తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Akram On Pak Cricketers: రోజు ఎనిమిది కిలోల మ‌ట‌న్ తింటే ఫిట్‌నెస్ ఎలా ఉంటుంది - పాక్ క్రికెట‌ర్ల‌పై వసీం అక్రమ్ ఫైర్‌

Akram on Pak Cricketers: రోజు ఎనిమిది కిలోల మ‌ట‌న్ తింటే ఫిట్‌నెస్ ఎలా ఉంటుంది - పాక్ క్రికెట‌ర్ల‌పై వసీం అక్రమ్ ఫైర్‌

24 October 2023, 12:07 IST

  • Akram on Pak Cricketers: అప్ఘ‌నిస్తాన్ చేతిలో చిత్తుగా ఓడిపోయిన పాకిస్థాన్‌ను ఆ దేశ మాజీ క్రికెట‌ర్ల‌తో పాటు అభిమానులు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. పాకిస్థాన్ క్రికెట‌ర్ల ఫిట్‌నెస్‌పై వసీం అక్రమ్ దారుణంగా కామెంట్స్ చేశాడు. రెండేళ్లుగా ఏ క్రికెట‌ర్ ఫిట్‌నెస్ టెస్టులు చేసుకోలేద‌ని అన్నాడు.

బాబ‌ర్ అజాం
బాబ‌ర్ అజాం

బాబ‌ర్ అజాం

Akram on Pak Cricketers: ప‌సికూన అప్ఘ‌నిస్తాన్ చేతిలో చిత్తుగా ఓడిపోయిన పాకిస్థాన్‌ను అభిమానుల‌తో పాటు ఆ దేశ మాజీ క్రికెట‌ర్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. పాకిస్థాన్ క్రికెట్ చ‌రిత్ర‌లోనే బ్యాడ్ డే ఇద‌ని ప‌లువురు క్రికెట‌ర్లు పేర్కొన్నారు. . బాబ‌ర్ ఆజాంతో పాటు మిగిలిన క్రికెట‌ర్ల‌పై సోష‌ల్ మీడియాలో ట్రోల్స్‌, మీమ్స్ తెగ వైర‌ల్ అవుతోన్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Sehwag on Mumbai Indians: రోహిత్, హార్దిక్ ఇద్దరినీ ముంబై ఇండియన్స్ వదిలించుకుంటుంది: సెహ్వాగ్ కామెంట్స్ వైరల్

Virat Kohli : బ్యాట్​ పట్టిన వామిక.. క్రికెటర్​ అవుతుందా? కోహ్లీ సమాధానం ఇది..

ipl 2024: కోట్లు పెట్టి కొంటే తుస్‌మ‌నిపించారు - ఈ ఐపీఎల్‌లో దారుణంగా ఫ్లాపైన రిచెస్ట్ క్రికెట‌ర్లు వీళ్లే!

CSK vs RCB : ఆర్సీబీ కోసం సీఎస్కే ప్రత్యేక 'అస్త్రం'- ధోనీని..

పాకిస్థాన్ క్రికెట‌ర్ల ఫిట్‌నెస్‌పై మాజీ క్రికెట‌ర్ వసీం అక్రమ్ చేసిన కామెంట్స్ హాట్‌టాపిక్‌గా మారాయి.గ‌త రెండేళ్లుగా పాకిస్థాన్ టీమ్‌లోని ఏ క్రికెట‌ర్ ఫిట్‌నెస్ టెస్టులు చేసుకోలేద‌ని అక్రమ్ పేర్కొన్నాడు. టీమ్‌లోని క్రికెట‌ర్లు అంతా రోజుకు ఎనిమిది కిలోల మ‌ట‌న్ తింటున్న‌ట్లుగా ఉన్నార‌ని, అలా ఉంటే ఫిట్‌నెస్ ఎక్క‌డినుంచి ఉంటుంద‌ని అక్రమ్ అన్నాడు. ఫిట్‌నెస్ టెస్టులు చేస్తే టీమ్‌లోని ఏ ఒక్క క్రికెట‌ర్‌ కూడా పాస్ కాలేడ‌ని అక్రమ్ చెప్పాడు.

280 ప‌రుగుల భారీ టార్గెట్‌ను కూడా కాపాడుకోలేక‌పోవ‌డం సిగ్గుచేటుగా ఉంద‌ని తెలిపాడు. బౌలింగ్‌కు అనుకూలించే పిచ్ అయినా వికెట్ తీయాల‌నే ల‌క్ష్యంతో ఎవ‌రూ బౌలింగ్ చేసిన‌ట్లుగా క‌నిపించ‌లేద‌ని అక్రమ్ తెలిపాడు. అత‌డి కామెంట్స్ తెగ వైర‌ల్ అవుతోన్నాయి క్రికెట్‌ను కెరీర్‌కు ఎంచుకునేలా పిల్ల‌ల్లో స్ఫూర్తిని నింపే క్రికెట‌ర్ ఒక్క‌రూ కూడా ప్ర‌స్తుతం పాకిస్థాన్ జ‌ట్టులో లేడ‌ని మరో మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ కూడా పాకిస్థాన్ క్రికెట‌ర్లపై ఫైర్ అయ్యాడు.

. సోమ‌వారం అప్ఘ‌నిస్తాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ యాభై ఓవ‌ర్ల‌లో ఏడు వికెట్లు న‌ష్ట‌పోయి 282 ప‌రుగులు చేసింది. కెప్టెన్ బాబ‌ర్ అజాం 74 ర‌న్స్‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు.ఈ టార్గెట్‌ను అప్ఘ‌నిస్తాన్ కేవ‌లం రెండు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి ఛేదించింది. అప్ఘ‌నిస్తాన్ బ్యాట్స్‌మెన్స్‌లో ఇబ్ర‌హిం జ‌ర్ధాన్ 87, ర‌హ్మ‌త్ షా 77, ర‌హ్మ‌నుల్లా గుర్భాజ్ 65 ర‌న్స్‌తో రాణించారు.

తదుపరి వ్యాసం