IND vs ENG World Cup 2023 Highlights: ఇంగ్లండ్పై టీమిండియా ఘన విజయం.. అదరగొట్టిన భారత బౌలర్లు
29 October 2023, 21:57 IST
IND vs ENG ICC World Cup Highlights: వన్డే ప్రపంచకప్‍లో నేడు (అక్టోబర్ 29) ఇంగ్లండ్‍పై టీమిండియా ఘన విజయం సాధించింది. భారత బౌలర్లు సత్తాచాటారు. ఇంగ్లండ్‍పై 100 పరుగుల తేడాతో టీమిండియా గెలిచింది. 129 పరుగులకే ఇంగ్లిష్ జట్టును కుప్పకూల్చారు భారత బౌలర్లు.
టాప్ ప్లేస్‍కు టీమిండియా
ఇంగ్లండ్‍పై 100 పరుగుల తేడాతో ఈ మ్యాచ్‍లో గెలిచింది భారత్. దీంతో ఈ ప్రపంచకప్‍లో వరుసగా ఆరో మ్యాచ్‍లో విజయం సాధించి.. అజేయ యాత్రను కొనసాగించింది. ఈ గెలుపుతో ప్రపంచకప్ పాయింట్ల పట్టికలో టాప్‍కు చేరింది టీమిండియా (12 పాయింట్లు). సెమీ ఫైనల్ బెర్తుకు మరింత చేరువైంది. ఇక, డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ ఆరింట ఐదు మ్యాచ్‍ల్లో ఓడి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో కొనసాగింది.
భారత్ గెలుపు.. అదరగొట్టిన షమీ, బుమ్రా
భారత బౌలర్లు అద్భుతమైన బౌలింగ్ చేసి ఇంగ్లండ్‍ను 34.5 ఓవర్లలో 129 పరుగులకే కుప్పకూల్చారు. టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ నాలుగు వికెట్లతో మరోసారి అదరగొట్టాడు. అఖరి వికెట్ సహా జస్‍ప్రీత్ బుమ్రా మొత్తంగా మూడు వికెట్లు దక్కించుకున్నాడు. కుల్‍దీప్ యాదవ్‍కు రెండు, జడేజాకు ఓ వికెట్ దక్కింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో లియమా లివింగ్ స్టోన్ (27) ఒక్కడే కాసేపు నిలిచాడు. మరే ఇతర ఇంగ్లండ్ బ్యాటర్ కూడా కనీసం 20 పరుగులు కూడా చేయలేకపోయారు.
టీమిండియా ఘన విజయం
భారత్ అద్భుత విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్‍లో ఇంగ్లండ్‍పై టీమిండియా 100 పరుగుల తేడాతో గెలిచింది. ఇంగ్లండ్‍ను 129 పరుగులకే భారత బౌలర్లు కుప్పకూల్చారు.
నాలుగో వికెట్ పడగొట్టిన షమీ.. గెలుపుకు దగ్గర్లో భారత్
టీమిండియా విజయానికి సమీపించింది. ఇంగ్లండ్ బ్యాటర్ ఆదిల్ రషీద్ (13)ను భారత పేసర్ మహమ్మద్ షమీ బౌల్డ్ చేశాడు. దీంతో 34 ఓవర్లలో 122 పరుగుల వద్ద 9వ వికెట్ కోల్పోయింది ఇంగ్లండ్. భారత్ విజయానికి ఒక వికెట్ దూరంలో ఉంది.
ఇంగ్లండ్ 112/8
33 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ 8 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. ఆదిల్ రషీద్ (5 నాటౌట్), డేవిడ్ విల్లే (9 నాటౌట్) బ్యాటింగ్ చేస్తున్నారు. మరో రెండు వికెట్లు తీస్తే భారత్ విజయం సాధిస్తుంది.
