తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ipl Commentary: జీరో నాలెడ్జ్‌తో ఐపీఎల్ కామెంటేటర్ అయిన హీరో.. స్ఫూర్తినిచ్చేలా కారణం!

IPL Commentary: జీరో నాలెడ్జ్‌తో ఐపీఎల్ కామెంటేటర్ అయిన హీరో.. స్ఫూర్తినిచ్చేలా కారణం!

Sanjiv Kumar HT Telugu

21 April 2024, 12:12 IST

  • Actor Nandu About IPL Commentator: ఎంతో నాలెడ్జ్ ఉంటేనో ఐపీఎల్‌కు కామెంటేటర్‌గా సెలెక్ట్ అవుతారు. అలాంటిది ఏమాత్రం నాలెడ్జ్ లేకుండా తాను ఐపీఎల్ కామెంటేటర్‌గా ఎంపిక అయ్యానని తెలిపాడు తెలుగు హీరో నందు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

జీరో నాలెడ్జ్‌తో ఐపీఎల్ కామెంటేటర్ అయిన హీరో.. స్ఫూర్తినిచ్చేలా కారణం!
జీరో నాలెడ్జ్‌తో ఐపీఎల్ కామెంటేటర్ అయిన హీరో.. స్ఫూర్తినిచ్చేలా కారణం!

జీరో నాలెడ్జ్‌తో ఐపీఎల్ కామెంటేటర్ అయిన హీరో.. స్ఫూర్తినిచ్చేలా కారణం!

Hero Nandu About IPL Commentary: ప్రస్తుతం ఐపీఎల్ హవా కొనసాగుతోంది. పాయింట్స్ టేబుళ్లలో రాజస్థాన్ రాయల్స్ ముందంజలో ఉంటే తర్వాతి రెండో స్థానంలోకి ఏప్రిల్ 20 నాటి మ్యాచ్‌ విజయంతో సన్ రైజర్స్ హైదరాబాద్ ఎగబాకింది. ఇక ఐపీఎల్‌లో ఆటగాళ్ల ప్రదర్శన గురించి ఆడియెన్స్‌కు వివరించేది కామేంటేటర్స్.

ట్రెండింగ్ వార్తలు

Sehwag on Mumbai Indians: రోహిత్, హార్దిక్ ఇద్దరినీ ముంబై ఇండియన్స్ వదిలించుకుంటుంది: సెహ్వాగ్ కామెంట్స్ వైరల్

Virat Kohli : బ్యాట్​ పట్టిన వామిక.. క్రికెటర్​ అవుతుందా? కోహ్లీ సమాధానం ఇది..

ipl 2024: కోట్లు పెట్టి కొంటే తుస్‌మ‌నిపించారు - ఈ ఐపీఎల్‌లో దారుణంగా ఫ్లాపైన రిచెస్ట్ క్రికెట‌ర్లు వీళ్లే!

CSK vs RCB : ఆర్సీబీ కోసం సీఎస్కే ప్రత్యేక 'అస్త్రం'- ధోనీని..

పూర్తి నాలెడ్జ్ ఉంటేనే

ఐపీఎల్ కామెంటేటర్స్‌కు క్రికెట్‌పై ఎంతో నాలెడ్జ్, అవగాహన, గతంలోని మ్యాచ్ తాలుకు వివరాలు, తదితర విషయాలపై పూర్తి పట్టు ఉంటుంది. అలా ఉంటేనే ఐపీఎల్ కామెంటేటర్‌గా కానీ, క్రికెట్ కామెంటేటర్‌గా కానీ రాణించగలుగుతారు. అంతేకాకుండా క్రికెట్‌పై పూర్తి నాలెడ్జ్ ఉన్నవాళ్లనే కామెంటేటర్స్‌గా సెలెక్ట్ చేస్తారు.

జీరో నాలెడ్జ్‌తో

కానీ, ఓ తెలుగు హీరో మాత్రం ఎలాంటి అవగాహన లేకుండా అంటే, జీరో నాలెడ్జ్‌తో ఐపీఎల్ కామెంటేటర్ అయ్యాడు. ఈ విషయాన్ని అతనే చెప్పడం విశేషం. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు 100% లవ్ మూవీతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు నందు.

హీరోగా అనేక సినిమాలు

100% లవ్, పెళ్లి చూపులు తదితర సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేసిన నందు అనంతరం హీరోగా మారి మంచి పేరు తెచ్చుకున్నాడు. పెసరట్టు, 365 డేస్, సవారి, బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమాలతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే, సినిమాలు చేస్తున్న సమయంలోనే క్రికెట్ కామెంటేటర్‌గా పని చేశాడు నందు.

