తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Csk Ipl 2025 Players List: ఐపీఎల్ 2025 వేలం తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ పూర్తి జట్టు ఇదే.. సమతూకంగా సీఎస్కే టీమ్

CSK IPL 2025 Players list: ఐపీఎల్ 2025 వేలం తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ పూర్తి జట్టు ఇదే.. సమతూకంగా సీఎస్కే టీమ్

Galeti Rajendra HT Telugu

26 November 2024, 6:00 IST

google News
  • IPL 2025 Chennai Super Kings: చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ ఐపీఎల్ 2025 కోసం ఎక్కువగా బౌలర్లపై ఫోకస్ పెట్టింది. విదేశీ ప్లేయర్ల కంటే భారత్ ఆటగాళ్ల కోసమే కోట్లని వేలంలో కుమ్మరించింది. 

ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇదే
ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇదే (AFP)

ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇదే

IPL 2025 Auction CSK Team: ఐపీఎల్ 2025 మెగా వేలం సోమవారం రాత్రి ముగిసింది. రూ.55 కోట్లతో వేలానికి వెళ్లిన చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ.. రూ.5 లక్షలు మినహా.. మిగిలిన డబ్బుని ఆటగాళ్ల కొనుగోళ్ల కోసం వెచ్చించేసింది. టీమ్‌లో గరిష్టంగా 25 మంది ప్లేయర్లు ఉండే వెసులుబాటు ఉండగా.. చెన్నై సూపర్ కింగ్స్ అన్ని స్లాట్స్‌ను భర్తీ చేయడం గమనార్హం. ఇందులో 18 మంది భారత్ ఆటగాళ్లు, 7 మంది విదేశీ ప్లేయర్లు ఉన్నారు.

ఐపీఎల్ 2025 వేలానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ రిటేన్ చేసుకున్న ఆటగాళ్లని ఒకసారి పరిశీలిస్తే.. వేలానికి ముందే రూ.65 కోట్లని రిటెన్షన్ కోసం వెచ్చించింది.

  • రవీంద్ర జడేజా (రూ.18 కోట్లు )
  • రుతురాజ్ గైక్వాడ్ (రూ.18 కోట్లు)
  • శివమ్ దూబే (రూ.12 కోట్లు)
  • మతీశ్ పతిరన (రూ.13 కోట్లు)
  • మహేంద్ర సింగ్ ధోని (రూ.4 కోట్లు)

 

ఐపీఎల్ 2025 వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసిన ప్లేయర్ల జాబితా ఇదే

 

  • రాహుల్ త్రిపాఠి (రూ.3.40 కోట్లు),
  • దేవాన్ కాన్వె (రూ.6.25 కోట్లు)
  • విజయ్ శంకర్ (రూ.1.20 కోట్లు)
  • దీపక్ హుడా (రూ.1.70 కోట్లు)
  • అన్షుల్ కాంబోజ్ (రూ.3.40 కోట్లు)
  • రచిన్ రవీంద్ర (రూ.4 కోట్లు)
  • జామీ ఓవర్టన్ (రూ.1.50 కోట్లు)
  • షేక్ రషీద్ (రూ .30 లక్షలు )
  • ఆండ్రే సిద్ధార్థ్ (రూ.30 లక్షలు)
  • వాన్షా బేడి (రూ.55 లక్షలు)
  • కమలేశ్ నాగర్‌కోటి (రూ.30 లక్షలు)
  • రామకృష్ణా ఘోస్ (రూ.30 లక్షలు)
  • రవిచంద్రన్ అశ్విన్ (రూ.9.75 కోట్లు)
  • శామ్ కరన్ (రూ.2.40 కోట్లు)
  • శ్రేయాస్ గోపాల్ (రూ.30 లక్షలు)
  • ముకేష్ చౌదరి (రూ.30 లక్షలు)
  • నాథన్ ఎలిస్ (రూ.2 కోట్లు)
  • గుర్జనీత సింగ్ (రూ.2.20 కోట్లు)
  • నూర్ అహ్మద్ (రూ.10 కోట్లు)
  • ఖలీల్ అహ్మద్ (రూ.4.80 కోట్లు)

 

ఐపీఎల్ 2024 సీజన్‌లో కనీసం ప్లేఆఫ్స్‌కి కూడా అర్హత సాధించలేకపోయిన చెన్నై సూపర్ కింగ్స్.. లీగ్ దశలో ఆడిన 14 మ్యాచ్‌ల్లో గెలిచింది.. కేవలం ఏడింట్లో మాత్రమే. దాంతో ఈసారి జట్టుని సమతూకంగా ఉంచడానికి చెన్నై ఫ్రాంఛైజీ ప్రయత్నించింది. 

తదుపరి వ్యాసం