ICC ODI Rankings : వన్డే ర్యాంకింగ్‌లో నెంబర్ 1 దిశగా పాకిస్థాన్.. మరి భారత్ స్థానం ఎక్కడ?
26 August 2023, 13:24 IST
- ICC ODI Rankings : త్వరలో ఐసీసీ వన్డే వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఇప్పటికే జట్లన్నీ కసరత్తు చేస్తున్నాయి. అయితే ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ చూసుకుంటే.. పాకిస్థాన్ మెుదటి ప్లేసుకి వెళ్లే దిశగా ఉంది.
పాకిస్థాన్ క్రికెట్ జట్టు
ICC ODI Rankings : వన్డే వరల్డ్ కప్ దగ్గర పడుతోంది. పాల్గొనే జట్లన్నీ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇక పాకిస్థాన్ ప్రస్తుతం 118 రేటింగ్ పాయింట్లతో ICC ODI ర్యాంకింగ్‌లో 2వ స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా కూడా ఇదే సంఖ్యలో రేటింగ్ పాయింట్లను కలిగి ఉంది. అయితే పాయింట్ల పరంగా మాత్రం ముందుంది. ఇప్పుడు అఫ్గానిస్థాన్‌తో జరిగే ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్ గెలిస్తే ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి నెం.1 స్థానానికి చేరుకుంటుంది.
ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకున్న పాకిస్థాన్ పురుషుల క్రికెట్ జట్టు.. ICC ODI టీమ్ ర్యాంకింగ్స్‌లో No.1 స్థానానికి మరో అడుగు దూరంలో నిలిచింది. ఐసీసీ కొత్త వన్డే ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ ప్రస్తుతం 118 రేటింగ్ పాయింట్లతో 2వ స్థానంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా కూడా ఇదే సంఖ్యలో రేటింగ్ పాయింట్లతో ఉంది. కానీ పాయింట్ల పరంగా మాత్రం ముందుంది.
అయితే వన్డే ప్రపంచకప్‌కు సన్నద్ధం కావడానికి సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియా మొత్తం ఎనిమిది వన్డేలు ఆడనుండడంతో త్వరలో మళ్లీ అగ్రస్థానానికి చేరుకునే అవకాశం ఉంది. ఈ ఎనిమిది మ్యాచ్‌లలో ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికాకు వెళుతుంది. ఆ తర్వాత భారత్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది.
మూడో స్థానంలో ఉన్న టీమ్ ఇండియా.. రేటింగ్స్ పరంగా పాకిస్థాన్, ఆస్ట్రేలియా కంటే ఐదు పాయింట్లు వెనుకబడి ఉంది. న్యూజిలాండ్ 104 రేటింగ్స్‌తో నాలుగో స్థానంలో నిలిచింది. ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ ఇంగ్లండ్ 101 రేటింగ్స్‌తో ఐదో స్థానంలో ఉంది. దక్షిణాఫ్రికా ఆరో స్థానంలో ఉండగా.. భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో వెస్టిండీస్ 1-2 తేడాతో ఓడి 7వ స్థానంలో ఉంది. ఆ తర్వాత బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్ జట్లు వరుసగా 8, 9, 10 స్థానాల్లో నిలిచాయి.
భారత్ వేదికగా ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ జరగనుంది. అక్టోబర్ 5వ తేదీ నుంచి నవంబర్ 19వ తేదీ మధ్య జరగనున్న ఈ మెగాటోర్నీ కోసం క్రికెట్ అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. స్వదేశంలో టీమిండియా ప్రపంచకప్ గెలిచి ఐసీసీ ట్రోఫీల పదేళ్ల నిరీక్షణకు తెరదించాలని భారత ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. భారత్‍లో పది మైదానాల్లో వన్డే ప్రపంచకప్ మ్యాచ్‍లు జరగనున్నాయి. అహ్మదాబాద్, ముంబై, ఢిల్లీ, బెంగళూరు, కోల్‍కతా, చెన్నై, లక్నో, ధర్మశాల, పుణె, హైదరాబాద్ వేదికగా వరల్డ్ కప్ మ్యాచ్‍లు జరుగుతాయి.