తెలుగు న్యూస్  /  క్రికెట్  /  India Vs Netherlands World Cup 2023 Highlights: అజేయ భారత్.. నెదర్లాండ్స్‌పై ఘన విజయం.. గెలుపు జోష్‍తో సెమీస్‍లోకి..

India vs Netherlands World Cup 2023 Highlights: అజేయ భారత్.. నెదర్లాండ్స్‌పై ఘన విజయం.. గెలుపు జోష్‍తో సెమీస్‍లోకి..

12 November 2023, 22:30 IST

google News
    • India vs Netherlands World Cup 2023 Highlights: వన్డే ప్రపంచకప్‍లో టీమిండియా మరోసారి అదరగొట్టింది. నేడు నెదర్లాండ్స్‌పై భారీ తేడాతో గెలిచింది. వరుసగా లీగ్‍ దశలో 9 మ్యాచ్‍ల్లో గెలిచింది. అజేయంగా సెమీస్‍లో అడుగుపెడుతోంది. 
అజేయ భారత్.. నెదర్లాండ్స్‌పై ఘన విజయం.. గెలుపు జోష్‍తో సెమీస్‍లోకి..
అజేయ భారత్.. నెదర్లాండ్స్‌పై ఘన విజయం.. గెలుపు జోష్‍తో సెమీస్‍లోకి.. (AFP)

అజేయ భారత్.. నెదర్లాండ్స్‌పై ఘన విజయం.. గెలుపు జోష్‍తో సెమీస్‍లోకి..

India vs Netherlands World Cup 2023 Highlights: వన్డే ప్రపంచకప్ 2023 టోర్నీలో భారత్ జోష్ కొనసాగింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా నేడు (నవంబర్ 12) జరిగిన చివరి లీగ్ మ్యాచ్‍లో టీమిండియా 160 పరుగుల తేడాతో నెదర్లాండ్స్ జట్టుపై విజయం సాధించింది. దీపావళి రోజున అదిరేలా గెలిచింది. లీగ్ దశలో వరుసగా 9 మ్యాచ్‍ల్లో 9 గెలిచింది భారత్. నవంబర్ 15న న్యూజిలాండ్‍తో జరిగే సెమీస్‍ పోరులో టీమిండియా అజేయంగా అడుగుపెడుతోంది.

India vs Netherlands World Cup 2023 Live Score

9.37 PM: India vs Netherlands Live Score: శ్రేయస్ అయ్యర్ (128 నాటౌట్), కేఎల్ రాహుల్ (102) శతకాలతో సత్తాచాటడంతో ఈ మ్యాచ్‍లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 4 వికెట్లకు 410 పరుగుల భారీ స్కోరు చేసింది. భారీ లక్ష్యఛేదనలో నెదర్లాండ్స్ 47.5 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటైంది. తేజా నిడమానూరు (54) అర్ధ శకతం చేశాడు. భారత బౌలర్లలో జస్‍ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా చెరో రెండు వికెట్లు తీశారు. అయితే, అరుదుగా బౌలింగ్ చేసే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కూడా ఈ మ్యాచ్‍లో చెరో వికెట్ తీయడం ప్రత్యేకం.

9.32 PM: India vs Netherlands Live Score: వన్డే ప్రపంచకప్ చివరి లీగ్ మ్యాచ్‍లో నెదర్లాండ్స్ జట్టుపై టీమిండియా 160 పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరి వికెట్‍ను భారత కెప్టెన్ రోహిత్ శర్మ పడగొట్టాడు. 47.5 ఓవర్లలో 250 పరుగులకు నెదర్లాండ్స్ ఆలౌటైంది.

9.22 PM: India vs Netherlands Live Score: నెదర్లాండ్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. ఆర్యన్ దత్‍ను భారత స్టార్ పేసర్ బుమ్రా బౌల్డ్ చేశాడు. దీంతో 46.1 ఓవర్లలో 236 రన్స్ వద్ద నెదర్లాండ్స్ 9వ వికెట్ డౌన్ అయింది.

9.13 PM: India vs Netherlands Live Score: నెదర్లాండ్ బ్యాటర్ రూలఫ్ వాండర్ మెర్వ్ (16)ను భారత స్పిన్నర్ రవీంద్ర జడేజా 44వ ఓవర్లో బౌల్డ్ చేశాడు. గెలుపుకు మరో రెండు వికెట్ల దూరంలో టీమిండియా ఉంది.