ఇంగ్లండ్ ఎనిమిదో వికెట్ డౌన్
ఇంగ్లండ్ ఓటమికి సమీపిస్తోంది. ఇంగ్లిష్ బ్యాటర్ లియామ్ లివింగ్‍స్టోన్ (27)ను భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఎల్‍బీడబ్ల్యూ చేశాడు. దీంతో 29.2 ఓవర్లలో 98 పరుగుల వద్ద 8వ వికెట్ కోల్పోయింది ఇంగ్లండ్.
ఏడో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్
IND vs ENG ICC World Cup Live Updates: ఇంగ్లండ్ బ్యాటర్ క్రిస్ వోక్స్ (10)ను భారత బౌలర్ రవీంద్ర జడేజా ఔట్ చేశాడు. దీంతో 28.1 ఓవర్లలో 98 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది ఇంగ్లండ్. ఇక మరో మూడు వికెట్లు తీస్తే భారత్ విజయం సాధిస్తుంది. ఇంగ్లిష్ జట్టు గెలవాలంటే ఇంకా 132 పరుగులు చేయాలి.
26 ఓవర్లలో ఇంగ్లండ్ 91/6
26 ఓవర్లు ముగిసే సరికి 6 వికెట్ల నష్టానికి ఇంగ్లండ్ 91 పరుగులకు చేరింది. లివింగ్ స్టోన్ (23 నాటౌట్), క్రిస్ వోక్స్ (7 నాటౌట్) ఆడుతున్నారు. ఇంగ్లండ్ గెలవాలంటే 24 ఓవర్లలో ఇంకా 139 రన్స్ చేయాలి.
షమీ మరొకటి.. ఆరో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్
భారత బౌలర్ మహమ్మద్ షమీ ఈ మ్యాచ్‍లో మూడో వికెట్ తీశాడు. 24వ ఓవర్ తొలి బంతికే ఇంగ్లండ్ బ్యాటర్ మోయిన్ అలీని షమీ ఔట్ చేశాడు. దీంతో 23.1 ఓవర్లలో 81 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుంది ఇంగ్లండ్.
ఆచితూచి ఆడుతున్న ఇంగ్లండ్
20 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ 5 వికెట్లకు 68 పరుగులు చేసింది. లివింగ్‍స్టోన్ (11 నాటౌట్), మోయిన్ అలీ (11) జాగ్రత్తగా ఆడుతున్నారు. భారత బౌలర్ల కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు.
17 ఓవర్లలో 61/5
17 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ 5 వికెట్లకు 61 పరుగులు చేసింది. మోయిన్ అలీ (9 నాటౌట్), లియామ్ లివింగ్‍స్టోన్ (7 నాటౌట్) బ్యాటింగ్ చేస్తున్నారు.
బట్లర్‌ను బౌల్డ్ చేసిన కుల్‍దీప్
ICC Cricket ODI World Cup 2023: ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ (10)ను భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 15.1 ఓవర్లలో 52 పరుగల వద్ద ఐదో వికెట్ కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది ఇంగ్లండ్. గెలవాలంటే ఇంగ్లిష్ జట్టు ఇంకా 178 రన్స్ చేయాలి.
కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్న భారత్
భారత బౌలర్లు ఇంగ్లండ్‍ను కట్టడి చేస్తున్నారు. 14 ఓవర్లు ముగిసే నాటికి ఇంగ్లండ్ 4 వికెట్లు నష్టపోయి 47 పరులు చేసింది. బట్లర్ (6 నాటౌట్), మోయిన్ అలీ (5 నాటౌట్) ఆచితూచి ఆడుతున్నారు.
12 ఓవర్లలో ఇంగ్లండ్ 42/4
భారత బౌలర్ల ధాటిగా ఇంగ్లండ్ విలవిల్లాడుతోంది. 12 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 42 రన్స్ చేసింది. జాస్ బట్లర్ (4 నాటౌట్), మోయిన్ అలీ (3 నాటౌట్) బ్యాటింగ్ చేస్తున్నారు.
