తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Mohammed Siraj: బుమ్రా వ‌ల్లే ఎక్కువ వికెట్లు తీయ‌గ‌లిగా - సిరాజ్ కామెంట్స్‌

Mohammed Siraj: బుమ్రా వ‌ల్లే ఎక్కువ వికెట్లు తీయ‌గ‌లిగా - సిరాజ్ కామెంట్స్‌

04 January 2024, 13:09 IST

  • Mohammed Siraj: రెండో టెస్ట్‌లో తాను ఎక్కువ వికెట్లు తీయ‌డంలో బుమ్రా స‌హ‌కారం ఉంద‌ని అన్నాడు టీమిండియా పేస‌ర్ మ‌హ్మ‌ద్ సిరాజ్ తొలి టెస్ట్‌లో బౌలింగ్ ప‌రంగా చేసిన కొన్ని పొర‌పాట్ల‌ను రెండో టెస్ట్‌లో స‌రిదిద్దుకున్నాన‌ని తెలిపాడు.

మ‌హ్మ‌ద్ సిరాజ్
మ‌హ్మ‌ద్ సిరాజ్

మ‌హ్మ‌ద్ సిరాజ్

Mohammed Siraj: సౌతాఫ్రికాతో జ‌రుగుతోన్న రెండో టెస్ట్‌లో టీమిండియా పేస‌ర్ సిరాజ్‌ చెల‌రేగాడు. ఫ‌స్ట్ ఇన్నింగ్స్‌లో కేవ‌లం తొమ్మిది ఓవ‌ర్లు వేసిన సిరాజ్ ప‌దిహేను ప‌రుగులు ఇచ్చి ఆరు వికెట్లు తీసుకున్నాడు. సిరాజ్ పేస్ దెబ్బ‌కు విల‌విల‌లాడిన సౌతాఫ్రికా కేవ‌లం 55 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది.

ట్రెండింగ్ వార్తలు

India vs Pakistan: టీ20 ప్రపంచకప్‍లో ఇండియా, పాకిస్థాన్ సమరం జరిగే స్టేడియం ప్రారంభం.. లాంచ్ చేసిన పరుగుల వీరుడు

Sunrisers Hyderabad: రాజస్థాన్ వరుస పరాజయాలు.. సన్‍రైజర్స్ హైదరాబాద్‍కు ఆ గోల్డెన్ ఛాన్స్

Pbks vs RR: ప్లేఆఫ్స్ ముంగిట రాజ‌స్థాన్ త‌డ‌బాటు - వ‌రుస‌గా నాలుగో ఓట‌మి - పంజాబ్ చేతిలో చిత్తుగా ఓడిన సంజూ సేన‌

IPL 2024 RR vs PBKS: చేతులెత్తేసిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు.. వరుసగా నాలుగో ఓటమి తప్పదా?

అత్య‌ల్ప స్కోరుకు ఔటై చెత్త రికార్డును మూట గ‌ట్టుకుంది. తొలి టెస్ట్‌లో పెద్ద‌గా వికెట్లు తీయ‌ని బుమ్రా రెండో టెస్ట్‌లో మాత్రం పేస్ దాడితో చెల‌రేగాడు. సిరాజ్‌ యార్క‌ర్లు, బౌన్స‌ర్ల ధాటికి సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్స్ విల‌విలాడారు. రెండో టెస్ట్‌లో రాణించ‌డంపై సిరాజ్ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశాడు. తొలి టెస్ట్‌లో బౌలింగ్ ప‌రంగా తాను కొన్ని పొర‌పాట్లు చేసిన‌ట్లు తెలిపాడు.

బౌలింగ్‌లో వైవిధ్య‌త లేక‌పోవ‌డంతో ధారాళంగా ప‌రుగులు ఇచ్చాను. మెయిడిన్ ఓవ‌ర్ వేయ‌డానికి నా కెరీర్‌లో ఎక్కువ టైమ్ ఈ మ్యాచ్‌కే ప‌ట్టింది. మ్యాచ్‌లో నా ప్ర‌ద‌ర్శ‌న‌పై చాలా గిల్లీగా ఫీల‌య్యాను. ఎక్క‌డ త‌ప్పు జ‌రిగిందో అర్థం చేసుకొని రెండో టెస్ట్‌లో వాటిని స‌రిదిద్దుకున్నాన‌ని సిరాజ్ తెలిపాడు.

బుమ్రా స‌ల‌హాలు...

రెండు టెస్ట్‌లో వికెట్లు తీయ‌డంలో బుమ్రాతో పాటు వికెట్ కీప‌ర్ కేఎల్ రాహుల్ స‌ల‌హాలు ఉప‌యోగ‌ప‌డ్డాయ‌ని బుమ్రా అన్నాడు. వికెట్లు తీయ‌డంలో కీప‌ర్ స‌ల‌హాలు చాలా ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఏ లెంగ్త్‌లో బౌలింగ్ చేస్తే వికెట్లు ప‌డ‌తాయ‌న్న‌ది తెలుసుకుంటే వికెట్లు తీయ‌డం ఈజీ అవుతుంది. అందుకే బౌలింగ్ విష‌యంలో ప్ర‌తి ఒక్క‌రి స‌ల‌హాలు తీసుకుంటాన‌ని బుమ్రా అన్నాడు.

తొలి టెస్ట్‌లో బుమ్రా, తాను క‌లిసి చాలా మెయిడిన్లు వేశామ‌ని, రెండో టెస్ట్‌లో కూడా అదే ఫార్ములాను ఫాలో చేశామ‌ని సిరాజ్ తెలిపాడు. అదే సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్స్‌పై ఒత్తిడిని పెంచింద‌ని సిరాజ్ చెప్పాడు. ఆ ఒత్తిడిలోనే వికెట్ల‌ను కోల్పోయార‌ని చెప్పాడు. తాను ఎక్కువ వికెట్లు తీయ‌డంలో బుమ్రా స‌హ‌కారం ఉంద‌ని అన్నాడు. బుమ్రా ఎక్కువ‌గా వికెట్లు తీయ‌లేక‌పోయాయి. సౌతాఫ్రికా ప్లేయ‌ర్ల‌పై చాలా ఒత్తిడిని తీసుకొచ్చాడ‌ని, అది తాను వికెట్లు తీయ‌డానికి ఉప‌యోగ‌ప‌డింద‌ని తెలిపాడు.

టీమిండియా 153 ర‌న్స్‌....

రెండో టెస్ట్‌లో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 55 ప‌రుగుల‌కు ఆలౌట్ కాగా...టీమిండియా 153 ప‌రుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా మూడు వికెట్లు న‌ష్టానికి 62 ర‌న్స్ చేసింది. రెండో రోజు ఈ మ్యాచ్ ఫ‌లితం తేలే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం.

తదుపరి వ్యాసం