తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Pak T20 World Cup 2024: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్‌కు వేదిక ఫిక్స్‌?

IND vs PAK T20 World Cup 2024: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్‌కు వేదిక ఫిక్స్‌?

15 December 2023, 12:01 IST

  • IND vs PAK T20 World Cup 2024: వ‌చ్చే ఏడాది జ‌రుగ‌నున్న టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ఇండియా, పాకిస్థాన్ గ్రూప్ స్టేజ్‌లోనే త‌ల‌ప‌డ‌బోతున్న‌ట్లు తెలిసింది. న్యూయార్క్ వేదిక‌గా ఈ మ్యాచ్ జ‌రుగ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇండియా వర్సెస్ పాకిస్థాన్
ఇండియా వర్సెస్ పాకిస్థాన్

ఇండియా వర్సెస్ పాకిస్థాన్

IND vs PAK T20 World Cup 2024: వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ త‌ర్వాత ఇండియా, పాకిస్థాన్ మ‌రోసారి మెగా ఈవెంట్‌లోనే త‌ల‌ప‌డ‌బోతున్న‌ట్లు స‌మాచారం. వ‌చ్చే ఏడాది జ‌రుగ‌నున్న టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ఇండియా, పాకిస్థాన్ మ‌ధ్య మ్యాచ్ జ‌రుగ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ మ్యాచ్ షెడ్యూల్‌తో పాటు వేదిక ఫిక్స‌యిన‌ట్లు తెలిసింది. వ‌చ్చే ఏడాది టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్‌కు వెస్టిండీస్‌తో పాటు అమెరికా ఆతిథ్యం ఇవ్వ‌నున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

IPL 2024: కీలక సమయంలో ఐపీఎల్ జట్లకు ఇంగ్లండ్ ప్లేయర్ల షాక్.. వెళ్లిపోతున్న ఈ ఆటగాళ్లు.. రాజస్థాన్‍కు బైబై చెప్పిన బట్లర్

IPL 2024 Playoffs: ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్.. 8 మ్యాచ్‌లు, 7 టీమ్స్, 3 బెర్తులు.. ఎవరి అవకాశాలు ఎలా ఉన్నాయంటే?

RCB Playoffs Chances: ఆర్సీబీ ప్లేఆఫ్స్ అవకాశాలు.. చెన్నై సూపర్ కింగ్స్‌పై ఇలా గెలిస్తే టాప్ 4లోకి..

RCB vs DC: వరుసగా ఐదో మ్యాచ్ గెలిచిన బెంగళూరు.. నిలిచిన ప్లేఆఫ్స్ ఆశలు.. అక్షర్ పోరాడినా ఢిల్లీకి భారీ ఓటమి దెబ్బ

ఈ పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌లో దాయాది దేశం పాకిస్థాన్‌తో లీగ్ ద‌శ‌లోనే టీమిండియా పోటీప‌డ‌నున్న‌ట్లు స‌మాచారం. ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ అమెరికాలోనే నిర్వ‌హించాల‌ని ఐసీసీ నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలిసింది. ఈ మ్యాచ్‌కు న్యూయార్క్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వ‌బోతున్న‌ట్లు చెబుతున్నారు. కొత్త‌గా నిర్మించిన ఈ స్టేడియం కెపాసిటీ 34 వేలుగా ఉన్న‌ట్లు తెలిసింది.

న్యూయార్క్‌లో ఇండియా, పాకిస్థాన్ దేశాల‌కు చెందిన వారు దాదాపు ఎనిమిది ల‌క్ష‌ల వ‌ర‌కు ఉన్న‌ట్లు స‌మాచారం. ఈ నేప‌థ్యంలో న్యూయార్క్ స్టేడియం క్రికెట్ అభిమానుల‌తో ఫుల్ అయ్యే అవ‌కాశం ఉన్న‌ట్లు చెబుతోన్నారు. తొంద‌ర‌లోనే టీ20 వ‌ర‌ల్డ్ షెడ్యూల్‌ను ప్ర‌క‌టించేందుకు ఐసీసీ ప్లాన్ చేస్తుంది. ఈ షెడ్యూల్‌తో ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్‌పై క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఈ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో మొత్తం 20 దేశాలు త‌ల‌ప‌డ‌బోతున్నాయి.

తదుపరి వ్యాసం