9.04 PM: India vs Netherlands Live Score: భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఈ మ్యాచ్‍లో రెండో వికెట్ తీశాడు. నెదర్లాండ్స్ ఆటగాడు లోగాన్ వాన్ బీక్‍ను కుల్దీప్ బౌల్డ్ చేశాడు. దీంతో 42.1 ఓవర్లలో 208 పరుగుల వద్ద ఏడో వికెట్‍ను నెదర్లాండ్స్ చేజార్చుకుంది.

8.54 PM: India vs Netherlands Live Score: 40 ఓవర్లు ముగిసే సరికి నెదర్లాండ్స్ 6 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. తేజా నిడమానూరు (28 నాటౌట్), లోగాన్ వాన్ బీక్ (7 నాటౌట్) బ్యాటింగ్ చేస్తున్నారు.

8.44 PM: India vs Netherlands Live Score: నెదర్లాండ్ బ్యాటర్ సిబ్రండ్ ఇంజిల్‍బెచ్ (45)ను భారత పేసర్ మహమ్మద్ సిరాజ్ బౌల్డ్ చేశాడు. దీంతో 37.4 ఓవర్లలో 171 రన్స్ వద్ద ఆరో వికెట్ కోల్పోయింది నెదర్లాండ్స్ టీమ్.

8.29 PM: India vs Netherlands Live Score: 35 ఓవర్లు ముగిసే సరికి నెదర్లాండ్స్ 5 వికెట్లకు 162 పరుగులు చేసింది. సిబ్రండ్ ఇంజిల్‍బెచ్ (42 నాటౌట్), తేజా నిడమానూరు (16 నాటౌట్) బ్యాటింగ్ చేస్తున్నారు.

8.17 PM: India vs Netherlands Live Score: నెదర్లాండ్స్ బ్యాటర్ బాస్ డె లీడ్‍(12)ను భారత పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా అద్భుతమైన యార్కర్ వేసి బౌల్డ్ చేశాడు. దీంతో 32 ఓవర్లలో 144 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది నెదర్లాండ్స్ జట్టు.

8.07 PM: India vs Netherlands Live Score: 29 ఓవర్లు ముగిసే సరికి నెదర్లాండ్స్ 4 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. సిబ్రండ్ ఇంజిల్‍బెచ్ (35 నాటౌట్), బాస్ డె లీడ్ (9 నాటౌట్) బ్యాటింగ్ చేస్తున్నారు.

7.56 PM: India vs Netherlands Live Score: టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ వికెట్ తీశాడు. 25వ ఓవర్లో నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (17)ను విరాట్ ఔట్ చేశాడు. దీంతో 24.3 ఓవర్లలో 111 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది నెదర్లాండ్స్. అరుదుగా బౌలింగ్ చేసే కోహ్లీ వికెట్ తీయడం ప్రత్యేకంగా నిలిచింది. విరాట్ సెలెబ్రేషన్స్ కూడా ఆకట్టుకున్నాయి.

7.50 PM: India vs Netherlands Live Score: భారత స్టార్ విరాట్ కోహ్లీ బౌలింగ్ చేశాడు. 23వ ఓవర్ వేశాడు. ఈ ఓవర్లో 7 పరుగులు ఇచ్చాడు కోహ్లీ. ఎడ్జ్ తగిలి ఓ ఫోర్ వెళ్లింది.

7.46 PM: India vs Netherlands Live Score: 22 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది నెదర్లాండ్స్. సిబ్రాండ్ ఇంజిల్‍బెచ్ (12 నాటౌట్), కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (10 నాటౌట్) నిలకడగా ఆడుతున్నారు.

7.36 PM: India vs Netherlands Live Score:19 ఓవర్లు ముగిసే సరికి నెదర్లాండ్స్ 3 వికెట్లకు 83 రన్స్ చేసింది. ఇంజిల్‍బెచ్ (8 నాటౌట్), ఎడ్వర్డ్స్ (6 నాటౌట్) బ్యాటింగ్ చేస్తున్నారు.

7.26 PM: India vs Netherlands Live Score: నెదర్లాండ్స్ బ్యాటర్ మ్యాక్స్ ఓడౌడ్ (30)ను భారత స్పిన్నర్ రవీంద్ర జడేజా బౌల్డ్ చేశాడు. దీంతో 15.1 ఓవర్లలో 72 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది నెదర్లాండ్స్. ఈ మ్యాచ్‍లో తన తొలి బంతికే వికెట్ తీశాడు జడ్డూ.