నాలుగో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్
ఇంగ్లండ్ నాలుగో వికెట్ కూడా కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. 10వ ఓవర్ తొలి బంతికి ఇంగ్లిష్ బ్యాటర్ జానీ బెయిర్ స్టో (14)ను భారత పేసర్ షమీ బౌల్డ్ చేశాడు. దీంతో 39 పరుగుల వద్ద ఇంగ్లండ్ నాలుగో వికెట్ డౌన్ అయింది.
స్టోక్స్‌ను బౌల్డ్ చేసిన షమీ
ఇంగ్లండ్ స్టార్ బెన్ స్టోక్స్(0)ను భారత పేసర్ మహమ్మద్ షమీ బౌల్డ్ చేశాడు. దీంతో 8 ఓవర్లలో 33 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది ఇంగ్లండ్.
అదరగొడుతున్న భారత బౌలర్లు
జస్‍ప్రీత్ బుమ్రా సహా భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. దీంతో 7 ఓవర్లలో ఇంగ్లండ్ 2 వికెట్లకు 33 పరుగులు చేసింది. బెయిర్ స్టో (13 నాటౌట్), బెన్ స్టోక్స్ (0 నాటౌట్) బ్యాటింగ్ చేస్తున్నారు.
వరుసగా రెండు వికెట్లు తీసిన బుమ్రా
భారత బౌలర్ జస్‍ప్రీత్ బుమ్రా 5వ ఓవర్లో వరుస బంతుల్లో ఇంగ్లండ్ బ్యాటర్లు డేవిడ్ మలన్ (16), జో రూట్ (0)ను ఔట్ చేశాడు. ఈ ఓవర్ చివరి బంతికి రూట్‍ను డకౌట్ చేశాడు బుమ్రా. దీంతో 30 పరుగుల వద్ద రెండో వికెట్ కూడా కోల్పోయింది ఇంగ్లండ్.
తొలి వికెట్ తీసిన బుమ్రా
ఇంగ్లండ్ ఓపెనర్ డేవిడ్ మలన్ (16)ను భారత పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా బౌల్డ్ చేశాడు. దీంతో 4.5 ఓవర్లలో 30 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది ఇంగ్లండ్.
4 ఓవర్లలో 26 రన్స్
4 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 26 పరుగులు చేసింది ఇంగ్లండ్.
నిలకడగా ఇంగ్లండ్ ఓపెనర్లు
ఇంగ్లండ్ ఓపెనర్లు డేవిడ్ మలన్ (12), జానీ బెయిర్ స్టో (8) నిలకడగా ఆడుతున్నారు. దీంతో 3 ఓవర్లలో 20 పరుగులు చేసింది ఇంగ్లండ్.
తొలి ఓవర్లో 4 పరుగులు
భారత బౌలర్ బుమ్రా వేసిన తొలి ఓవర్లో ఇంగ్లండ్ 4 పరుగులు చేసింది. జానీ బెయిర్ స్టో ఫోర్ కొట్టాడు.
లక్ష్యఛేదనను మొదలుపెట్టిన ఇంగ్లండ్
230 పరుగుల లక్ష్యఛేదనను ఇంగ్లండ్ మొదలుపెట్టింది. ఇంగ్లిష్ ఓపెనర్లు డేవిడ్ మలన్, జానీ బెయిర్ స్టో ఓపెనింగ్‍కు దిగారు. భారత బౌలర్ జస్‍ప్రీత్ బుమ్రా తొలి ఓవర్ వేస్తున్నాడు.
