Team India: వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా ఓడిపోవడానికి కారణాలు ఇవే-6 reasons why team india lost in world cup 2023 final against australia ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Team India: వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా ఓడిపోవడానికి కారణాలు ఇవే

Team India: వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా ఓడిపోవడానికి కారణాలు ఇవే

Nov 19, 2023, 09:59 PM IST Hari Prasad S
Nov 19, 2023, 09:59 PM , IST

  • Team India: వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా ఓడిపోవడానికి కారణాలు ఏంటి? ఈసారి కచ్చితంగా వరల్డ్ కప్ గెలుస్తుందనుకున్న ఇండియన్ టీమ్ ఫైనల్లో చేతులెత్తేసింది. ఈ ఓటమి కోట్లాది మంది అభిమానులను షాక్ కు గురి చేసింది. ఈ ఓటమికి ప్రధానంగా ఆరు కారణాలు కనిపిస్తున్నాయి.

Team India: వరల్డ్ కప్ 2023లో తొలి మ్యాచ్ లోనే ఆస్ట్రేలియాను చిత్తు చేసి తర్వాత మరో 9 విజయాలు సాధించిన ఇండియన్ టీమ్.. ఫైనల్లోనూ హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగింది. కానీ అసలు మ్యాచ్ లో బ్యాటింగ్, బౌలింగ్ లలో చేతులెత్తేసి మూడో వరల్డ్ కప్ అందుకోలేకపోయింది.

(1 / 7)

Team India: ఈ ఓటమికి ప్రధాన కారణం కోహ్లి, రాహుల్ ఆడిన తీరే. ఈ ఇద్దరూ రెండో పవర్ ప్లేలో కేవలం రెండే రెండు ఫోర్లు కొట్టగలిగారు. ఇక 11 నుంచి 50 ఓవర్ల మధ్య కేవలం 4 ఫోర్లు మాత్రమే కొట్టారు. కనీసం పార్ట్ టైమ్ బౌలర్లపై కూడా ఎదురు దాడి చేసే సాహసం కోహ్లి, రాహుల్ చేయలేదు. ఈ టోర్నీ మొత్తం ప్రత్యర్థి బౌలర్లపై ఆధిపత్యం చెలాయించి ఇండియా మ్యాచ్ లు గెలిచింది. కానీ ఫైనల్లో దానికి పూర్తి విరుద్దంగా జరిగింది.

(2 / 7)

Team India: ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ తొలి బంతికే వార్నర్ ను ఔట్ చేసే అవకాశాన్ని ఇండియా చేజార్చుకుంది. ఎడ్జ్ తీసుకున్న బంతి తొలి స్లిప్ లో ఉన్న కోహ్లి, రెండో స్లిప్ లో ఉన్న గిల్ మధ్య నుంచి వెళ్లిపోయింది. వాళ్లు కనీసం క్యాచ్ అందుకునే ప్రయత్నం కూడా చేయలేదు. తర్వాత కాసేపటికే అదే వార్నర్ ను మంచి క్యాచ్ తో కోహ్లి ఔట్ చేసినా.. తొలి బంతికే వికెట్ తీసి ఉంటే ఆ ఒత్తిడి మరోలా ఉండేది.

(3 / 7)

Team India: ఇండియా ఇచ్చిన ఎక్స్‌ట్రాలు కూడా కొంప ముంచాయి. మొత్తంగా ఇన్నింగ్స్ లో ఇండియా ఏకంగా 18 ఎక్స్‌ట్రాలు ఇవ్వడం గమనార్హం. షమి, బుమ్రాలు వైడ్ల రూపంలో భారీగా పరుగులు ఇచ్చుకోవడంతో ఆస్ట్రేలియాపై ఒత్తిడి తగ్గింది. తొలి 4 ఓవర్లలో 41 పరుగులు కాగా.. అందులో 11 అదనపు పరుగులే ఉన్నాయి.

(4 / 7)

Team India: షమి చేతికి కొత్త బంతి ఇవ్వడం పెద్దగా ఆశ్చర్యపరచలేదు కానీ కాస్త పాతబడిన బంతితో సిరాజ్ లయ తప్పాడు. కొత్త బంతితో కనిపించే దూకుడు అతనిలో కనిపించలేదు. ఇక స్పిన్నర్ల బౌలింగ్ లో స్లిప్ ఫీల్డర్ పెట్టకపోవడం కూడా కొంప ముంచింది. రెండు క్యాచ్ లు స్లిప్ ఫీల్డర్లు లేకపోవడం వల్ల బౌండరీలుగా వెళ్లాయి.

(5 / 7)

Team India: ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ తీసుకున్న నిర్ణయాలు అద్భుతం. టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకోవడం నుంచి బౌలింగ్ మార్పులు, ఫీల్డర్ల మోహరింపు అన్నీ ఆస్ట్రేలియాకు కలిసి వచ్చాయి. మధ్యాహ్నం సమయంలో స్లోగా ఉన్న పిచ్ పై ఇండియన్ బ్యాటర్లు పరుగులు చేయడానికి ఇబ్బంది పడగా.. రాత్రి పూట అదే పిచ్ పై సులువుగా పరుగులు వచ్చాయి. ఇది ముందుగానే ఊహించి మొదట కమిన్స్ ఫీల్డింగ్ ఎంచుకోవడం విశేషం.

(6 / 7)

Team India: ఈ ఏడాది మొదట్లో ఇండియా కొంప ముంచి ట్రావిస్ హెడ్.. ఇప్పుడు వరల్డ్ కప్ ఫైనల్లోనూ అదే రిపీట్ చేశాడు. 47 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియాను తన కళ్లు చెదిరే సెంచరీతో గెలిపించాడు. అతడు 120 బంతుల్లోనే 137 రన్స్ చేయడం విశేషం.

(7 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు