వికెట్స్ తీసి అదరగొట్టాడు. దీంతో ప్రత్యర్థ బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు.

సౌతాఫ్రికా బ్యాటర్లలో ఫెలుక్వాయో 33 రన్స్‌తో పర్వాలేదనిపించుకున్నాడు. తర్వాత ఓపెనర్ టోనీ డి జోర్జి 28 పరుగులతో సరిపెట్టాడు. కాగా సొంతగడ్డపై దక్షిణాఫ్రికా అత్యల్ప స్కోరు నమోదు చేయడం రికార్డుగా మారింది. అనంతరం 117 పరుగుల అత్యంత స్వల్ప టార్గెట్‌తో బరిలోకి దిగిన టీమిండియా 2 వికెట్లు కోల్పోయి విజయకేతనం ఎగురవేసింది.

16.4 ఓవర్స్‌లో 117 పరుగులను అతి సునాయసంగా అందుకుని మొదటి వన్డే మ్యాచ్ గెలిచింది భారత్. ఇందులో సాయి సుదర్శన్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకోగా.. శ్రేయస్ అయ్యర్ కూడా అర్థ శతకంతో రాణించాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ముల్డర్, ఫెలుక్వాయో చెరో వికెట్ తీశారు.

తదుపరి వ్యాసం