ముగిసిన టీమ్ ఇండియా ఇన్నింగ్స్
ఇంగ్లండ్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో టీమిండియా యాభై ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 229 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ 87 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా...సూర్యకుమార్ యాదవ్ 49, కేఎల్ రాహుల్ 39 రన్స్ చేశారు. కోహ్లి డకౌట్ అయ్యాడు
48 ఓవర్లలో 220 రన్స్ చేసిన టీమిండియా
48 ఓవర్లలో టీమిండియా 220 రన్స్ చేసింది. బుమ్రా 12 పరుగులు, కుల్దీప్ యాదవ్ 6 రన్స్‌తో క్రీజులో ఉన్నారు.
హాఫ్ సెంచరీ మిస్
సూర్య కుమార్ యాదవ్ 49 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఒక పరుగుల తేడాతో హాఫ్ సెంచరీ మిస్సయ్యాడు. టీమిండియా 47 ఓవర్లలో 214 పరుగులు చేసింది. ప్రస్తుతం బుమ్రా, కుల్దీప్ యాదవ్ క్రీజులో ఉన్నారు.
200 పరుగులు దాటిన టీమిండియా
టీమిండియా స్కోరు 200 పరుగులు దాటింది. సూర్యకుమార్, బుమ్రా కలిసి టీమిండియా స్కోరును 200 పరుగులు దాటించారు.
44 ఓవర్లలో 194 రన్స్ చేసిన ఇండియా
44 ఓవర్లలో టీమిండియా ఏడు వికెట్లు నష్టపోయి 194 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ 41 పరుగులతో క్రీజులో ఉన్నాడు. అతడితో పాటు బుమ్రా బ్యాటింగ్ చేస్తోన్నాడు.
షమీ ఔట్ - ఆలౌట్ దిశగా టీమిండియా
టీమిండియా ఆలౌట్ దిశగా సాగుతోంది. 183 పరుగుల స్కోరు వద్ద షమీ వికెట్ కోల్పోయింది. టీమిండియా 42 ఓవర్లలో టీమిండియా 183 పరుగులు చేసింది సూర్యకుమార్ యాదవ్, బుమ్రా బ్యాటింగ్ చేస్తోన్నారు.
జడేజా ఔట్ - ఆరో వికెట్ కోల్పోయిన టీమిండియా
టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. 8 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జడేజా ఔటయ్యాడు. ప్రస్తుతం టీమిండియా 41 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 183 పరుగులతో ఆడుతోంది. సూర్యకుమార్ యాదవ్‌తో పాటు షమీ క్రీజులో ఉన్నారు.
39 ఓవర్లలో 172 రన్స్ చేసిన టీమిండియా
39 ఓవర్లు ముగిసే సరికి ఐదు వికెట్లు కోల్పోయిన టీమిండియా 172 పరుగులు చేసింది ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ 28 రన్స్, జడేజా 5 రన్స్‌తో క్రీజులో ఉన్నారు.
రోహిత్ శర్మ ఔట్
టీమిండియాకు షాక్ తగిలింది. దూకుడుగా ఆడుతోన్న రోహిత్ శర్మను ఔట్ చేసిన ఆదిల్ రషీద్ ఇంగ్లండ్‌కు బ్రేక్ ఇచ్చాడు. 101 బాల్స్‌లో 10 ఫోర్లు, మూడు సిక్సర్లతో 87 పరుగులు చేసిన రోహిత్ శర్మ సెంచరీ ముంగిట ఔటయ్యాడు.
జోరు పెంచిన రోహిత్, సూర్యకుమార్
రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ జోరు పెంచడంతో టీమిండియా 36 ఓవర్లలో 163 పరుగులు చేసింది రోహిత్ శర్మ 87 రన్స్‌తో, సూర్యకుమార్ 24 రన్స్‌తో ఆడుతోన్నారు.
33 ఓవర్లలో 145 రన్స్ చేసిన టీమిండియా
ఇంగ్లండ్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో టీమిండియా 33 ఓవర్లలో 145 రన్స్ చేసింది. ఈ మ్యాచ్‌లో కోహ్లి, గిల్, శ్రేయస్ అయ్యర్ విఫలం కాగా...రాహుల్ 39 రన్స్‌తో రాణించాడు. ప్రస్తుతం రోహిత్, సూర్యకుమార్ క్రీజులో ఉన్నారు.
కేఎల్ రాహుల్ ఔట్
కేఎల్ రాహుల్ ఔటయ్యాడు. 58 బాల్స్‌లో మూడు ఫోర్లతో 39 రన్స్ చేసిన రాహుల్ విల్లే బౌలింగ్‌లో బెయిర్ స్టోకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
రోహిత్ దూకుడు
30 ఓవర్లలో టీమిండియా 131 పరుగులు చేసింది. రోహిత్ శర్మ దూకుడు పెంచుతోండగా కేఎల్ రాహుల్ అతడికి చక్కటి సహకారం అందిస్తున్నాడు. ప్రస్తుతం రోహిత్ 79, కేఎల్ రాహుల్ 39 రన్స్‌తో ఆడుతోన్నారు
27 ఓవర్లలో టీమిండియా స్కోరు 166 రన్స్
టీమిండియా ఇరవై ఏడు ఓవర్లలో 166 రన్స్ చేసింది. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ దూకుడు పెంచుతున్నారు.
ఇరవై ఐదు ఓవర్లలో టీమిండియా స్కోరు 101 రన్స్
ఇరవై ఐదు ఓవర్లలో టీమిండియా వంద పరుగులు చేసింది. రోహిత్ శర్మ 57 పరుగులతో, కేఎల్‌రాహుల్ 31 రన్స్‌తో క్రీజులో ఉన్నారు. టీమిండియా మూడు వికెట్లు కోల్పోయింది.
రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ
ఇంగ్లండ్‌పై రోహిత్ శర్మ హాఫ్ సెంచరీని పూర్తిచేసుకున్నాడు. 66 బాల్స్‌లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 50 పరుగులు చేశాడు. టీమిండియా 23 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి 81 పరుగులు చేసింది. రోహిత్‌తోపాటు కేఎల్ రాహుల్ 19 పరుగులతో క్రీజులో ఉన్నాడు.
వికెట్ల పతనాన్ని అడ్డుకున్న రోహిత్, రాహుల్
40 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ టీమిండియాను రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఆదుకున్నారు. వీరిద్దరు నిలకడగా ఆడుతోండటంతో టీమిండియా 20 ఓవర్లలో 73 పరుగులు చేసింది. రోహిత్ 44 , కేఎల్ రాహుల్ 16 పరుగులతో బ్యాటింగ్ చేస్తోన్నారు.
18 ఓవర్లలో టీమిండియా స్కోరు 67 రన్స్
18 ఓవర్లలో టీమిండియా 67 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 42, కేఎల్ రాహుల్ 12 రన్స్‌తో నిలకడగా ఆడుతోన్నారు.
నిలకడగా ఆడుతోన్న రోహిత్, రాహుల్
టీమిండియా వికెట్ల పతనాన్ని రోహిత్, రాహుల్ అడ్డుకున్నారు. ప్రస్తుతం టీమిండియా 16 ఓవర్లలో 56 రన్స్ చేసింది. రోహిత్ శర్మ 37 రన్స్, కేఎల్ రాహుల్ 5 రన్స్‌తో క్రీజులో ఉన్నారు.
14 ఓవర్లలో 49 పరుగులు చేసిన టీమిండియా
పద్నాలుగు ఓవర్లలో టీమిండియా 49 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 33, కేఎల్ రాహుల్ 3 పరుగులతో ఆడుతోన్నారు.
శ్రేయస్ అయ్యర్ ఔట్
టీమిండియా కష్టాల్లో పడింది. 40 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. నాలుగు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో మార్క్ వుడ్‌కు క్యాచ్ ఇచ్చి శ్రేయస్ అయ్యర్ ఔటయ్యాడు.
