తెలుగు న్యూస్  /  క్రికెట్  /  World Cup 2023 : వన్డే ప్రపంచకప్‌లో ఈ స్టార్ ఆటగాళ్లు కనిపించడం అనుమానమే!

World Cup 2023 : వన్డే ప్రపంచకప్‌లో ఈ స్టార్ ఆటగాళ్లు కనిపించడం అనుమానమే!

Anand Sai HT Telugu

15 August 2023, 13:55 IST

    • ICC 2023 ODI ప్రపంచకప్‌కు మరికొన్ని రోజుల సమయమే ఉంది. అన్ని దేశాలు అత్యుత్తమ జట్టును ఆడించేందుకు సెలక్షన్ చేయడంలో బిజీగా ఉన్నాయి. చాలా మంది ఆటగాళ్లు గాయం సమస్యతో బాధపడుతున్నారు. కొందరు స్టార్ ప్లేయర్లు ఆడతారా లేదా అనేది అనుమానంగా ఉంది.
వరల్డ్ కప్ 2023
వరల్డ్ కప్ 2023

వరల్డ్ కప్ 2023

వరల్డ్ కప్ 2023లో కొంతమంది స్టార్ ఆటగాళ్లు ఆడతారో.. లేదో క్లారిటీ లేదు. ఈ జాబితాలో టీమిండియా స్టార్ ప్లేయర్ కూడా ఉన్నారు. ఐసీసీ టోర్నీల్లో టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ అద్భుత ప్రదర్శన చేశాడు. ఐసీసీ నిర్వహించిన టోర్నీల్లో నిలకడగా రాణిస్తూ జట్టుకు సహకరించాడు. వన్డే ప్రపంచకప్ జట్టులో అతనికి చోటు దక్కుతుందా లేదా అనే విషయంపై ఎలాంటి అప్‌డేట్ అందుబాటులో లేదు. అతడితో పాటు న్యూజిలాండ్‌కు చెందిన కేన్ విలియమ్సన్, ఇంగ్లండ్ ఆటగాడు బెన్ స్టోక్స్ కూడా ప్రపంచకప్‌లో ఆడటం అనుమానంగానే ఉంది.

ట్రెండింగ్ వార్తలు

RCB vs DC: వరుసగా ఐదో మ్యాచ్ గెలిచిన బెంగళూరు.. నిలిచిన ప్లేఆఫ్స్ ఆశలు.. అక్షర్ పోరాడినా ఢిల్లీకి భారీ ఓటమి దెబ్బ

MS Dhoni: ఊపిరి పీల్చుకున్న ధోనీ ఫ్యాన్స్.. కానీ!

CSK vs RR: చెపాక్‍లో చెన్నై తఢాకా.. రాజస్థాన్‍పై సునాయాస గెలుపు.. ప్లేఆఫ్స్ అవకాశాలు మెరుగు

MS Dhoni : సీఎస్కే వర్సెస్​ ఆర్​ఆర్​.. చెపాక్​లో ధోనీకి ఇదే చివరి మ్యాచ్​!

ప్రపంచ కప్ 2023కి కేవలం రెండు నెలల కంటే తక్కువ సమయం ఉన్నందున, ఆటగాళ్ల ఫిట్‌నెస్ పై ఊహాగానాలు విస్తృతంగా ఉన్నాయి. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ వన్డే ప్రపంచకప్‌లో పాల్గొనడం అనుమానంగా ఉంది. ఫిట్‌నెస్, ఫామ్ లేదా వ్యక్తిగత కారణాల వల్ల చాలా మంది స్టార్లు టోర్నమెంట్ నుండి వైదొలగినట్లు సమాచారం.

2019లో ఇంగ్లండ్‌ ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించడంలో కీలక పాత్ర పోషించిన ఆల్‌రౌండర్‌, ఇంగ్లండ్‌ టెస్ట్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ వన్డే క్రికెట్‌ నుంచి రిటైరయ్యాడు. అయితే, అతను ప్రపంచకప్‌కు రిటైర్మెంట్‌ను ఉపసంహరించుకోవచ్చని సమాచారం. 2022లో ఇంగ్లండ్ టీ20 ప్రపంచకప్ గెలవడంలో స్టోక్స్ కీలక పాత్ర పోషించాడు. జట్టును మళ్లీ చాంపియన్‌గా నిలబెట్టేందుకు వన్డేల్లో పునరాగమనం చేస్తాడా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈ స్టార్ ఆటగాడు తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ఉపసంహరించుకుని ఇంగ్లండ్‌లో చేరితే ఆ జట్టుకు బలం చేకూరుతుంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో జట్టుకు బూస్ట్ ఇవ్వగలడు. స్టోక్స్ వరల్డ్ కప్ కోసం యూటర్న్ తీసుకుంటే. ఇంగ్లండ్ బ్యాటింగ్, బౌలింగ్ మరింత బలపడనుంది.

చాలా కాలంగా భారత జట్టుకు దూరమైన శిఖర్ ధావన్ 2023 వన్డే ప్రపంచకప్‌లో ఆడడం అనుమానమే. ధావన్ గత 8 నెలల నుంచి భారత్ తరఫున వన్డే మ్యాచ్‌లు ఆడలేదు. ICC టోర్నమెంట్‌లలో శిఖర్ 20 మ్యాచ్‌లలో 65 సగటుతో పరుగులు సాధించాడు. 6 సెంచరీలు చేశాడు. 2023 ప్రపంచకప్ జట్టులో ధావన్‌కు చోటు దక్కుతుందో లేదో చూడాలి. ఇప్పటికే కొత్త ఆటగాళ్లతో ప్రయోగం చేస్తున్న టీమిండియా.. ధావన్ కు అవకాశం ఇస్తుందో లేదో తెలియదు.

మరోవైపు న్యూజిలాండ్‌ వెటరన్‌ బ్యాట్స్‌మెన్‌ కేన్‌ విలియమ్సన్‌ గాయం కారణంగా చాలా కాలంగా జట్టుకు దూరమయ్యాడు. ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో కేన్ విలియమ్సన్ మైదానంలోకి రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో విలియమ్సన్ ప్రపంచకప్ జట్టులో భాగమవుతాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

తదుపరి వ్యాసం