తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Rohit Sharma: రోహిత్ శర్మ అత్యంత చెత్త రికార్డ్.. ఇలా అయితే ఎలా కెప్టెన్!

Rohit Sharma: రోహిత్ శర్మ అత్యంత చెత్త రికార్డ్.. ఇలా అయితే ఎలా కెప్టెన్!

Sanjiv Kumar HT Telugu

16 September 2023, 13:11 IST

google News
  • IND vs BAN Asia Cup 2023: ఆసియా కప్ 2023 సూపర్ 4 ఫైనల్‍ మ్యాచ్ గెలుపు మనదే అనుకున్న భారతీయులను నిరాశపరిచారు టీమిండియా క్రికెటర్లు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ డకౌట్ కావడంతో అత్యంత చెత్త రికార్డ్ నమోదు చేసుకున్నాడు.

రోహిత్ శర్మ అత్యంత చెత్త రికార్డ్.. ఇలా అయితే ఎలా కెప్టెన్!
రోహిత్ శర్మ అత్యంత చెత్త రికార్డ్.. ఇలా అయితే ఎలా కెప్టెన్!

రోహిత్ శర్మ అత్యంత చెత్త రికార్డ్.. ఇలా అయితే ఎలా కెప్టెన్!

ఆసియా కప్ సూపర్ 4 మ్యాచ్‍లో భారత ఆటగాళ్లకు పెద్ద షాక్ తగిలింది. అనూహ్య రీతిలో సూపర్ ఫోర్ మ్యాచులో ఓడిపోయింది ఇండియా. దాయాది దేశం పాకిస్తాన్‍ను ఏకంగా 228 పరుగులతో ఓడించి, శ్రీలంకపై 41 రన్స్ తో విజేతగా నిలిచిన టీమిండియా అలవోకగా గెలుస్తారనుకున్న బంగ్లాదేశ్ క్రికెటర్ల చేతుల్లో ఓటమి చెందింది. ఈ సూపర్ ఫోర్ ఆఖరి మ్యాచులో అతి స్వల్పంగా ఆరు పరుగుల తేడాతో బంగ్లాదేశ్‍ను ఇండియా విజేతగా ఉంచింది. కొలంబో వేదికగా జరిగిన ఈ మ్యాచ్ టాస్ గెలిచిన టీమిండియా తొలుత బంగ్లాదేశ్‍కు బ్యాటింగ్ చేసే అవకాశం ఇచ్చి 266 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది.

ఇదిలా ఉంటే లక్ష్య ఛేదనకు దిగిన ఇండియాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్‍గా దిగిని కెప్టెన్ రోహిత్ శర్మను బంగ్లా అరంగేట్ర బౌలర్ తంజీమ్ హసన్ సకీబ్ డకౌట్ చేశాడు. బంగ్లాదేశ్ కొత్త రైట్ ఆర్మ్ పేసర్ తంజీమ్ వేసిన రెండు బంతులను ఎదుర్కొన్న రోహిత్ శర్మ మూడో బంతికి ఒక్క పరుగు చేయకుండా పెవిలియన్‍కు చేరాడు. దీంతో రోహిత్ శర్మ ఆసియా వన్డే కప్ చరిత్రలో అత్యధిక సార్లు (3) డకౌట్ అయిన తొలి భారత ఆటగాడిగా అత్యంత చెత్త రికార్డ్ నమోదు చేసుకున్నాడు.

ఆసియా కప్ 2023 టోర్నీలో పరుగుల ఖాతా తెరవకుండానే 3 సార్లు ఔట్ అయిన ఐదో క్రికెటర్‍గా చెత్త రికార్డ్ జాబితాలో చోటు సంపాదించుకున్నాడు రోహిత్ శర్మ. ఇదే కాకుండా వన్డే ఫార్మాట్‍లో రోహిత్ శర్మ డకౌట్ కావడం ఇది ఏకంగా 15వ సారి కావడం అభిమానులను నిరాశపరుస్తోంది. రోహిత్ శర్మ డకౌట్ రికార్డ్ చూసి ఏంటిది కెప్టెన్ అంటూ క్రికెట్ లవర్స్, నెటిజన్స్ అనుకుంటున్నారు. కాగా ఆసియా వన్డే కప్ చరిత్రలో అత్యధికా సార్లు డకౌట్ అయిన క్రికెటర్లు వీళ్లే..

రూబెల్ హసన్ (బంగ్లాదేశ్)- 3 సార్లు

సల్మాన్ భట్ (పాకిస్తాన్)- 3 సార్లు

అమీనుల్ ఇస్తాం (బంగ్లాదేశ్)- 3 సార్లు

మహేళ జయవర్ధనే (శ్రీలంక)- 3 సార్లు

రోహిత్ శర్మ (భారత్)- 3 సార్లు

తదుపరి వ్యాసం