తొమ్మిది ఓవర్లలో 31 రన్స్ చేసిన టీమిండియా
టీమిండియా తొమ్మిది ఓవర్లలో 31 పరుగులు చేసింది. ప్రస్తుతం రోహిత్ శర్మ 20, శ్రేయస్ అయ్యర్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు.
కోహ్లి డకౌట్
టీమిండియాకు షాక్ తగిలింది. కోహ్లి డకౌట్ అయ్యాడు. 9 బాల్స్ ఎదుర్కొన్న కోహ్లి పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరుకున్నాడు. ఏడు ఓవర్లలో టీమిండియా 27 రన్స్ చేసింది.
తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా
టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో శుభ్‌మన్ గిల్ ఔటయ్యాడు. ప్రస్తుతం నాలుగు ఓవర్లలో టీమిండియా 27 పరుగులు చేసింది.
బాదుడు మొదలుపెట్టిన రోహిత్
భారత ఓపెనర్ రోహిత్ శర్మ మూడో ఓవర్లో రెండు సిక్సర్లు, ఓ ఫోర్ బాదాడు. దీంతో మూడు ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టపోకుండా 22 పరుగులు చేసింది. రోహిత్ (17 నాటౌట్), శుభ్‍మన్ గిల్ (5 నాటౌట్) బ్యాటింగ్ చేస్తున్నారు.
తొలి ఓవర్ మెయిడిన్
తొలి ఓవర్లో పరుగుల ఖాతా తెరువలేదు భారత్. మెయిడిన్ ఓవర్ చేశాడు ఇంగ్లండ్ పేసర్ విల్లే. భారత ఓపెనర్ రోహిత్ శర్మ ఆరు బంతులను ఎదుర్కొన్నాడు.
టీమిండియా బ్యాటింగ్ షురూ
ఇంగ్లండ్‍తో మ్యాచ్‍లో టీమిండియా ముందుగా బ్యాటింగ్ మొదలుపెట్టింది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్‍మన్ గిల్ ఓపెనింగ్‍కు వచ్చారు. ఇంగ్లండ్ పేసర్ విల్లే తొలి ఓవర్ వేస్తున్నాడు.
సేమ్ టీమ్స్!
వరల్డ్ కప్ మ్యాచ్‌లో ఇండియా, ఇంగ్లండ్ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. సేమ్ టీమ్స్‌లో బరిలో దిగనున్నాయి.
ఇంగ్లండ్ టీమ్ ఇదే
బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, రూట్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్, లివింగ్‌స్టోన్, మెయిన్ అలీ, క్రిస్ వోక్స్, విల్లే, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్
ఇండియా జట్టు ఇదే
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, బుమ్రా, సిరాజ్
టాస్ గెలిచిన ఇంగ్లండ్
ఈ మ్యాచ్‍లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ ముందుగా బౌలింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో భారత జట్టు ముందుగా బ్యాటింగ్‍కు దిగనుంది.
స్పిన్ పిచ్...
లక్నో పిచ్ బ్యాటింగ్‌తో పాటు స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
కెప్టెన్‌గా రోహిత్ వందో మ్యాచ్
ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న మ్యాచ్‌తో రోహిత్ అరుదైన రికార్డ్ నెలకొల్పబోతున్నాడు. కెప్టెన్‌గా వంద మ్యాచ్‌ల మైలురాయిని చేరనున్నాడు. మూడు ఫార్మెట్స్‌లో కలిపి సారథిగా వంద మ్యాచ్‌ల మైలురాయిని నేటి మ్యాచ్‌తో రోహిత్ అందుకోనున్నాడు.
ఫస్ట్ బౌలింగ్ చేసిన జట్టు గెలుపు...
లక్నో పిచ్‌పై తొలుత బౌలింగ్ చేసిన జట్టు గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ వేదికపై జరిగిన గత పన్నెండు మ్యాచుల్లో ఫస్ట్ బౌలింగ్ చేసిన జట్టు 9 సార్లు విజయాన్ని సాధించగా...మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 3 సార్లు విజయం సాధించింది.