7.22 PM: India vs Netherlands Live Score: 15 ఓవర్లు ముగిసే సరికి నెదర్లాండ్స్ రెండు వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది. ఓడౌడ్ (30 నాటౌట్), సిబ్రండ్ ఇంజిల్‍బ్రెచ్ (3 నాటౌట్) బ్యాటింగ్ చేస్తున్నారు.

7.10 PM: India vs Netherlands Live Score: నెదర్లాండ్ రెండో వికెట్ కోల్పోయింది. కాలిన్ అకర్మన్ (35)ను భారత స్పిన్నర్ కుల్‍దీప్ యాదవ్ ఎల్‍బీడబ్ల్యూ చేశాడు. దీంతో 12.1 ఓవర్లలో 66 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది నెదర్లాండ్స్.

7.00 PM: India vs Netherlands Live Score: నెదర్లాండ్స్ బ్యాటర్లు కోలిన్ అకర్మన్ (32 నాటౌట్), మ్యాక్స్ ఓడౌడ్ (26 నాటౌట్) దీటుగా ఆడుతున్నారు. దీంతో 10 ఓవర్లలో నెదర్లాండ్స్ ఓ వికెట్ నష్టానికి 62 పరుగులు చేసింది.

6.44 PM: India vs Netherlands Live Score: 6 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయిన నెదర్లాండ్స్ 29 రన్స్ చేసింది. మ్యాక్స్ ఓడౌడ్ (12 నాటౌట్), కోలిన్ అకర్మెన్ (13 నాటౌట్) నిలకడగా ఆడుతున్నారు.

6.33 PM: India vs Netherlands Live Score: 4 ఓవర్లు ముగిసే సరికి నెదర్లాండ్స్ ఒక వికెట్ నష్టానికి 11 పరుగులు చేసింది. ఓడౌడ్ (6 నాటౌట్), కోలిన్ అకర్మెన్ (1 నాటౌట్) బ్యాటింగ్ చేస్తున్నారు.

6.23 PM: India vs Netherlands Live Score: నెదర్లాండ్స్ ఓపెనర్ వెస్లే బరేసీ (4)ని ఔట్ చేశాడు భారత పేసర్ మహమ్మద్ సిరాజ్. తన తొలి ఓవర్లోనే వికెట్ తీసుకున్నారు. వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ మంచి క్యాచ్ పట్టాడు. దీంతో 1.3 ఓవర్లలో 5 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది నెదర్లాండ్స్.

6.21 PM: India vs Netherlands Live Score: తొలి ఓవర్లో 5 పరుగులు చేసింది నెదర్లాండ్స్.

6.15 PM: India vs Netherlands Live Score: 411 పరుగుల కొండంత లక్ష్యఛేదనను నెదర్లాండ్స్ మొదలుపెట్టింది. ఓపెనర్లు మార్క్ ఓడౌడ్, విస్లే బరెసి బ్యాటింగ్‍కు దిగారు. తొలి ఓవర్ వేస్తున్నాడు భారత స్టార్ పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా.

5.46 PM: India vs Netherlands Live Score: నెదర్లాండ్స్ బౌలర్లను చిత్తుగా కొడుతూ ఇండియా 50 ఓవర్లలో 4 వికెట్లకు 410 రన్స్ చేసింది. శ్రేయస్ అయ్యర్ (94 బంతుల్లో 128), కేఎల్ రాహుల్ (64 బంతుల్లో 102) సెంచరీలు.. రోహిత్(61), కోహ్లి(51), గిల్(51) హాఫ్ సెంచరీలు చేశారు. వన్డే క్రికెట్ లో ఇండియాకు ఇది రెండో అత్యధిక స్కోరు కావడం విశేషం.

ఈ వరల్డ్ కప్ లో ఇండియాకు ఇదే అత్యధిక స్కోరు. నాలుగో వికెట్ కు శ్రేయస్, రాహుల్ ఏకంగా 208 రన్స్ జోడించారు. ఇండియా చివరి 10 ఓవర్లలో 126 రన్స్, చివరి 5 ఓవర్లలో 73 రన్స్ చేయడం విశేషం. ఇండియన్ బ్యాటర్ల దెబ్బకు నెదర్లాండ్స్ బౌలర్ లోగాన్ వాన్ బీక్ 10 ఓవర్లలో ఏకంగా 107 రన్స్ సమర్పించుకున్నాడు. మరో బౌలర్ మీకెరన్ 10 ఓవర్లలో 90, డీలీడ్ 10 ఓవర్లలో 82 రన్స్ ఇచ్చారు.

