తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Virat Kohli: వ‌న్డేల్లో శ్రీలంక‌పైనే కోహ్లి హ‌య్యెస్ట్ సెంచ‌రీలు - వాంఖ‌డేలో మ‌రో సెంచ‌రీ ఖాయ‌మేనా?

Virat Kohli: వ‌న్డేల్లో శ్రీలంక‌పైనే కోహ్లి హ‌య్యెస్ట్ సెంచ‌రీలు - వాంఖ‌డేలో మ‌రో సెంచ‌రీ ఖాయ‌మేనా?

01 November 2023, 13:39 IST

  • Virat Kohli: వ‌ర‌ల్డ్ క‌ప్‌లో భాగంగా గురువారం శ్రీలంక‌తో జ‌రుగుతోన్న మ్యాచ్‌లో కోహ్లి సెంచ‌రీ చేసి తీరుతాడ‌ని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తోన్నారు.  వ‌న్డేల్లో శ్రీలంక‌పైనే కోహ్లి అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన నేప‌థ్యంలో అభిమానుల ట్వీట్స్ వైర‌ల్ అవుతోన్నాయి

విరాట్ కోహ్లి
విరాట్ కోహ్లి

విరాట్ కోహ్లి

Virat Kohli: విరాట్ కోహ్లి 49వ సెంచ‌రీ క‌ల ఇంగ్లండ్‌పై తీరుతుంద‌ని అభిమానులు ఆశ‌ప‌డ్డారు. కానీ ఇంగ్లండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో కోహ్లి డ‌కౌట్ అయ్యి నిరాశ‌ప‌రిచాడు. ఆ మ్యాచ్‌లో చేజారిన క‌ల శ్రీలంక‌పై త‌ప్ప‌కుండా తీరుతుంద‌ని కోహ్లి అభిమానులు చెబుతోన్నారు వ‌ర‌ల్డ్ క‌ప్‌లో భాగంగా న‌వంబ‌ర్ 2న (గురువారం) శ్రీలంక‌తో టీమిండియా త‌ల‌ప‌డ‌నుంది.

ట్రెండింగ్ వార్తలు

Virat Kohli IPL : ‘విరాట్​ కోహ్లీ ఆడినా ఆర్సీబీ ఓడిపోతుంది’!

RCB vs CSK : ధోనీ కోపం.. కోహ్లీ ఎమోషనల్​- ట్రెండింగ్​లో ‘డెఫినెట్లీ నాట్​’! క్రికెట్​ అంటే ఇదే..

Virat Kohli: అంపైర్‌తో గొడవకు దిగిన విరాట్ కోహ్లీ.. అలా చేయమంటూ ఒత్తిడి.. చివరికీ..!

CSK vs RCB: ప్లేఆఫ్స్ చేరిన బెంగళూరు.. చిన్నస్వామిలో అద్భుత విజయం.. వరుసగా ఆరో గెలుపు.. చెన్నై ఎలిమినేట్

ముంబాయి వాంఖ‌డే స్టేడియం వేదిక‌గా ఈ మ్యాచ్ జ‌రుగ‌నుంది. శ్రీలంక‌పై కోహ్లి త‌ప్ప‌కుండా సెంచ‌రీ చేస్తాడ‌ని అత‌డి అభిమానులు సోష‌ల్ మీడియా ట్వీట్స్ చేస్తున్నారు. కోహ్లి వ‌న్డేల్లో ఇప్ప‌టివ‌ర‌కు 48 సెంచ‌రీలు చేశాడు. అందులో అత్య‌ధికంగా ప‌ది సెంచ‌రీలు శ్రీలంక‌పైనే చేయ‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలో అభిమానుల ట్వీట్స్ వైర‌ల్ అవుతోన్నాయి.

ఒక‌వేళ అభిమానులు కోరుకున్న‌ట్లుగా కోహ్లి శ్రీలంక‌పై సెంచ‌రీ సాధిస్తే వ‌న్డేల్లో అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన క్రికెట‌ర్‌గా స‌చిన్ రికార్డ్‌ను స‌మం చేసే అవ‌కాశం ఉంది. ఈ లిస్ట్‌లో 49 సెంచ‌రీల‌తో స‌చిన్ ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉండ‌గా...కోహ్లి 48 సెంచ‌రీల‌తో రెండో స్థానంలో కొన‌సాగుతోన్నాడు. 2023 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో కోహ్లి ఆరు మ్యాచుల్లో ఓ సెంచ‌రీ, మూడు హాఫ్ సెంచ‌రీల‌తో 354 ప‌రుగులు చేశాడు.

టీమిండియా త‌ర‌ఫున ఈ వ‌ర‌ల్డ్ క‌ప్‌లో హ‌య్యెస్ట్ స్కోర‌ర్‌గా కోహ్లి నిలిచాడు. ప్ర‌స్తుతం వ‌ర‌ల్డ్ క‌ప్ పాయింట్స్ టేబుల్‌లో ఆరు మ్యాచుల్లో ఆరు విజ‌యాల‌తో టీమిండియా టాప్ ప్లేస్‌లో కొన‌సాగుతోంది. మ‌రోవైపు ఆరు మ్యాచుల్లో రెండు విజ‌యాల‌తో శ్రీలంక ఏడో స్థానంలో నిలిచింది. టీమిండియాపై శ్రీలంక ఓడిపోతే ఆ జ‌ట్టు వ‌ర‌ల్డ్ క‌ప్‌ను నుంచి అఫీషియ‌ల్‌గా నిష్క్ర‌మిస్తుంది.

తదుపరి వ్యాసం