తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Maxwell Batting: మ్యాక్స్‌వెల్ బ్యాటింగ్‌ను దించేసిన‌ బుడ్డోడు - ఇమిటేష‌న్ వీడియో వైర‌ల్‌

Maxwell Batting: మ్యాక్స్‌వెల్ బ్యాటింగ్‌ను దించేసిన‌ బుడ్డోడు - ఇమిటేష‌న్ వీడియో వైర‌ల్‌

10 November 2023, 13:49 IST

google News
  • Maxwell Batting:  మ్యాక్స్‌వెల్ డ‌బుల్ సెంచ‌రీని ఇమిటేట్ చేసిన ఓ బుడ్డోడి వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. ఈ వీడియోలో బుడ్డోడు మ్యాక్స్‌వెల్‌ను కాపీ పేస్ట్‌లా దించేశాడ‌ని నెటిజ‌న్లు పేర్కొంటున్నారు.

గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌
గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌

గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌

Maxwell Batting: అప్ఘ‌నిస్తాన్‌పై డ‌బుల్ సెంచ‌రీతో వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ఆస్ట్రేలియాను సెమీస్‌కు చేర్చాడు గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌. ఓట‌మి ఖాయ‌మైన త‌రుణంలో పాట్ క‌మిన్స్‌తో క‌లిసి అస‌మాన పోరాటం చేసిన మ్యాక్స్‌వెల్ డ‌బుల్ సెంచ‌రీ సాధించాడు. 128 బాల్స్‌లోనే 10 సిక్స‌ర్లు, 21 ఫోర్ల‌తో 201 ర‌న్స్ చేశాడు. అత‌డి ఇన్నింగ్స్‌లో ఫోర్లు, సిక్స‌ర్ల‌తోనే 144 ర‌న్స్ వ‌చ్చాయి. ఈ మ్యాచ్‌లో కండ‌రాల‌ గాయంతో మ్యాక్స్‌వెల్ ఇబ్బంది ప‌డ్డాడు. ప‌లుమార్లు వైద్య స‌హాయం తీసుకున్నాడు.

ఒకానొక‌ద‌శ‌లో పిచ్‌పై కుప్ప‌కూలిపోయాడు. గాయంతో న‌డ‌వ‌లేని స్థితిలో ఉండి కూడా అల‌వోక‌గా ఫోర్లు, సిక్స‌ర్లు బాదాడు. క్రికెట్ చ‌రిత్ర‌లో చిర‌స్థాయిగా నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడిన మ్యాక్స్‌వెల్‌పై క్రికెట‌ర్ల‌తో పాటు అభిమానులు ప్ర‌శంస‌లు వ‌ర్షం కురిపిస్తోన్నారు.ఈ మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్ బ్యాటింగ్ చేసిన తీరుకు సంబంధించిన ప‌లు వీడియోలో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోన్నాయి. మ్యాక్స్‌వెల్ ఈజీగా ఫోర్లు, సిక్స‌ర్లు కొట్ట‌డాన్ని ఓ బుడ్డోడుఇమిటేట్ చేశాడు.

న‌డ‌వ‌టానికి ఇబ్బంది ప‌డుతూనే మ్యాక్స్‌వెల్ కొట్టిన సిక్స్‌ను ఈ బుడ్డోడు అచ్చం కాపీ పేస్ట్ చేశాడు. మ్యాక్స్‌వెల్ కొట్టిన సిక్స్‌ల‌ను పూర్తిగా దించేశాడు. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. ఈ వీడియోను క్రికెట్ అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. మ్యాక్స్‌వెల్‌ను పూర్తిగా దించేశాడ‌ని అభిమానులు అంటోన్నారు.

తదుపరి వ్యాసం