5.40 PM: India vs Netherlands Live Score: కేఎల్ రాహుల్ 62 బంతుల్లోనే సెంచరీ చేశాడు. వరల్డ్ కప్ లలో ఇండియా తరఫున అత్యంత వేగంగా సెంచరీ చేసిన బ్యాటర్ గా రికార్డు క్రియేట్ చేశాడు. 50వ ఓవర్లో తొలి రెండు బంతులను సిక్స్ లుగా మలచి సెంచరీ చేయడం విశేషం. దీంతో ఇండియా స్కోరు 400 దాటింది. రాహుల్ ఆ వెంటనే ఔటయ్యాడు. అతడడు 64 బంతుల్లో 102 రన్స్ చేశాడు. 11 ఫోర్లు, 4 సిక్స్ లు బాదాడు.

5.37 PM: India vs Netherlands Live Score: శ్రేయస్ అయ్యర్ 49వ ఓవర్లో ఏకంగా 3 సిక్స్ లు బాదాడు. దీంతో ఇండియా 49 ఓవర్లు ముగిసే సమయానికి 3 వికెట్లకు 393 రన్స్ చేసింది. 49 ఓవర్లో ఇండియా ఏకంగా 25 రన్స్ పిండుకోవడం విశేషం.

5.28 PM: India vs Netherlands Live Score: ఇండియా 47 ఓవర్లలో 360 రన్స్ చేసింది. రాహుల్ కూడా సెంచరీకి చేరువవుతున్నాడు. అతడు 47వ ఓవర్లో వరుసగా ఫోర్, సిక్స్ కొట్టాడు.

5.22 PM: India vs Netherlands Live Score: శ్రేయస్ అయ్యర్ సెంచరీ చేశాడు. వరల్డ్ కప్ లో అతనికిదే తొలి సెంచరీ కాగా.. ఓవరాల్ గా వన్డే క్రికెట్ లో నాలుగో సెంచరీ. శ్రేయస్ కేవలం 84 బంతుల్లోనే 9 ఫోర్లు, 2 సిక్స్ లతో సెంచరీ చేయడం విశేషం. దీంతో ఇండియా 46 ఓవర్లలో 3 వికెట్లకు 346 రన్స్ చేసింది.

5.14 PM: India vs Netherlands Live Score: ఇండియా 44 ఓవర్లలో 3 వికెట్లకు 330 రన్స్ చేసింది. శ్రేయస్ అయ్యర్ 95, రాహుల్ 59 రన్స్ తో క్రీజులో ఉన్నారు.

5.06 PM: India vs Netherlands Live Score: కేఎల్ రాహుల్ కూడా హాఫ్ సెంచరీ చేశాడు. అతడు 40 బంతుల్లోనే 7 ఫోర్లతో ఫిఫ్టీ చేశాడు. వన్డే క్రికెట్ చరిత్రలో తొలి ఐదుగురు బ్యాటర్లు హాఫ్ సెంచరీలు చేయడం ఇదే తొలిసారి కాగా.. వరల్డ్ కప్ చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం.

4.57 PM: India vs Netherlands Live Score: ఇండియా 41 ఓవర్లలో 3 వికెట్లకు 296 రన్స్ చేసింది. రాహుల్ కూడా 41వ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టి హాఫ్ సెంచరీకి చేరువయ్యాడు.

4.52 PM: India vs Netherlands Live Score: ఇండియా ఇన్నింగ్స్ లో మరో 10 ఓవర్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇండిాయా 40 ఓవర్లలో 3 వికెట్లకు 284 రన్స్ చేసింది. శ్రేయస్ అయ్యర్ 73, రాహుల్ 37 పరుగులతో క్రీజులో ఉన్నారు.

4.25 PM: India vs Netherlands Live Score: శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీ చేశాడు.అతడు 48 బంతుల్లోనే ఫిఫ్టీ చేయడం విశేషం.

4.10 PM: India vs Netherlands Live Score: ఇండియా 30 ఓవర్లలో 3 వికెట్లకు 211 రన్స్ చేసింది. శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ క్రీజులో ఉన్నారు.

4.01 PM: India vs Netherlands Live Score: విరాట్ కోహ్లి హాఫ్ సెంచరీ చేయగానే ఔటయ్యాడు. అతడు వాన్‌డెర్ మెర్వ్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. కోహ్లి 56 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ తో 51 రన్స్ చేశాడు.

