తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Team India Head Coach: బీసీసీఐ కీలక నిర్ణయం.. టీమిండియా హెడ్ కోచ్‍గా వాళ్లిద్దరు!

Team India Head Coach: బీసీసీఐ కీలక నిర్ణయం.. టీమిండియా హెడ్ కోచ్‍గా వాళ్లిద్దరు!

Sanjiv Kumar HT Telugu

27 August 2023, 12:51 IST

google News
  • Asian Games 2023: యూత్ సినిమాలు ఎంతగా చూస్తుందో.. క్రికెట్‍ను కూడా అంతగానే ఆదరిస్తుంది. ప్రస్తుతం యువత కళ్లు అన్ని త్వరలో ప్రారంభం కాబోయే ఆసియా కప్ 2023 మీదే ఉన్నాయి. ఇదే కాకుండా ఆసియన్ గేమ్స్ సైతం ప్రాచుర్యం సంతరించుకుంది. ఈ తరుణంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. 

Asian Games 2023 Team India Head Coach
Asian Games 2023 Team India Head Coach

Asian Games 2023 Team India Head Coach

Team India Head Coach For Asian Games 2023: ప్రస్తుతం యావత్ తెలుగు యువతను ఉర్రూతలూగించేందుకు సిద్ధమవుతోంది ఆసియా కప్ 2020 టోర్నమెంట్. శ్రీలంక, పాక్ వేదికగా జరగనున్న ఈ సమరానికి ఇప్పటికే టీమీండియా ఆటగాళ్లు సంసిద్ధం అవుతున్నారు. ఇక దీని తర్వాత జరిగే ఆసియా క్రీడలు యువతలో మరింత జోష్ పెంచనున్నాయి. చైనా వేదికగా జరగనున్న ఆసియా క్రీడలు 2023లో భారత పురుష, మహిళ క్రికెట్ జట్లు తొలిసారి పోటీలో పాల్గొననున్నాయి.

ఇప్పటికే ఆసియా క్రీడల కోసం ఇండియన్ టీమ్స్ ను బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ గేమ్స్ సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8 వరకు చైనాలోని హాంగ్జౌలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా పురుషలు, మహిళల జట్టుకు హెడ్ కోచ్‍లను బీసీసీఐ సెలెక్ట్ చేసింది. టీమిండియా పురుషుల జట్టుకు ఇప్పటికే హెడ్ కోచ్‍గా ఉన్న రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) స్థానంలో భారత మాజీ క్రికెటర్, నేషనల్ క్రికెట్ అకడామీ ఛీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ (VVS Laxman) బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.

వీవీఎస్ లక్ష్మణ్ ప్రస్తుతం ఆసియా కప్-2023 కోసం ఆలూరులో ఏర్పాటు చేసిన స్పెషల్ ట్రైనింగ్ క్యాంప్‍లో ఇండియన్ ప్లేయర్స్ తో ఉన్నాడు. ఇక ఆసియన్ గేమ్స్ మహిళల జట్టుకు హెడ్ కోచ్‍గా మాజీ ఆటగాడు హృషికేష్ కనిట్కర్ (Hrishikesh Kanitkar) బాధ్యతలు చేపట్టనున్నాడు. అయితే గత డిసెంబర్ నుంచి భారత మహిళల జట్టు రెగ్యులర్ హెడ్ కోచ్ లేకుండానే ఆడుతోంది. ఈ ఇద్దరే కాకుండా లక్ష్మణ్‍తోపాటు ఆసియాడ్ కోసం ఇండియాన్ మెన్ టీమ్‍కు సహాయక సిబ్బందిలో భాగంగా బౌలింగ్ కోచ్‍గా భారత మాజీ లెగ్ స్పిన్నర్ సాయిరాజ్ బహుతులే, ఫీల్డింగ్ కోచ్‍గా మునీష్ బాలీ ఉన్నారు.

తదుపరి వ్యాసం