IND Vs WI 4th T20 : నాల్గో టీ20లో యశస్వి జైస్వాల్, శుభ్‌మాన్ గిల్ రికార్డులివే
13 August 2023, 9:35 IST
- IND vs WI 4వ T20 : ఫ్లోరిడాలోని లాడర్‌హిల్‌లోని సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియం టర్ఫ్ గ్రౌండ్‌లో జరిగిన 4వ టీ20 మ్యాచ్‌లో టీమిండియా వెస్టిండీస్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్, శుభ్‌మాన్ గిల్ సూపర్ ఇన్నింగ్స్ ఆడారు.
గిల్, జైస్వాల్
వెస్టిండీస్‌తో జరిగిన నాల్గో T20 మ్యాచ్ చాలా కీలకం. ఇందులో ఓడిపోతే సిరీస్ కోల్పోయే పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో భారత ఆటగాళ్లు.. వెస్టిండీస్ ను చిత్తుగా ఓడించి.. సిరీస్ సమం చేశారు. ఐదో మ్యాచ్ లో గెలిచిన టీమ్.. సిరీస్ ను కైవసం చేసుకోనుంది. నాల్గో 20లో భారత యువ ఓపెనర్లు యశస్వి, శుభ్ మాన్ గిల్ అద్భుత ప్రదర్శన చేశారు.
179 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది టీమిండియా. ఓపెనర్లు జైస్వాల్, గిల్ వెస్టిండీస్ బౌలర్లకు చుక్కలు చూపించారు. పవర్‌ప్లేలో భారత్ 66/0తో దూసుకెళ్లింది. జైస్వాల్, గిల్ భాగస్వామ్యం 10 ఓవర్లలో 100 పరుగులకు చేరుకుంది. 47 బంతుల్లో 77 పరుగుల వద్ద రొమారియో షెపర్డ్ చేతిలో గిల్ వికెట్ కోల్పోయాడు. ఈ భాగస్వామ్యం 165 వద్ద బ్రేక్ అయింది. ఈ యువ ఆటగాళ్లు టీ20లో అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం.. రికార్డును నెలకొల్పారు.
ఓపెనర్లు ఎవరూ సెంచరీ చేయలేదు. భారత్ మరో మూడు ఓవర్లు మిగిలి ఉండగానే తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. నిజానికి లాడర్‌హిల్‌లో ఏ జట్టు అయినా పరుగులను ఛేజ్ చేయడం కాస్త కష్టమనే అంటారు. ముందుగా బ్యాటింగ్ చేసిన జట్లు ఆ వేదికపై అత్యధిక మ్యాచ్‌లను గెలుచుకున్నాయి.
గతంలో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ టీ20లో అత్యధిక రికార్డు భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నారు. గిల్, జైస్వాల్‌ల ఇన్నింగ్స్ 15.3 ఓవర్లలో రికార్డు నెలకొల్పగా, రోహిత్, రాహుల్ 12.4 ఓవర్లలోనే గతంలో చెలరేగిపోయారు. అప్పుడు రోహిత్ 43 బంతుల్లో 118 పరుగులు చేశాడు. ఆ సమయంలో భారతదేశం మొదట బ్యాటింగ్ చేసి 260/5 స్కోరును చేసింది. 88 పరుగుల తేడాతో మ్యాచ్‌ను గెలుచుకుంది.
రాహుల్, రోహిత్ భాగస్వామ్యాలు రెండో స్థానంలో ఉండగా.. భారత్‌కు మొత్తంగా ఆల్ టైమ్ మూడో అత్యధిక భాగస్వామ్యం రికార్డును సృష్టించారు గిల్, జైస్వాల్. గతేడాది ఐర్లాండ్‌పై దీపక్ హుడా, సంజూ శాంసన్ 176 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం అత్యధికం .
వెస్టిండీస్ తో నాలుగో టీ20లో చివరి వరకు నిలిచిన జైస్వాల్ 51 బంతుల్లో 84 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. తన రెండో T20Iలో హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ మైలురాయిని అందుకున్న నాల్గో అతి పిన్న వయస్కుడైన భారతీయ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 2018లో వెస్టిండీస్‌పై 21 ఏళ్ల 38 రోజుల్లో 58 పరుగులు చేసిన రిషబ్ పంత్ మూడో స్థానంలో ఉన్నాడు. ఈ లిస్టులో రెండో ఆటగాడిగా తిలక్ వర్మ పేరిట రికార్డు ఉంది. 2007 T20 ప్రపంచ కప్‌లో దక్షిణాఫ్రికాపై హాఫ్ సెంచరీ చేసిన అతి చిన్న వయస్కుడిగా మెుదటి స్థానంలో ఉన్నాడు రోహిత్.