3.59 PM: India vs Netherlands Live Score: విరాట్ కోహ్లి హాఫ్ సెంచరీ చేశాడు. అతనికి వన్డేల్లో ఇది 71వ హాఫ్ సెంచరీ. ఇండియా 28 ఓవర్లలో 2 వికెట్లకు 198 రన్స్ చేసింది.

3.44 PM: India vs Netherlands Live Score: ఇండియా ఇన్నింగ్స్ సగం ఓవర్లు ముగిశాయి. 25 ఓవర్లలో ఇండియా 2 వికెట్లకు 178 రన్స్ చేసింది. కోహ్లి 45, శ్రేయస్ 15 రన్స్ తో క్రీజులో ఉన్నారు.

3.33 PM: India vs Netherlands Live Score: విరాట్ కోహ్లి జోరు పెంచుతున్నాడు. అతడు 22వ ఓవర్లో వరుసగా సిక్స్, ఫోర్ కొట్టాడు. దీంతో ఇండియా 22 ఓవర్లలో 2 వికెట్లకు 158 రన్స్ చేసింది.

3.27 PM: India vs Netherlands Live Score: ఇండియా 20 ఓవర్లలో 2 వికెట్లకు 140 రన్స్ చేసింది. కోహ్లి, శ్రేయస్ అయ్యర్ క్రీజులో ఉన్నారు.

3.16 PM: India vs Netherlands Live Score: ఇండియా రెండో వికెట్ కోల్పోయింది. 54 బంతుల్లో 61 రన్స్ చేసిన రోహిత్ శర్మ ఔటయ్యాడు. రోహిత్ తన ఇన్నింగ్స్ లో 8 ఫోర్లు, 2 సిక్స్ లు కొట్టాడు. ఇండియా 17.4 ఓవర్లలో 2 వికెట్లకు 129 రన్స్ చేసింది.

3.02 PM: India vs Netherlands Live Score: ఇండియా 15 ఓవర్లలో వికెట్ నష్టానికి 119 రన్స్ చేసింది. రోహిత్ 60, కోహ్లి 5 రన్స్ తో క్రీజులో ఉన్నారు.

2.58 PM: India vs Netherlands Live Score: రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ చేశాడు. అతు 44 బంతుల్లోనే 8 ఫోర్లు, 1 సిక్స్ తో ఫిఫ్టీ రన్స్ పూర్తి చేశాడు. ఇండియా 14 ఓవర్లలో వికెట్ నష్టానికి 109 రన్స్ చేసింది.

2.48 PM: India vs Netherlands Live Score: ఇండియా తొలి వికెట్ కోల్పోయింది. 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన శుభ్‌మన్ గిల్.. ఆ వెంటనే ఔటయ్యాడు. అతడు 32 బంతుల్లో 51 రన్స్ చేశాడు. ఇండియా 11.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 100 రన్స్ చేసింది.

2.44 PM: India vs Netherlands Live Score: టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు.

2.39 PM: India vs Netherlands Live Score: తొలి పవర్ ప్లే 10 ఓవర్లు ముగిశాయి. ఇండియా వికెట్ నష్టపోకుండా 91 రన్స్ చేసింది. గిల్ 47, రోహిత్ 42 రన్స్ తో క్రీజులో ఉన్నారు.

2.27 PM: India vs Netherlands Live Score: రోహిత్ శర్మ ఈ ఏడాది వన్డేల్లో 59 సిక్స్ లు బాదాడు. దీంతో ఒక కేలండర్ ఏడాదిలో అత్యధిక సిక్స్ లు బాదిన ప్లేయర్ గా రికార్డు క్రియేట్ చేశాడు. ఇన్నాళ్లూ ఏబీ డివిలియర్స్ 58 సిక్స్ లతో టాప్ లో ఉండేవాడు. ఇండియా 7 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 64 రన్స్ చేసింది.

2.23 PM: India vs Netherlands Live Score: ఆరు ఓవర్ల తర్వాత ఇండియా వికెట్ నష్టపోకుండా 53 రన్స్ చేసింది. ఈ ఓవర్లో శుభ్‌మన్ రెండు ఫోర్లు, ఒక సిక్స్ బాదాడు.

2.19 PM: India vs Netherlands Live Score: ఐదు ఓవర్ల తర్వాత టీమిండియా వికెట్ నష్టపోకుండా 37 రన్స్ చేసింది. ఐదో ఓవర్లో రోహిత్ రెండు ఫోర్లు బాదాడు. రోహిత్ 25, గిల్ 10 పరుగులతో ఆడుతున్నారు.

2.11 PM: India vs Netherlands Live Score: ఇండియన్ టీమ్ 3 ఓవర్ల తర్వాత వికెట్ నష్టపోకుండా 26 రన్స్ చేసింది. రోహిత్ ఒక ఫోర్, శుభ్‌మన్ సిక్స్ కొట్టారు.

2.02 PM: India vs Netherlands Live Score: ముగిసిన తొలి ఓవర్. టీమిండియా వికెట్ నష్టపోకుండా 11 రన్స్ చేసింది.

1.35 PM: India vs Netherlands Live Score: ఇండియా తుది జట్టు ఇదే

రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, జడేజా, కుల్దీప్, సిరాజ్, షమి, బుమ్రా

1.30 PM: India vs Netherlands Live Score: నెదర్లాండ్స్ తో మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది టీమిండియా. ఆశ్చర్యకరంగా జట్టులో ఎలాంటి మార్పుల్లేకుండా బరిలోకి దిగుతోంది. గత వారం సౌతాఫ్రికాతో ఆడిన టీమ్ తోనే ఇండియా ఆడుతోంది. అటు నెదర్లాండ్స్ కూడా ఎలాంటి మార్పుల్లేకుండా దిగుతోంది.

1.20 PM: India vs Netherlands Live Score: టాస్ గెలిస్తే బౌలింగా బ్యాటింగా?

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం పిచ్ పై పరుగుల వరద పారుతుంది. మరి అలాంటి పిచ్ పై టాస్ గెలిస్తే మొదట బ్యాటింగ్ ఎంచుకోవాలా లేక బౌలింగా? నిజానికి ఇక్కడ మొదట బ్యాటింగ్ చేసిన టీమ్స్ ఎన్నిసార్లు గెలిచాయో చేజింగ్ టీమ్స్ కూడా అన్నే మ్యాచ్ లు గెలిచాయి.

గత రెండు మ్యాచ్ లలో పాకిస్థాన్, న్యూజిలాండ్ చేజ్ చేస్తూనే గెలిచాయి. న్యూజిలాండ్, పాకిస్థాన్ మ్యాచ్ లో కివీస్ టీమ్ 400కుపైగా స్కోరు చేసినా.. వర్షం కారణంగా పాకిస్థాన్ ఊహించని విజయం సాధించింది. ఇక ఈ వరల్డ్ కప్ లో ఇండియా చేజింగ్ అయినా, మొదట బ్యాటింగ్ అయినా అదరగొడుతోంది. ఐదు మ్యాచ్ లు చేజింగ్ లో, మూడు మ్యాచ్ లు మొదట బ్యాటింగ్ చేసి గెలిచింది.

12.58 PM: India vs Netherlands Live Score: భారత బౌలర్ల ప్రదర్శన

ఈ టోర్నీలో భారత్ బౌలర్స్ ప్రదర్శన ఇలా సాగింది. ఇప్పటివరకు కేవలం నాలుగు మ్యాచ్‌లు ఆడిన మహ్మద్ షమీ, ఇప్పటికే 16 స్కాల్ప్‌లతో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలిచాడు. జస్ప్రీత్ బుమ్రా 15 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. మహ్మద్ సిరాజ్ వికెట్ల తీయకపోవచ్చు కానీ, ప్రత్యర్థులను ఇరకాటంలో పెట్టడంలో కీలక పాత్ర పోషించాడు. హార్దిక్ పాండ్యా ఆడిన కొన్ని మ్యాచ్‌ల్లో అద్భుతంగా రాణించాడు. అతని స్పిన్-బౌలింగ్ ఇండియా పిచ్ ల్లో బాగా ఉపయోగపడింది. ఇలా భారత్ పేసర్ల ద్వారా క్రాఫ్ట్ పెరుగుతూ వచ్చింది.

12.38 PM: India vs Netherlands Live Score: నేడు ఇండియా గెలిస్తే..

వరల్డ్ కప్ 2023లో ప్రత్యేకమైన రేసు అధికారికంగా ముగిసినట్లే. మొదటి స్థానంలో భారత్, రెండో స్థానంలో దక్షిణాఫ్రికా, మూడో స్థానంలో ఆస్ట్రేలియా, నాలుగో స్థానంలో న్యూజిలాండ్ నిలిచాయి. వీటిలో భారత్ ఇప్పటికే రెండు పాయింట్ల ఆధిక్యాన్ని కలిగి ఉంది. మిగతా టీమ్స్ కూడా నాలుగుకు పెంచుకునే అవకాశం ఉంది. ఈరోజు ఇండియా మ్యాచ్ గెలిస్తే గ్రూప్ స్టేజ్‌లో ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించినట్లు అవుతుంది.

