Ganguly On Akhtar : కోహ్లీ ఏదైనా ఆడగలడు.. అక్తర్‌కు గంగూలీ స్ట్రాంగ్ కౌంటర్
20 August 2023, 9:07 IST
- Sourav Ganguly on Shoaib Akhtar : భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీపై పాకిస్థాన్ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్ కొన్ని కామెంట్స్ చేశాడు. ఈ వ్యాఖ్యలపై భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్పందించాడు.
సౌరభ్ గంగూలీ,
భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ మధ్య వివాదం ఉన్న విషయం తెలిసిందే. గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు భారత జట్టుకు విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉండేవాడు. అభిప్రాయ భేదాల కారణంగా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. టీ20, వన్డే, టెస్టు కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ వైదొలగడానికి కారణం అదే అని కూడా అంటారు.
ఐపీఎల్ సిరీస్ సందర్భంగా గంగూలీపై విరాట్ కోహ్లీ తన కోపాన్ని ప్రదర్శించాడు. విరాట్ కోహ్లీ గంగూలీని ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేశాడు. ఇలాంటి గోడవల నేపథ్యంలో విరాట్ కోహ్లీ గురించి పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్యలకు సౌరవ్ గంగూలీ సమాధానం ఇచ్చాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ అరంగేట్రం చేసి 15 ఏళ్లు గడుస్తున్న తరుణంలో విరాట్ కోహ్లీ(Virat Kohli)కి పాకిస్థాన్ ఆటగాడు అక్తర్ కొన్ని సలహాలు ఇచ్చాడు. అందులోనూ విరాట్ కోహ్లీ ప్రపంచకప్ సిరీస్ తర్వాత వన్డేలు, టీ20లు ఆడకుండా ఉండాలి. విరాట్ కోహ్లీ పూర్తి టెస్టు మ్యాచ్‌ల్లో పాల్గొనాలని షోయబ్ అన్నాడు. సచిన్ టెండూల్కర్ 100 సెంచరీల రికార్డును బ్రేక్ చేసే అవకాశం విరాట్ కోహ్లీకి దక్కిందని చెప్పాడు. అందుకే వన్డేలు, టీ20లకు బదులు టెస్టులు మాత్రమే ఆడటం విరాట్ కోహ్లీకి ఉత్తమమని పేర్కొన్నాడు.
'కోహ్లీ తనపై భారాన్ని తగ్గించుకునేందుకు వైట్ బాల్ క్రికెట్ నుంచి రిటైర్ అవ్వాలి. వరల్డ్ కప్ తర్వాత కోహ్లీ వన్డే క్రికెట్ ఆడకపోవడం ఉత్తమం. టీ20 క్రికెట్ తో కూడా అతడి శక్తి చాలా ఖర్చు అవుతోంది. కోహ్లీ కనీసం మరో 6 సంవత్సరాలు క్రికెట్ ఆడితేనే.. సచిన్ పేరిట ఉన్న రికార్డులు బద్దలు కొట్టగలడు. సచిన్ రికార్డ్ బ్రేక్ చేసే సత్తా కోహ్లీలో ఉంది. ఇలా జరగాలంటే.. వరల్డ్ కప్ తర్వాత టెస్ట్ క్రికెట్ ఆడటంపైనే కోహ్లీ ఫోకస్ చేయాలి.' అని అక్తర్ చెప్పుకొచ్చాడు.
ఈ వాఖ్యలపై గంగూలీ కౌంటర్ ఇచ్చాడు. 'విరాట్ కోహ్లీ ఎలాంటి క్రికెట్ ఆడినా రాణించగలడు. విరాట్ కోహ్లి ఎలాంటి క్రికెట్ ఆడాలనుకుంటున్నాడో అదే ఆడాలి.' అని బదులిచ్చాడు. తమ మధ్య ఎన్ని గొడవలు ఉన్నా.. కోహ్లీని వదులుకోలేమని చెప్పుకొచ్చాడు. గంగూలీ చేసిన ఈ వ్యాఖ్యకు అభిమానుల నుంచి ఆదరణ లభిస్తోంది.
టాపిక్