తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Gt Ipl 2025 Players List: బౌలర్ల కోసం ఐపీఎల్ 2025 వేలంలో కోట్లు కుమ్మరించిన గుజరాత్ టైటాన్స్.. పూర్తి జట్టు ఇదే

GT IPL 2025 Players list: బౌలర్ల కోసం ఐపీఎల్ 2025 వేలంలో కోట్లు కుమ్మరించిన గుజరాత్ టైటాన్స్.. పూర్తి జట్టు ఇదే

Galeti Rajendra HT Telugu

26 November 2024, 7:01 IST

google News
  • Gujarat Titans Team IPL 2025: ఐపీఎల్ 2025 వేలంలో జోస్ బట్లర్‌ కోసం భారీగా ఖర్చు చేసిన గుజరాత్ టైటాన్స్.. ముగ్గురు బౌలర్ల కోసం కోట్లని కుమ్మరించేసింది.  అలానే ఆల్‌రౌండర్లతో జట్టులో సమతూకం పెంచుకుంది. 

ఐపీఎల్ 2025 సీజన్‌ గుజరాత్ టైటాన్స్ టీమ్
ఐపీఎల్ 2025 సీజన్‌ గుజరాత్ టైటాన్స్ టీమ్ (AFP)

ఐపీఎల్ 2025 సీజన్‌ గుజరాత్ టైటాన్స్ టీమ్

ఐపీఎల్ 2025 సీజన్ మెగా వేలంలో గుజరాత్ టైటాన్స్ ఫ్రాంఛైజీ ఫాస్ట్ బౌలర్ల కోసం ఎక్కువగా ఖర్చు చేసింది. రూ.69 కోట్లతో వేలానికి వచ్చిన గుజరాత్ టైటాన్స్.. మొత్తం 25 మంది ఆటగాళ్లని టీమ్‌లోకి తీసుకుంది. రిటెన్షన్ కోసం రూ.51 కోట్లు ఖర్చు చేసిన గుజరాత్ టైటాన్స్ ఫ్రాంఛైజీ.. వేలంలో రూ.68.85 కోట్లని వెచ్చించింది. టీమ్‌లోని 25 మందిల 18 మంది భారత్ ప్లేయర్లుకాగా.. మిగిలిన ఏడు మంది విదేశీ ఆటగాళ్లు

ఐపీఎల్ 2025 కోసం గుజరాత్ టైటాన్స్ రిటెన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితా ఇదే

 

  • రషీద్ ఖాన్ రూ.18 కోట్లు
  • శుభమన్ గిల్ రూ.16.50 కోట్లు
  • సాయి సుదర్శన్ రూ.8.50 కోట్లు
  • రాహుల్ తెవాటియా రూ.4 కోట్లు
  • షారూక్ ఖాన్ రూ.4 కోట్లు
  •  

ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసిన ప్లేయర్ల జాబితాని ఒకసారి పరిశీలిస్తే

 

  • మహ్మద్ సిరాజ్ రూ.12.25 కోట్లు
  • కగిసో రాబాడ రూ.10.75 కోట్లు
  • ప్రసీద్ కృష్ణ రూ.9.50 కోట్లు
  • గ్లెన్ ఫిలిప్స్ రూ.2 కోట్లు
  • కుమార్ క్షరంగ రూ.65 లక్షలు
  • అనుజ్ రావత్ రూ.30 లక్షలు
  • జోస్ బట్లర్ రూ.15.75 కోట్లు
  • నిశాంత్ సింధు రూ.30 లక్షలు
  • సాయి కిషోర్ రూ.2 కోట్లు
  • గెరాల్డ్ కూట్జీ రూ.2.40 కోట్లు
  • జయంత్ యాదవ్ రూ.75 లక్షలు
  • అర్షద్ ఖాన్ రూ.1.30 కోట్లు
  • కరీమ్ జనత్ రూ.75 లక్షలు
  • షెర్ఫాన్ రూథర్‌ఫర్డ్ రూ.2.60 కోట్లు
  • మహిపాల్ లూమర్ రూ.1.70 కోట్లు
  • వాషింగ్టన్ సుందర్ రూ.3.20 కోట్లు
  • మానవ్ సుథార్ రూ.30 లక్షలు
  • గుర్నార్ బరార్ రూ.1.30 కోట్లు
  • ఇషాంత్ శర్మ రూ.75 లక్షలు
  • కుల్వాంత్ కిల్జోలియా రూ.30 లక్షలు

     

ఐపీఎల్ 2024 సీజన్‌లో 14 మ్యాచ్‌లాడిన గుజరాత్ టైటాన్స్ టీమ్ కేవలం 5 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. దాంతో కనీసం ప్లేఆఫ్స్‌కి కూడా అర్హత సాధించలేకపోయింది.

తదుపరి వ్యాసం