IND vs PAK Match Ad Revenue: ఇండియా పాక్ మ్యాచ్‌కు ఫుల్ డిమాండ్ - యాడ్ రెవెన్యూ టార్గెట్ ఎన్ని వందల కోట్లంటే...
29 August 2023, 10:38 IST
IND vs PAK Match Ad Revenue: ఆసియా కప్‌లో చిరకాల ప్రత్యర్థులు ఇండియా, పాకిస్థాన్ సెప్టెంబర్ 2న తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్ ద్వారా దాదాపు 400 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోవాలని లైవ్ బ్రాడ్‌కాస్టింగ్ సంస్థ స్టార్ గ్రూప్ భావిస్తోంది.
ఇండియా వర్సెస్ పాకిస్థాన్
IND vs PAK Match Ad Revenue: ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ అంటే క్రికెట్ అభిమానులకు పండగే. దాయాదుల మధ్య పోరు కోసం ప్రతి క్రికెట్ అభిమాని ఆసక్తిగా ఎదురుచూస్తుంటాడు. ఆసియా కప్ లో మరోసారి ఇండియా, పాకిస్థాన్ తలపడనున్నాయి.
సెప్టెంబర్ 2న పల్లకెలె వేదికగా ఈ చిరకాల ప్రత్యర్థుల మధ్య మ్యాచ్ జరుగనుంది. స్టార్ స్పోర్ట్స్‌తో పాటు డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ లైవ్ టెలికాస్ట్ ఉండనుంది. కాగా ఈ మ్యాచ్ ద్వారా భారీగా ఆదాయాన్ని సమకూర్చుకోవాలని స్టార్ గ్రూప్ భావిస్తోంది.
ఇప్పటికే ఈ మ్యాచ్ కోసం 17 మంది స్పాన్సర్లతో పాటు 100 మందికిపైగా అడ్వటైజర్లతో స్టార్ గ్రూప్ ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ లైవ్ టెలికాస్ట్ సమయంలో వచ్చే యాడ్స్ కోసం ఫుల్ డిమాండ్ ఉన్నట్లు సమాచారం. పది సెకండ్ల యాడ్ కోసం 25 నుంచి 30 లక్షల వరకు రేట్‌ను స్టార్ గ్రూప్ ఫిక్స్ చేసినట్లు సమాచారం.
ఈ మ్యాచ్ ద్వారా 400 కోట్లకుపైగా ఆదాయాన్ని సమకూర్చుకోవాలని స్టార్ గ్రూప్ ప్లాన్ చేసినట్లు తెలిసింది. కాగా ఈ మ్యాచ్ కోసం ఇండియా, పాకిస్థాన్ ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. బెంగళూరులో టీమీండియా ప్రాక్టీస్ సెషన్స్ కొనసాగుతోన్నాయి.
పాకిస్థాన్‌తో మ్యాచ్ కోసం టీమీండియా మంగళవారం మిడ్‌నైట్ కొలంబో బయలుదేరబోతున్నట్లు సమాచారం. మరోవైపు బుధవారం నుంచి మొదలుకానున్న ఆసియా కప్‌లో తొలి మ్యాచ్‌లో నేపాల్‌తో తలపడబోతున్నది పాకిస్థాన్.