స్టేడియానికి బయలుదేరిన ఇండియా టీమ్
ఇంగ్లాండ్‌తో మ్యాచ్ కోసం ఇండియా టీమ్ స్టేడియానికి బయలుదేరింది. గట్టి భద్రతా నడుమ ఇండియన్ క్రికెటర్స్ బస్‌లో స్టేడియానికి వెళుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి
రోహిత్‌కు గాయం - నేటి మ్యాచ్ ఆడుతాడా?
ప్రాక్టీస్ సెషన్‌లో రోహిత్ శర్మ గాయపడటంతో ఇంగ్లాండ్ తో మ్యాచ్ అతడు ఆడుతాడా? లేదా? అన్నది సస్పెన్స్‌గా మారింది. బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తోండగా మణికట్టుకు దెబ్బ తగిలింది. అయితే గాయం తీవ్రత తక్కువే కావడంతో ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో రోహిత్ శర్మ బరిలో దిగనున్నట్లు సమాచారం.
సచిన్ రికార్డ్ సమం...
వన్డేల్లో సచిన్ (49 సెంచరీలు) అత్యధిక సెంచరీల రికార్డును నేటి మ్యాచ్‌లో కోహ్లి (48 సెంచరీలు) సమం చేసే అవకాశాలు ఉన్నాయని క్రికెట్ విశ్లేషకులు చెబుతోన్నారు. నేటి మ్యాచ్‌లో కోహ్లిపైనే అందరి దృష్టి నెలకొంది.
ఇంగ్లాండ్ టాప్
ఇప్పటివరకు వన్డేల్లో ఇండియా, ఇంగ్లాండ్ 106 సార్లు తలపడ్డాయి. ఇందులో ఇంగ్లాండ్ 57 సార్లు గెలవగా...ఇండియా 44 సార్లు విజయం సాధించింది. మూడు మ్యాచులు ఫలితం తేలకుండా రద్దవ్వగా, రెండు మ్యాచ్‌లు టైగా ముగిశాయి.
టాప్ టెన్‌లో కోహ్లి, రోహిత్
వరల్డ్ కప్‌లో టీమిండియా సీనియర్ బ్యాట్స్‌మెన్స్ కోహ్లి, రోహిత్ ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. ఈ వరల్డ్ కప్‌లో అత్యధిక రన్స్ చేసిన క్రికెటర్ల జాబితాలో కోహ్లి (354 రన్స్) ఐదో స్థానంలో కొనసాగుతోండగా...రోహిత్ (311 పరుగులు) ఎనిమిదోస్థానంలో నిలిచాడు.
టైటిల్ ఫేవరెట్ గా
వరల్డ్ కప్ లో సెమీస్ కు బెర్త్ ఖరారు చేసుకోవడమే లక్ష్యంగా ఇవాళ ఇంగ్లాండ్ తో భారత్ బరిలోకి దిగనుంది. ఇప్పటివరకు ఓడిపోని భారత్ ఈ మ్యాచ్ పై కూడా ఆధిక్యం సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. రెండు జట్లు టైటిల్ ఫేవరేట్ గా బరిలోకి దిగగా భారత్ విజయంతో దూసుకుపోతుంటే.. ఇంగ్లాండ్ ఓటమిలతో వెనుకంజలో పడిపోయింది.
అగ్ర స్థానంలోకి
ఎకనా స్టేడియం వేదికగా జరగనున్న మ్యాచ్ భారత్ కు కీలకంగా మారనుంది. ఇప్పటివరకు అజేయంగా గెలుస్తూ వచ్చిన భారత్ ఇంగ్లాండ్ పై గెలిస్తే పాయింట్ల పట్టికలో రెండో స్థానం నుంచి అగ్ర స్థానానికి ఎగబాకుతుంది.
హార్దిక్ దూరం
ఇంగ్లండ్‍తో జరిగే ఈ మ్యాచ్‍కు కూడా భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అందుబాటులో లేడు. దీంతో సూర్యకుమార్ యాదవ్, మహమ్మద్ షమీ భారత తుది జట్టులో కొనసాగనున్నారు.
ఎవరికీ చోటు
లక్నోలోని ఎకానా పిచ్ స్పిన్‍కు ఎక్కువగా సహకరించే అవకాశం ఉంది. దీంతో మహమ్మద్ సిరాజ్ స్థానంలో తుది జట్టులోకి సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‍ను తీసుకోవాలనే ఆలోచనలో టీమిండియా మేనేజ్మెంట్ ఉంది. మరి.. సిరాజ్, అశ్విన్‍లో ఎవరికి ఈ మ్యాచ్‍లో భారత తుది జట్టులో చోటు దక్కుతుందో చూడాలి.
చరిత్ర
ప్రపంచకప్ చరిత్రలో భారత్, ఇంగ్లండ్ జట్లు 8 సార్లు తలపడ్డాయి. ఇందులో ఇంగ్లండ్ జట్టు సత్తా చాటింది. భారత్ 3 మ్యాచ్‌లు గెలవగా, ఇంగ్లండ్ 4 గెలిచింది. 2011 ప్రపంచకప్ మ్యాచ్ టైగా ముగిసింది.
ఇంగ్లండ్ తుదిజట్టు (అంచనా)
డేవిడ్ మలన్, జానీ బెయిర్‌స్టో, జో రూట్, బెన్ స్టోక్స్, జాస్ బట్లర్ (కెప్టెన్), లియామ్ లివింగ్ స్టోన్/హ్యారీ బ్రూక్, మోయిన్ అలీ, సామ్ కరన్, డేవిడ్ విల్లే, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్
భారత తుది జట్టు (అంచనా):
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహమ్మద్ సిరాజ్/ రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్‍ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ
వాతావరణం రిపోర్ట్
భారత్, ఇంగ్లండ్ మ్యాచ్ జరిగే ఆదివారం ఎకానా స్టేడియం వద్ద వర్షం పడే అవకాశాలు లేవు. మధ్యాహ్నం 31 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. సాయంత్రానికి 25 డిగ్రీల వరకు నమోదు కావొచ్చు.
పిచ్ ఎలా..
టీమిండియా, ఇంగ్లండ్ మ్యాచ్ జరగనున్న లక్నో ఎకానా స్టేడియం పిచ్ స్పిన్‍కు ఎక్కువగా అనుకూలించే అవకాశాలు ఉన్నాయి. పిచ్ కాస్త స్లోగా ఉంటుంది. ఆరంభంలో పేసర్లకు కూడా కాస్త సహకారం లభించవచ్చు.
మ్యాచ్ టైమ్, లైవ్ వివరాలు
వన్డే ప్రపంచకప్‍లో భారత్, ఇంగ్లండ్ మధ్య మ్యాచ్ ఆదివారం (అక్టోబర్ 29) జరగనుంది. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ మ్యాచ్ మొదలవుతుంది. అర గంట ముందు అంటే 1.30 గంటలకు టాస్ పడుతుంది. స్టార్ స్పోర్ట్స్ నెట్‍వర్క్ టీవీ ఛానెళ్లలో ఈ మ్యాచ్ లైవ్ టెలికాస్ట్ అవుతుంది. డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో లైవ్ స్ట్రీమింగ్ చూడవచ్చు.
ఇండియాకు పోటీ
వరల్డ్ కప్‌లో వరుసగా ఓటములను చవిచూసిన డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్.. స్టాండింగ్స్‌లో 10వ స్థానానికి పడిపోయింది. ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో 29వ మ్యాచ్‌లో టీమిండియాకు ఇంగ్లాండ్ పోటీ కానుంది.