తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Rajat Patidar: టీమిండియా నుంచి రంజీ ట్రోఫీలోకి ర‌జ‌త్ పాటిదార్ - బుమ్రా, రాహుల్ రీఎంట్రీ

Rajat Patidar: టీమిండియా నుంచి రంజీ ట్రోఫీలోకి ర‌జ‌త్ పాటిదార్ - బుమ్రా, రాహుల్ రీఎంట్రీ

29 February 2024, 8:55 IST

  • Rajat Patidar: ధ‌ర్మ‌శాల వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రుగ‌నున్న ఐదో టెస్ట్‌లో టీమిండియా భారీ మార్పులు చేయ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. ర‌జ‌త్ పాటిదార్‌కు జ‌ట్టు నుంచి ఉద్వాస‌న ప‌లికిన‌ట్లు స‌మాచారం. కేఎల్ రాహుల్‌, బుమ్రా రీఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

ర‌జ‌త్ పాటిదార్‌
ర‌జ‌త్ పాటిదార్‌

ర‌జ‌త్ పాటిదార్‌

Rajat Patidar: ఇంగ్లండ్‌తో జ‌రుగుతోన్న టెస్ట్ సిరీస్‌ను 3-1తో సొంతం చేసుకున్న‌ది టీమిండియా. విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్‌, శ్రేయ‌స్ అయ్య‌ర్‌తో పాటు ప‌లువురు సీనియ‌ర్లు లేక‌పోయినా యువ ఆట‌గాళ్ల స్ఫూర్తిదాయ‌క పోరాటంతో మ‌రో మ్యాచ్ మిగిలుండ‌గానే టెస్ట్ సిరీస్‌ను టీమిండియా కైవ‌సం చేసుక‌న్న‌ది.

ట్రెండింగ్ వార్తలు

Rohit Sharma: రోహిత్ శర్మతో మాట్లాడిన నీతా అంబానీ.. వీడియో వైరల్.. ఆ అంశం గురించే అంటున్న ఫ్యాన్స్

Virat Kohli : విరాట్​ కోహ్లీ గల్లీ క్రికెట్​ టీమ్​లో నలుగురు స్టార్​ ప్లేయర్స్​..

RCB vs CSK : వర్షం వల్ల సీఎస్కే వర్సెస్​ ఆర్సీబీ మ్యాచ్​ జరగకపోతే.. ప్లేఆఫ్స్​ పరిస్థితేంటి?

LSG vs MI: చిట్ట‌చివ‌రి స్థానంతో ఇంటిముఖం ప‌ట్టిన ముంబై - ల‌క్నోను గెలిపించిన పూర‌న్‌, రాహుల్

ధ‌ర్మ‌శాల వేదిక‌గా...

ఈ టెస్ట్ సిరీస్‌లో చివ‌రిదైన ఐదు టెస్ట్ మ్యాచ్ మార్చి 7 నుంచి 11 వ‌ర‌కు జ‌రుగ‌నుంది. ఐదో టెస్ట్‌కు ధ‌ర్మ‌శాల ఆతిథ్యం ఇవ్వ‌నుంది. కాగా చివ‌రి టెస్ట్‌లో టీమిండియా భారీ మార్పుల‌తో బ‌రిలోకి దిగ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. గ‌త మూడు టెస్టుల్లో దారుణంగా విఫ‌ల‌మైన యంగ్ ప్లేయ‌ర్ ర‌జ‌త్ పాటిదార్‌కు జ‌ట్టు నుంచి ఉద్వాస‌న ప‌లిక‌నున్న‌ట్లు స‌మాచారం. ఆరు ఇన్నింగ్స్‌ల‌లో క‌లిపి కేవ‌లం 63 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు పాటిదార్‌.

