Virat Kohli Form: విరాట్ కోహ్లీ కథ ముగిసిందా? 16 ఏళ్ల కెరీర్‌లో ఫస్ట్ టైమ్ ఇలా.. షాకింగ్ గణాంకాలు వెలుగులోకి
27 October 2024, 13:13 IST
విరాట్ కోహ్లీ 2008లో భారత్ జట్టులోకి అరంగేట్రం చేసి ఆ ఏడాది 5 మ్యాచ్‌లే ఆడాడు. ఈ ఏడాది ఇప్పటికే అన్ని ఫార్మాట్లలో కలిపి 18 మ్యాచ్‌లు ఆడాడు. కానీ.. 2008తో పోలిస్తే 2024లో గణాంకాలు వరస్ట్‌గా ఉన్నాయి.
విరాట్ కోహ్లీ
భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కెరీర్‌లోనే అత్యంత పేలవ ఫామ్‌తో తంటాలు పడుతున్నాడు. న్యూజిలాండ్‌తో ప్రస్తుతం జరుగుతున్న టెస్టు సిరీస్‌లో వరస్ట్‌గా ఆడుతున్న విరాట్ కోహ్లీ.. శనివారం ముగిసిన పుణె టెస్టులో ఒకే బౌలర్‌గా రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ వికెట్ సమర్పించుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో పుల్ టాస్ బంతి వేసి కోహ్లీని బౌల్డ్ చేసిన స్పిన్నర్ మిచెల్ శాంట్నర్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ సింపుల్‌గా ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ బాట పట్టించాడు. తాను ఔటైన తీరుతో సహనం కోల్పోయిన విరాట్ కోహ్లీ.. పెవిలియన్‌కి వెళ్తూ వాటర్ బాక్స్‌ని బ్యాట్‌తో కొట్టిన విషయం తెలిసిందే.
బ్యాటింగ్‌లో కానరాని కోహ్లీ దూకుడు
వాస్తవానికి ఇప్పటికే పలు సందర్భాల్లో విరాట్ కోహ్లీ ఫామ్ కోల్పోయి.. కమ్‌బ్యాక్ ఇచ్చాడు. కానీ తన 16 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఫస్ట్ టైమ్ ఒక ఏడాదిలో అత్యంత తక్కువ పరుగుల్నివిరాట్ కోహ్లీ చేశాడు. ప్రత్యర్థులపై కోహ్లీ చెలాయించిన ఆధిపత్యం చూసిన అభిమానులు.. అతడ్ని కింగ్ కోహ్లీ అంటూ ముద్దుగా పిలిచేవారు. కానీ.. ఇప్పుడు ప్రత్యర్థి జట్టులోని అనామక బౌలర్లకి కూడా కోహ్లీ సింపుల్‌గా వికెట్ సమర్పించుకుంటున్నాడు.
కోవిడ్ -19 తర్వాత విరాట్ కోహ్లీ 2020, 2021, 2022లో అత్యంత చెత్త ప్రదర్శన కనబర్చాడు. సెంచరీ కోసం దాదాపు రెండున్నర సంవత్సరాలు కోహ్లి నిరీక్షించాల్సి వచ్చింది. అయితే.. సెంచరీ రాకపోయినా.. కోహ్లీ పరుగులైతే చేయగలిగాడు. కానీ.. 2024లో సెంచరీ రాకపోగా.. పరుగులు కూడా ఈ బ్యాటర్ చేయలేకపోతున్నాడు.
16 ఏళ్లలో ఇదే చెత్త సగటు
ఈ ఏడాది జరిగిన టీ20 వరల్డ్‌కప్-2024లో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీ.. భారత్ జట్టు టైటిల్ గెలవడంలో క్రియాశీలక పాత్ర పోషించాడు. కానీ.. కోహ్లీ బ్యాటింగ్ సగటు 2024లో.. అతను అరంగేట్ర చేసిన ఏడాది 2008 కంటే అధ్వాన్నంగా ఉంది.
2008లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన విరాట్ కోహ్లీకి కేవలం 5 మ్యాచ్‌లు మాత్రమే ఆ ఏడాది ఆడే అవకాశం లభించింది. అందులో 31.80 సగటుతో 159 పరుగులు చేశాడు. కానీ ఈ ఏడాది అంటే 2024లో ఇప్పటివరకు అన్ని ఫార్మాట్లలో కలిపి 18 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ కేవలం 21.95 సగటుతో 483 పరుగులు చేశాడు.
ఈ ఏడాది ముగియడానికి ఇంకా రెండు నెలల సమయం ఉంది. ఈ క్రమంలో న్యూజిలాండ్‌తో నవంబరు 1 నుంచి ఆఖరి టెస్టు, ఆ తర్వాత నవంబరు 22 నుంచి ఆస్ట్రేలియాతో ఐదు టెస్టులను భారత్ జట్టు ఆడనుంది. ఈ మ్యాచ్‌ల్లో కోహ్లీ రాణిస్తాడేమో చూడాలి. ఇప్పటికే టీ20లకి రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ.. వన్డేలు, టెస్టులు మాత్రమే ఆడుతున్నాడు. ఇప్పటికే కోహ్లీ కథ ముగిసింది.. ఇక రిటైర్మెంట్ ప్రకటిస్తే గౌరవంగా ఉంటుందంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
విరాట్ కోహ్లీ ఈ ఏడాది ఒక్క సెంచరీ కూడా చేయలేదు. గతంలో 2008, 2020, 2021 మాత్రమే కోహ్లీ ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడు.
2008 నుంచి 2024 వరకు విరాట్ కోహ్లీ ఏడాది సగటుని ఒకసారి పరిశీలిస్తే..