తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Asia Cup 2023: గెలిచిన భారత్.. నేపాల్‍కు బంపర్ ఆఫర్.. ఇదెక్కడి బీర్ కంపెనీ బ్రో

Asia Cup 2023: గెలిచిన భారత్.. నేపాల్‍కు బంపర్ ఆఫర్.. ఇదెక్కడి బీర్ కంపెనీ బ్రో

Sanjiv Kumar HT Telugu

05 September 2023, 15:25 IST

google News
  • India vs Nepal: మొత్తానికి ఆసియా కప్ 2023లో సూపర్ 4కి భారత్ చేరుకుంది. సోమవారం రోజున పల్లెకెలె వేదికగా జరిగిన ఇండియా వర్సెస్ నేపాల్ మ్యాచ్‍లో 10 వికెట్ల తేడాతో భారత్ గెలిచింది. అయితే ఓడిన నేపాల్ టీమ్‍కు ఓ బీర్ కంపెనీ బంపర్ ఆఫర్ ప్రకటించింది.

నేపాల్‍కు బంపర్ ఆఫర్.. ఇదెక్కడి బీర్ కంపెనీ బ్రో
నేపాల్‍కు బంపర్ ఆఫర్.. ఇదెక్కడి బీర్ కంపెనీ బ్రో

నేపాల్‍కు బంపర్ ఆఫర్.. ఇదెక్కడి బీర్ కంపెనీ బ్రో

ఆసియా కప్ 2023 టోర్నమెంట్‍లో భాగంగా సెప్టెంబర్ 4న పల్లెకెలెలో ఇండియా-నేపాల్ వన్డే క్రికెట్ మ్యాచ్ ఆసక్తిగా సాగింది. తొలుత టాస్ గెలిచిన ఇండియా బౌలింగ్ ఎంచుకుంది. పసి కూనలు అయిన నేపాల్‍ను 48.2 ఓవర్లలో 230 పరుగుల వద్ద ఆలౌట్ చేసింది ఇండియా. తర్వాత రంగంలోకి దిగిన టీమిండియా 2.1 ఓవర్లు ఆడగానే వరుణుడు నేనున్నానంటూ వచ్చేశాడు. దీంతో ఆటను నిలిపివేశారు. అనంతరం డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో 23 ఓవర్లలో 145 రన్స్ కు కుదిస్తూ టార్గెట్ పెట్టారు.

145 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ఓపెనర్స్ రోహిత్ శర్మ, శుభ్‍మన్ గిల్ మరో మూడు ఓవర్లు ఉండగానే ఛేదించారు. ఫోర్లు, సిక్సర్లతో 20.1 ఓవర్లలో 147 పరుగులు చేసిన భారత్ విజేతగా నిలిచింది. దీంతో రెండు మరో రెండు పాయింట్స్ (పాక్ మ్యాచ్ రద్ధు కారణంగా 1 పాయింట్) సాధించి గ్రూప్ 4లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఇందులో ఓడిపోయిన నేపాల్ జట్టుకు బంపర్ ఆఫర్ తగిలింది. నేపాల్ ప్లేయర్స్ ను ఎంకరేజ్ చేయాలన్న ఉద్దేశంతో ఆ దేశానికి చెందిన అర్ణ బీర్ కంపెనీ మ్యాచ్‍కు ముందే సూపర్ ఆఫర్ ఇచ్చింది.

భారత్‍తో తలపడే మ్యాచ్‍లో నేపాల్ బౌలర్లు తీసే ప్రతి వికెట్‍కు రూ. లక్ష, బ్యాటర్ కొట్టే ఒక్కో సిక్సర్‍కు రూ. లక్ష బహుమతి, ఫోర్ కొట్టినవారికి రూ. 25 వేలు ఇస్తామని ప్రకటించింది అర్ణ బీర్ కంపెనీ. అలా ఎంతమంది ఎన్ని వికెట్లు, ఎన్ని సిక్సర్స్, ఎన్ని ఫోర్లు కొడితే అంత సంపాదించుకోవచ్చని తెలిపింది. ఇలా నేపాల్ ప్లేయర్స్ లక్షల్లో సంపాదించుకున్నారు. డబ్బును నేపాల్ కరెన్సీలో చెల్లించగా.. వారిలో ఎవరెవరు ఎంత గెలుచుకున్నారని చూస్తే..

కుశాల్ భుర్టెల్ (3 ఫోర్లు, 2 సిక్సులు)- రూ. 2 లక్షల 75 వేలు

ఆసిఫ్ షేక్ (8 ఫోర్లు)- రూ. 2 లక్షలు

సోంపాల్ కమీ (1 ఫోర్, 2 సిక్సులు)- రూ. 2 లక్షల 25 వేలు

గుల్సన్ ఝా (3 ఫోర్లు)- రూ. 75 వేలు

దీపేంద్ర సింగ్ ఐరీ (3 ఫోర్లు)- రూ. 75 వేలు

తదుపరి వ్యాసం