Harry Brook: 7 బాల్స్‌లోనే 31 రన్స్ చేసిన సన్‌రైజర్స్ క్రికెటర్ - టీ20లో 223 పరుగులు ఛేజ్ చేసిన ఇంగ్లాండ్
17 December 2023, 11:54 IST
Harry Brook: ఇంగ్లాండ్ క్రికెటర్ హ్యారీ బ్రూక్ సంచలన ఇన్నింగ్స్‌తో మెరిశాడు. వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో చివరి ఓవర్లో 22 రన్స్ చేసి ఇంగ్లాండ్‌ను గెలిపించాడు.
హ్యారీ బ్రూక్, ఫిలిప్ సాల్ట్
Harry Brook: హ్యారీ బ్రూక్ సంచలన ఇన్నింగ్స్‌తో ఇంగ్లాండ్‌కు అద్భుత విజయాన్ని అందించాడు. ఐదు బాల్స్‌లోనే 22 పరుగులు చేసి ఇంగ్లాండ్‌ను గెలిపించాడు. శనివారం ఇంగ్లాండ్, వెస్టిండీస్ మధ్య మూడో టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ ఇరవై ఓవర్లలో 222 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ 45 బాల్స్‌లో ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్లతో 82 రన్స్ చేశాడు.
పూరన్‌తో పాటు పావెల్ (39 రన్స్), రూథర్‌ఫోర్డ్ (29 పరుగులు) ధనాధన్ ఇన్నింగ్స్‌లతో వెస్టిండీస్ భారీ స్కోరు చేసింది. 222 పరుగుల టార్గెట్‌ను మరో బాల్ మిగిలుండగానే ఇంగ్లాండ్ చేధించింది. ఇంగ్లాండ్ ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ సెంచరీతో చెలరేగాడు. సిక్సర్లతో విరుచుకుపడటంతో ఇంగ్లాండ్ ఈజీగా విక్టరీని నమోదు చేసింది. ఫిలిప్ సాల్ట్ 56 బాల్స్‌లోనే తొమ్మిది సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 109 రన్స్ చేశాడు. లివింగ్‌స్టోన్ 18 బాల్స్‌లో 30 పరుగలతో సాల్ట్‌కు సహకరించాడు.
అయితే చివరి ఓవర్‌లో ఇంగ్లాండ్ 21 పరుగులు చేయాల్సిఉండగా హ్యారీబ్రూక్ సంచలన ఇన్నింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఇంగ్లాండ్ ఓటమి ఖాయమనుకోన్న అద్భుతమే చేశాడు. రసెల్ వేసిన ఈ ఓవర్‌లో మూడు సిక్సర్లు, ఒక ఫోర్ తో 22 పరుగులు చేసి మరో బాల్ మిగిలుండగానే ఇంగ్లాండ్‌కు విక్టరీని అందించాడు. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో వెస్టిండీస్ 2-1 తేడాతో ఆధిక్యంలో ఉంది.