12.18 PM: India vs Netherlands Live Score: నెదర్లాండ్స్ మ్యాచ్ గెలిస్తే..

ఈ వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో ముందుగా నెదర్లాండ్స్ సెమీ-ఫైనల్‌కు చేరుకోవాలని చూస్తోందని రోలోఫ్ వాన్ డెర్ మెర్వే చేసిన కామెంట్స్ చాలామందికి ఆశ్చర్యం కలిగించింది. ఆ నమ్మకం, సామర్థ్యం ఉన్నాయని దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌లను ఓడించి చూపించింది నెదర్లాండ్స్. ఇవాళ గనుక నెదర్లాండ్స్ మ్యాచ్ గెలిస్తే 2025 ఛాంపియన్ ట్రోఫీకి నెదర్లాండ్స్ అర్హత సాధించే అవకాశం ఉంది.

11.59 AM: India vs Netherlands Live Score: 20 ఏళ్ల తర్వాత మళ్లీ..

వరల్డ్ కప్ 2023లో మొదటిసారి నెదర్లాండ్స్ తో భారత్ పోటీ పడుతుంది. 20 ఏళ్ల క్రితం 2003లో నెదర్లాండ్స్ తో భారత్ తలపడింది. అప్పుడు డి లీడే నెదర్లాండ్స్ కోసం స్ట్రాంగ్ గా నిలబడ్డాడు. కానీ, జవగల్ శ్రీనాథ్, అనిల్ కుంబ్లే ఇద్దరూ నాలుగు వికెట్స్ పడగొట్టడంతో ఆ మ్యాచ్ లో భారత్ 68 పరుగుల తేడాతో గెలిచింది.

11.40 AM: India vs Netherlands Live Score: రికార్డ్ బద్దలు కొట్టే ఛాన్స్

నేడు భారత్, నెదర్లాండ్స్ మ్యాచ్ జరగనున్న చినస్వామి స్టేడియం అత్యధిక పరుగులకు బాగా పాపులర్. ఈ పిచ్ మీద అధికంగా రన్స్ చేసే అవకాశం ఉంది. ఇదివరకు ఈ పిచ్ లో పాకిస్తాన్ పై ఆస్ట్రేలియా 367 రన్స్ చేయగా.. న్యూజిలాండ్ 401 పరుగులు చేసింది. ఒకవేళ భారత్ మొదట బ్యాటింగ్ చేస్తే ఆ రికార్డ్స్ బద్దలు కొట్టే అవకాశం ఉంది.

11.20 AM: India vs Netherlands Live Score: భారత్ రన్ రేట్

ఈ ప్రపంచ కప్‌లో జట్ల స్థానాలు తారుమారు అవుతూ వచ్చాయి. వరల్డ్ కప్ కు ఆతిథ్యం ఇస్తున్న భారత్ 8 మ్యాచ్ లు గెలిచి 16 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఇండియాకు నెట్ రన్ రేట్ +2.456గా ఉండగా.. తర్వాతి స్థానంలో 14 పాయింట్లతో సౌత్ ఆఫ్రికా నిలిచింది. దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు +1.261 రన్ రేట్ సాధించింది.

11.00 AM: India vs Netherlands Live Score: బెంగళూరులో టీమిండియా

బెంగళూరులో టీమిండియా చివరసారి వన్డే మ్యాచ్ ఆడి చాలా రోజులవుతోంది. అప్పుడు విరాట్ కోహ్లి కెప్టెన్ గా ఉన్నాడు. ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ లో చివరి మ్యాచ్ అది. అప్పటికే ఇండియా 2-0 ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్ లోనూ 7 వికెట్లతో ఇండియా గెలిచింది. ఆ మ్యాచ్ లో రోహిత్ సెంచరీ, విరాట్ కోహ్లి 89 రన్స్ చేశారు.