రెండు సార్లు డ‌కౌట్ అయ్యాడు. ఈ సిరీస్‌లో అత‌డి అత్య‌ధిక స్కోరు 32 ప‌రుగులు మాత్ర‌మే కావ‌డం గ‌మ‌నార్హం. మిడిల్ ఆర్డ‌ర్‌లో వ‌రుస‌గా విఫ‌ల‌మ‌వుతోన్న అత‌డిపై వేటు వేసిన‌ట్లు తెలిసింది. టీమిండియా నుంచి ఇప్ప‌టికే ర‌జ‌త్ పాటిదార్‌ను రిలీజ్ చేసిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. మార్చి 2 నుంచి విద‌ర్భ‌తో జ‌రుగ‌నున్న రంజీ మ్యాచ్‌లో ర‌జ‌త్ పాటిదార్ ఆడ‌బోతున్న‌ట్లు స‌మాచారం. రజ‌త్ పాటిదార్ దేశ‌వాళీలో మ‌ధ్య ప్ర‌దేశ్‌కు ప్రాతినిథ్యం వ‌హిస్తున్నాడు.

రాహుల్ రీఎంట్రీ

గాయంతో టెస్ట్ సిరీస్ నుంచి మ‌ధ్య‌లోనే దూర‌మైన కేఎల్ రాహుల్ ఐదో టెస్ట్‌తో తిరిగి జ‌ట్టులోకి రీఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ట్లు స‌మాచారం. మార్చి 2న రాహుల్‌కు ఫిట్‌నెస్ టెస్ట్ చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఈ టెస్ట్‌లో రాహుల్‌ ఫిట్‌గా ఉన్నాడ‌ని తెలితే జ‌ట్టుతో క‌లిసి అత‌డు ధ‌ర్మ‌శాల వెళ‌తాడ‌ని బీసీసీఐ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఒక‌వేళ రాహుల్ గాయం నుంచి కోలుకోని ప‌క్షంలో అత‌డి స్థానంలో దేవ‌ద‌త్ ఫ‌డిక్క‌ల్‌ను తుది జ‌ట్టులోకి తీసుకునే అవ‌కాశం ఉన్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఒక‌వేళ అదే జ‌రిగితే ధ‌ర్మ‌శాల టెస్ట్‌తో ఫ‌డిక్క‌ల్ టెస్టుల్లోకి అరంగేట్రం చేస్తాడు.

లండ‌న్‌లో ట్రీట్‌మెంట్‌...

గాయం నుంచి కేఎల్ రాహుల్ తొంభై శాతం కోలుకున్న‌ట్లు బీసీసీఐ మెడిక‌ల్ టీమ్ పేర్కొన్న‌ది. కానీ రాహుల్ మాత్రం బ్యాటింగ్ చేయ‌డానికి ఇబ్బంది ప‌డుతోన్నాడు. నొప్పి తో అసౌక‌ర్యంగా ఫీల‌వుతున్నాడు. ఒక‌వేళ గాయం తీవ్ర‌త ఇలాగే కొన‌సాగితే రాహుల్ ట్రీట్‌మెంట్ కోసం విదేశాల‌కు వెళ్ల‌వ‌చ్చ‌ని చెబుతోన్నారు. లండ‌న్‌లో ట్రీట్‌మెంట్ తీసుకునే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

బుమ్రా రీఎంట్రీ...

కేఎల్ రాహుల్‌తో పాటు ఐదో టెస్ట్‌లో బుమ్రా కూడా రీఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. నాలుగో టెస్ట్‌లో టీమ్ మేనేజ్‌మెంట్ బుమ్రాకు విశ్రాంతినిచ్చింది. అత‌డి స్థానంలో ఆకాష్ దీప్ జ‌ట్టులోకి వ‌చ్చాడు. ఆకాష్ దీప్ కూడా బౌలింగ్‌లో రాణించాడు. బుమ్రా తిరిగి వ‌చ్చే అవ‌కాశం ఉండ‌టంతో ఆకాస్ దీప్ బెంచ్‌కు ప‌రిమితం కావ‌చ్చున‌ని చెబుతున్నారు.ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో టీమిండియా మూడింటిలో విజ‌యం సాధించ‌గా ఇంగ్లండ్ హైద‌రాబాద్ టెస్ట్ మాత్ర‌మే గెలిచింది. ఈ సిరీస్‌లో రెండు డ‌బుల్ సెంచ‌రీల‌తో టీమిండియా విజ‌యంలో యంగ్ ప్లేయ‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ కీల‌క భూమిక పోషించాడు.

టాపిక్

For latest cricket news, live score, IPL stay connected with HT Telugu
తదుపరి వ్యాసం