Rohit Sharma Hardik Pandya: ప్రాక్టీస్ సెషన్‌లో రోహిత్‌కు హార్దిక్ పాండ్య హగ్ - డీఫ్ ఫేక్ అంటూ నెటిజన్ల ట్రోలింగ్
21 March 2024, 10:35 IST
Rohit Sharma Hardik Pandya: ఐపీఎల్ 2024లో సీజన్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకు రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్య కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు. కెప్టెన్సీ మార్పు తర్వాత ఫస్ట్ టైమ్ రోహిత్‌శర్మ, హార్దిక్ పాండ్య కలుసుకున్నారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.
హార్దిక్ పాండ్య, రోహిత్ శర్మ
Rohit Sharma Hardik Pandya: ఐపీఎల్ 2024 సీజన్‌లో ముంబై ఇండియన్ కెప్టెన్‌గా రోహిత్ శర్మను తప్పించిన యాజమాన్యం ఆ బాధ్యతల్ని హార్దిక్ పాండ్యకు అప్పగించింది. కెప్టెన్సీ మార్పు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ముంబై ఇండియన్స్‌కు ఐదు సార్లు కప్ అందించిన రోహిత్‌ను కాదని పాండ్యను కెప్టెన్ చేయడంపై క్రికెట్ ఫ్యాన్స్ మండిపడ్డారు. రోహిత్‌ను ముంబై ఇండియన్స్ తీవ్రంగా అవమానించిందని అతడి అభిమానులు ఫైర్ అయ్యారు.
గుజరాత్ కెప్టెన్‌గా...
కెప్టెన్సీ మార్పు వెనుక ఉన్న కారణమేమిటన్నది ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు రివీల్ చేయలేదు. గత రెండు సీజన్స్‌లో గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్‌గా హార్దిక్ పాండ్య వ్యవహరించాడు. తొలి ప్రయత్నంలోనే గుజరాత్‌ను విజేతగా నిలిపాడు. గత ఏడాది పాండ్య జట్టు రన్నరప్‌గా నిలిచింది. పాండ్యను తమ జట్టులోకి తీసుకోవడానికి గుజరాత్‌కు ముంబై ఇండియన్స్ వంద కోట్లకుపైనే ఖర్చు పెట్టినట్లు ప్రచారం జరిగింది.
ప్రాక్టీస్ సెషన్‌లో...
కెప్టెన్సీ బాధ్యతల నుంచి తనను తప్పించడంతో ముంబై ఇండియన్స్‌ను రోహిత్ వీడబోతున్నట్లు వార్తలొచ్చాయి. అయితే రోహిత్ నుంచి అలాంటి ప్రకటన మాత్రం రాలేదు. తాజాగా ఐపీఎల్ కోసం ముంబై ఇండియన్స్ జట్టు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తోంది. ఈ ప్రాక్టీస్ సెషన్‌లో రోహిత్ శర్మ బుధవారం జాయినయ్యాడు. ఈ ప్రాక్టీస్ సెషన్‌లో హార్దిక్ పాండ్య, రోహిత్ శర్మ ఒకరికొకరు ఎదురుపడ్డారు. రోహిత్ శర్మ దగ్గరకు వచ్చిన పాండ్య అతడికి హగ్ ఇచ్చాడు.
కొద్దిసేపు రోహిత్‌తో పాండ్య ముచ్చటించాడు. కెప్టెన్సీ మార్పు తర్వాత రోహిత్, పాండ్య కలుసుకోవడం ఇదే మొదటిసారి. ఈ వీడియో, ఫొటోలను ముంబై ఇండియన్స్ యాజమాన్యం ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. వన్ ఫ్యామిలీ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. రోహిత్, హార్దిక్ మధ్య గొడవలు ఏం లేవని ఫొటో ద్వారా క్లారిటీ ఇచ్చింది. పాండ్య కెప్టెన్సీలో రోహిత్ ఆడటానికి సిద్ధంగా ఉన్నాడని వెల్లడించింది. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నెటిజన్ల ట్రోల్
రోహిత్ అభిమానులు మాత్రం ఈ ఫొటోలను ట్రోల్ చేస్తున్నారు. ఇది ఒరిజినల్ వీడియో కాదని డీఫ్‌ఫేక్ వీడియో అంటూ ఓ అభిమాని ఫన్నీగా కామెంట్ చేశాడు. సింపథీ కోసమే హార్దిక్ డ్రామాలు ఆడుతున్నాడని ఫైర్ అవుతున్నారు. హార్దిక్ పాండ్య యాక్టింగ్‌లో నంబర్ వన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ కామెంట్స్ రచ్చలేపుతున్నాయి. కాగా గుజరాత్‌కు పాండ్య దూరం కావడంతో అతడి స్థానంలో కెప్టెన్సీ బాధ్యతల్ని శుభ్‌మన్ గిల్ స్వీకరించాడు.
గుజరాత్‌తో ఫస్ట్ మ్యాచ్...
ముంబై ఇండియన్స్ తన తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. మార్చి 24న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. ఐపీఎల్ మార్చి 22 నుంచి మొదలుకానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్...బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌తో తలపడనుంది.లోక్ సభ ఎన్నికల కారణంగా రెండు వారాల షెడ్యూల్‌ను మాత్రమే బీసీసీఐ ప్రకటించింది. ఎన్నికల అప్‌డేట్స్‌ను బట్టి మిగిలిన షెడ్యూల్‌ను త్వరలో అనౌన్స్ చేయబోతున్నారు.