10.18 AM: India vs Netherlands Live Score: బెంగళూరు వెదర్ ఎలా ఉందంటే?

ఇండియా, నెదర్లాండ్స్ మ్యాచ్ కు అసలు వర్షం ముప్పు లేదు. ఇక్కడ జరిగిన పాకిస్థాన్, న్యూజిలాండ్ మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా జరగని విషయం తెలిసిందే. అయితే ఆదివారం (నవంబర్ 12) మాత్రం వాతావరణం పొడిగా ఉండనుంది. మూడు రోజుల కిందట భారీ వర్షాలంటూ ఎల్లో అలెర్ట్ జారీ అయినా.. ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితులు లేవు.

10.10 AM: India vs Netherlands Live Score: బెంగళూరులో కోహ్లి ఎందుకిలా?

విరాట్ కోహ్లి టాప్ బ్యాటర్ అయినా, ఈ వరల్డ్ కప్ లో టాప్ ఫామ్ లో ఉన్నా కూడా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మాత్రం అతని రికార్డులు అంత గొప్పగా లేవు. అతడు ఇక్కడ ఆరు వన్డేలు ఆడాడు. అందులో వరుసగా 0, 8, 34, 0, 21, 89 రన్స్ చేశాడు. అంటే మొత్తంగా కేవలం 152 రన్స్ మాత్రమే చేయగలిగాడు.

సగటు కేవలం 25.33 మాత్రమే. ఐపీఎల్లో అతని టీమ్ ఆర్సీబీకి కూడా ఇదే హోమ్ గ్రౌండ్. అలాంటిది ఇక్కడ కోహ్లి ఎందుకు రాణించడం లేదన్నది మిస్టరీయే. ఒకవేళ నెదర్లాండ్స్ తో మ్యాచ్ లో అతడు ఆడితే.. చిన్నస్వామిలో తన రికార్డు సెట్ చేసుకోవడానికి మంచి అవకాశంగా చెప్పవచ్చు.

9.50 AM: India vs Netherlands Live Score: ఇండియా తుది జట్టు సంగతేంటి?

నెదర్లాండ్స్ తో ఇండియా తుది జట్టు ఎలా ఉండబోతోంది? ఏమాత్రం ప్రాధాన్యత లేని ఈ మ్యాచ్ లో ఇండియన్ టీమ్ ప్రయోగాలు చేస్తుందా? ఇలాంటి సందేహాలు ఉన్నా.. ఇవాళ్టి మ్యాచ్ లో పెద్దగా మార్పులు చేసే అవకాశాలు కనిపించడం లేదు. బుమ్రా స్థానంలో శార్దూల్ ఠాకూర్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక కుల్దీప్ స్థానంలో అశ్విన్, విరాట్ కోహ్లి స్థానంలో ఇషాన్ కిషన్ లకు తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది.

9.20 AM: India vs Netherlands Live Score: ఇండియా vs నెదర్లాండ్స్ రికార్డులు ఇవీ

ఇండియా, నెదర్లాండ్స్ టీమ్స్ ఇప్పటి వరకూ వన్డేల్లో రెండుసార్లు తలపడ్డాయి. ఆ రెండింట్లోనూ ఇండియానే గెలిచింది. ఈ రెండు మ్యాచ్ లు కూడా వరల్డ్ కప్ లలోనే కావడం విశేషం. 2003, 2011 వరల్డ్ కప్ లలో నెదర్లాండ్స్ తో ఇండియా ఆడింది. ఆ రెండు మ్యాచ్ లలోనూ విజయం సాధించింది.

ఇండియా, నెదర్లాండ్స్ ఫామ్ ఎలా ఉందంటే?

చివరి 5 మ్యాచ్ లలో ఈ రెండు జట్ల ఫామ్ చూస్తే.. ఇండియా అన్ని మ్యాచ్ లలోనూ గెలిచి ఊపు మీద ఉంది. మరోవైపు నెదర్లాండ్స్ తన చివరి ఐదు మ్యాచ్ లలో నాలిగింట్లో ఓడి, కేవలం ఒకదాంట్లో మాత్రమే గెలిచింది.

ఈ విషయం మీకు తెలుసా?

15 ఏళ్ల కిందట అంటే 2008లో అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్లో ఇండియా, సౌతాఫ్రికా తలపడ్డాయి. ఆ ఫైనల్లో ప్రస్తుతం నెదర్లాండ్స్ తరఫున ఆడుతున్న ప్లేయర్ సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెట్ సౌతాఫ్రికా తరఫున ఆడాడు. ఇక ఇప్పుడు ఇండియన్ టీమ్ లో స్టార్ ప్లేయర్స్ అయిన విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా.. అప్పటి ఆ యంగ్ టీమిండియాలో ఉన్నారు.

తదుపరి వ్యాసం