ఆశ్చర్యపోయే సమాధానం

గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఐపీఎల్ కామెంటేటరిపై నందు ఆసక్తికర విషయాలు చెప్పాడు. "క్రికెట్ చూడటం వేరు. దానిమీద కామెంట్రీ చెప్పడం వేరు. కామెంటరీ అంటే మీకు కచ్చితంగా ప్రతి విషయం తెలిసి ఉండాలి. ఆ నాలెడ్జ్ మీరు ఎలా సంపాదించుకున్నారు?" అని జర్నలిస్ట్ అడిగారు. దానికి యాంకర్ ఆశ్చర్యపోయే సమాధానం ఇచ్చాడు నందు.

డబ్బు వెనుక పడకూడదు

"మీకో నిజం చెప్పనా.. నాకు అసలు జీరో నాలెడ్జ్ ఫస్ట్. సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అంటారు కదా. వచ్చిన అవకాశాన్ని వాడుకోవాలి ఇక్కడ. నేను మంచి సినిమాలు చేయాలంటే, డబ్బు వెనుక పడకూడదు అంటే ఒక చోటు నుంచి ఇన్‌కమ్ సోర్స్ కరెక్ట్‌గా ఉండాలి. క్రికెట్ అనేది చాలా పెద్ద విషయం. స్టార్ స్పోర్ట్స్ అనేది అతి పెద్ద ప్లాట్ ఫామ్" అని నందు తెలిపాడు.

నేను రాంగ్ పర్సన్‌ని

"డబ్బుల పరంగా, ఫేమ్ పరంగా ఉపయోగపడుతుందని చేశా. ముందు ఆడిషన్ ఇవ్వమని అడిగితే.. నేను సిన్సియర్‌గా నాకు ఏం తెలియదండి. మీరు రాంగ్ పర్సన్‌ను ఆడిషన్ చేస్తున్నారు అని చెప్పాను. మీకు వచ్చింది ఏదో చెప్పండని వాళ్లు అన్నారు. నేను చాలా లైన్‌డ్‌గా చెప్పాను" అని హీరో నందు అన్నాడు.

మూడు రోజుల తర్వాత

"అప్పుడు నేను సమ్మోహనం అనే సినిమా షూటింగ్‌లో ఉన్నా. ఇంద్రగంటి మోహనకృష్ణ గారిది. ప్యాకప్ అయి వచ్చి కూర్చుని అదే మేకప్‌లో జస్ట్ రఫ్‌గా ఫోన్‌లో అలా ఆడిషన్ చేసి పంపించా. మూడు రోజుల తర్వాత బాంబేకు వస్తారా అని అడిగారు. స్టార్ స్పోర్ట్స్ ఆఫీస్‌కు వెళ్లా. మేము మీతో అగ్రిమెంట్ చేసుకోవాలనుకుంటున్నాం అన్నారు" అని నందు చెప్పుకొచ్చాడు.

అదే మాకు నచ్చింది

"నాకు అసలు రాదు కదా సార్. నన్నెందుకు తీసుకుంటున్నారు. ఏదో మీరు పెద్దవాళ్లు అడిగారు కదా అని. ప్రయత్నం లోపం ఉండకూడదని, చేయకుండా ఉండొద్దను చేశాను అని అంటే.. మాకు అదే నచ్చింది. మీ యాటిట్యూడ్ నచ్చింది. మేము మిమ్మల్ని మార్చుకుంటాం. మీకు నేర్పిస్తాం. నేర్చుకోవాడని సిద్ధంగా ఉన్నావని నాకు ఫీలింగ్ వచ్చిందని అని చెప్పి నాతో సైన్ చేయించి నేర్పించారు. ఆ పీరియడ్‌లో నేను మొత్తం నేర్చుకున్నాను" అని నందు తెలిపాడు.

స్ఫూర్తినిచ్చేలా

ప్రస్తుతం ఐపీఎల్ 2024 జరుగుతున్న నేపథ్యంలో గతంలో నందు చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఏదైనా పనిలో ప్రయత్నం లోపం ఉండకూడదని, ఎప్పుడైనా నేర్చుకోడానికి సిద్ధపడితే మంచి స్థానంలో ఉంటామని నందు సెలెక్ట్ అయిన విధానం స్ఫూర్తినిచ్చేలా ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

తదుపరి వ్యాసం