Ireland Series India Squad: ఐర్లాండ్ సిరీస్ నుంచి పాండ్య ఔట్
14 August 2023, 7:57 IST
Ireland Series India Squad:: ఐర్లాండ్‌తో జరుగనున్న టీ20 సిరీస్ నుంచి పాండ్యను పక్కనపెట్టారు. అతడితో పాటు సూర్యకుమార్ యాదవ్, ఇషాన్‌కిషన్, శుభ్‌మన్‌గిల్‌లకు విశ్రాంతినిచ్చారు.
సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ
Ireland Series India Squad: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ ఓటమి నేపథ్యంలో టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ పాండ్యకు బీసీసీఐ షాకిచ్చింది. ఐర్లాండ్‌తో సిరీస్‌కు అతడిని దూరం పెట్టింది. పాండ్య, సూర్యకుమార్ యాదవ్, శుభమన్‌గిల్‌తో పాటు, అక్షర్ పటేల్, ఇషాన్‌కిషన్, కుల్దీప్ యాదవ్, చాహల్‌లను ఈ సిరీస్ నుంచి విశ్రాంతినిచ్చారు.
వీరితో పాటు మరికొంత మంది యంగ్ ప్లేయర్స్ కూడా వెస్టిండీస్ నుంచి ఇండియాకు తిరిగి రానున్నారు. పాండ్యను కూడా ఐర్లాండ్‌కు పంపించే అవకాశం ఉందంటూ వార్తలొచ్చాయి. ఆసియా కప్‌తో పాటు వరల్డ్ కప్‌ను దృష్టిలో పెట్టుకొని అతడికి విశ్రాంతినిచ్చారు.
వెస్టిండీస్ సిరీస్‌లో రాణించిన తిలక్ వర్మ తో పాటు సంజూ శాంసన్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, ఆవేష్‌ఖాన్ మాత్రమే వెస్టిండీస్ నుంచి ఐర్లాండ్‌కు వెళ్లబోతున్నారు. ఐర్లాండ్ సిరీస్‌కు బుమ్రా కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు. ఐపీఎల్‌లో రాణించిన రింకూసింగ్, జితేన్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, శివమ్ మావిలకు ఐర్లాండ్ సిరీస్‌లో ఆడనున్నారు.
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఆగస్ట్ 18న డబ్లిన్ వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరుగనుంది. ఆగస్ట్ 20, 23న మిగిలిన టీ20 మ్యాచ్‌లు జరుగనున్నాయి. టీమ్ ఇండియా తరఫున 2022 సెప్టెంబర్ 25న బుమ్రా చివరి మ్యాచ్ ఆడాడు. వెన్ను గాయం కారణంగా చాలా కాలం పాటు జాతీయ జట్టుకు దూరమైన బుమ్రా ఐర్లాండ్ సిరీస్‌తో రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు.