తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Gavaskar On Team India: ఐదుసార్లు ఛాంపియన్ చేతుల్లో ఓడిపోవడంలో సిగ్గు పడాల్సిందేమీ లేదు.. గర్వంగానే ఉంది: గవాస్కర్

Gavaskar on Team India: ఐదుసార్లు ఛాంపియన్ చేతుల్లో ఓడిపోవడంలో సిగ్గు పడాల్సిందేమీ లేదు.. గర్వంగానే ఉంది: గవాస్కర్

Hari Prasad S HT Telugu

20 November 2023, 7:48 IST

  • Gavaskar on Team India: వరల్డ్ కప్ 2023 ఫైనల్లో ఆస్ట్రేలియాతో ఓడిన తర్వాత టీమిండియాను ఓదార్చే ప్రయత్నం చేశాడు మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్. ఐదుసార్లు ఛాంపియన్ చేతుల్లో ఓడిపోవడంలో సిగ్గు పడాల్సిందేమీ లేదని, వాళ్ల ఆటతీరు గర్వకారణమని అతడు అనడం గమనార్హం.

మాజీ క్రికెటర్లు హేడెన్, రవిశాస్త్రి, గవాస్కర్
మాజీ క్రికెటర్లు హేడెన్, రవిశాస్త్రి, గవాస్కర్ (PTI)

మాజీ క్రికెటర్లు హేడెన్, రవిశాస్త్రి, గవాస్కర్

Gavaskar on Team India: వరల్డ్ కప్ 2023లో ఫైనల్ వరకూ ఇరగదీసి.. అక్కడ ఆస్ట్రేలియా చేతుల్లో ఓడిపోయి తీవ్రంగా నిరాశకు గురి చేసింది టీమిండియా. ఈ ఓటమి తర్వాత గవాస్కర్ లాంటి మాజీ క్రికెటర్లు ఎవరూ ఇండియన్ టీమ్ ను వేలెత్తి చూపలేదు. పైగా ఆస్ట్రేలియాలాంటి టీమ్ చేతుల్లో ఓడిపోవడంలో సిగ్గు పడాల్సిందేమీ లేదని సన్నీ అనడం గమనార్హం.

ట్రెండింగ్ వార్తలు

RCB vs CSK : ధోనీ కోపం.. కోహ్లీ ఎమోషనల్​- ట్రెండింగ్​లో ‘డెఫినెట్లీ నాట్​’! క్రికెట్​ అంటే ఇదే..

Virat Kohli: అంపైర్‌తో గొడవకు దిగిన విరాట్ కోహ్లీ.. అలా చేయమంటూ ఒత్తిడి.. చివరికీ..!

CSK vs RCB: ప్లేఆఫ్స్ చేరిన బెంగళూరు.. చిన్నస్వామిలో అద్భుత విజయం.. వరుసగా ఆరో గెలుపు.. చెన్నై ఎలిమినేట్

RCB vs CSK: బాదేసిన బెంగళూరు.. డుప్లెసిస్, కోహ్లీ, పాటిదార్ మెరుపులు.. చెన్నై ముందు భారీ టార్గెట్.. ప్లేఆఫ్స్ చేరాలంటే..

ఫైనల్లో ఆస్ట్రేలియా 6 వికెట్లతో టీమిండియాను చిత్తు చేసి ఆరోసారి విశ్వవిజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఫైనల్ వరకూ ఓటమెరగని జట్టుగా దూసుకొచ్చిన ఇండియా.. అసలు మ్యాచ్ లో మొదట బ్యాటింగ్, తర్వాత బౌలింగ్ లో విఫలమయ్యారు. పరిస్థితులు కూడా ఆస్ట్రేలియాకు పూర్తిగా అనుకూలించాయి.

టీమ్‌ను చూస్తే గర్వంగా ఉంది: గవాస్కర్

మ్యాచ్ తర్వాత స్టార్స స్పోర్ట్స్ లో గవాస్కర్ మాట్లాడాడు. తనకు కూడా బాధగానే ఉన్నా.. ఈ టోర్నీలో టీమిండియా ఆడిన తీరు చూస్తే గర్వంగానే ఉందని చెప్పడం విశేషం. "నాకు బాధగా ఉంది. గత పది మ్యాచ్ లలో ఈ టీమ్ అద్భుతమైన క్రికెట్ ఆడింది. కానీ ట్రోఫీని అందించే చివరి అడుగు మాత్రం వేయలేకపోయారు. అయినా సరే మనమందరం వాళ్లను చూసి గర్వపడాల్సిందే.

ఈ టీమ్ అద్భుతమైన క్రికెట్ ఆడింది. ఇలా జరుగుతూనే ఉంటుంది. ఫైనల్లో తడబడతారు. గత పది మ్యాచ్ లలో మాత్రం అన్ని రంగాల్లోనూ ఈ టీమ్ అద్బుతంగా రాణించింది. ఫైనల్లోనూ కాస్త కలిసి రావాల్సింది. కానీ అలా జరగలేదు. అదృష్టం తిరగబడింది. కానీ మంచి టీమ్ చేతుల్లో ఓడిపోవడంలో సిగ్గు పడాల్సిందేమీ లేదు. ఆరోజు బాగా ఆడిన టీమ్ గెలుస్తుంది.

తొలి మ్యాచ్ లో ఇండియా బాగా ఆడి గెలిచింది. ఐదుసార్లు ఛాంపియన్స్ చేతుల్లో ఓడిపోవడంలో సిగ్గు పడాల్సిందేమీ లేదు. ఫైనల్స్ లో ఎలా గెలవాలో వాళ్లకు బాగా తెలుసు. టీమిండియా ఆడిన తీరు గర్వకారణం. కోట్లాది మందిని వాళ్లు అలరించిన తీరు గర్వకారణం" అని గవాస్కర్ అన్నాడు.

ఫైనల్లో ఆస్ట్రేలియా 6 వికెట్లతో గెలిచి వరల్డ్ కప్ ను ఆరోసారి ఎగరేసుకుపోయిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ తర్వాత కెప్టెన్ రోహిత్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి నుంచి మిగతా ప్లేయర్స్ అందరూ భావోద్వేగానికి లోనయ్యారు. డ్రెస్సింగ్ రూమ్ లో అందరూ ఎంతో నిరాశగా కనిపించారని అటు కోచ్ ద్రవిడ్ కూడా మ్యాచ్ తర్వాత చెప్పాడు.

తదుపరి వ్యాసం