తెలుగు న్యూస్  /  career  /  Karnataka Bank Po Recruitment : నిరుద్యోగులకు గుడ్​ న్యూస్​! కర్ణాటక బ్యాంక్​లో పీఓ రిక్రూమెంట్​ షురూ..

Karnataka Bank PO recruitment : నిరుద్యోగులకు గుడ్​ న్యూస్​! కర్ణాటక బ్యాంక్​లో పీఓ రిక్రూమెంట్​ షురూ..

Sharath Chitturi HT Telugu

02 December 2024, 15:35 IST

google News
    • Karnataka bank PO apply online : కర్ణాటక బ్యాంకులో పీఓ పోస్టులకు అప్లికేషన్​ ప్రక్రియ ప్రారంభమైంది. విద్యార్హత, వయస్సు పరిమితి, ఫీజు వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
కర్ణాటక బ్యాంక్​లో ఉద్యోగాలు..
కర్ణాటక బ్యాంక్​లో ఉద్యోగాలు..

కర్ణాటక బ్యాంక్​లో ఉద్యోగాలు..

నిరుద్యోగులకు, బ్యాంకు ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి అలర్ట్​! కర్ణాటక బ్యాంక్​ లిమిటెడ్​ (కేబీఎల్​) ప్రొబేషనరీ ఆఫీసర్​ స్కేల్​ 1 రిక్రూట్​మెంట్​ 2024 ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తిగల వారు కేబీఎల్​ అధికారిక వెబ్​సైట్​ (karnatakabank.com) లో అప్లికేషన్​ని దాఖలు చేయవచ్చు. ఈ నేపథ్యంలో ఈ బ్యాంకు ఉద్యోగులకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

కర్ణాటక బ్యాంక్​లో ఉద్యోగాలు..

పోస్టు వివరాలు:- ప్రొబేషనరీ ఆఫీసర్​ (పీఓ) స్కేల్​ 1

విద్యార్హత:- ఏ సబ్జెక్ట్​లో అయినా మాస్టర్​ డిగ్రీ లేదా అగ్రికల్చర్​ సైన్స్​లో బ్యాచిలర్​ డిగ్రీ లేదా 5ఏళ్ల లా కోర్సులో బ్యాచిలర్​ డిగ్రీ లేదా సీఏ/సీఎస్​/ సీఎంఏ/ ఐసీడబ్ల్యూఏ క్వాలిఫికేషన్​

వయస్సు:- కనీస వయస్సు లిమిట్​ లేదు; గరిష్ట వయస్సు పరిమితి 28ఏళ్లు. కర్ణాటక బ్యాంక్​  రిక్రూట్​మెంట్​ రూల్స్​ ప్రకారం వయస్సు పరిమితిలో అర్హులకు సడలింపు ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు:- 

  • అప్లికేషన్​ ప్రక్రియ ప్రారంభ తేదీ- నవంబర్​ 30, 2024
  • అప్లికేషన్​కు చివరి తేదీ- డిసెంబర్​ 10, 2024
  • ఫీజు చెల్లింపునకు చివరి తేదీ- డిసెంబర్​ 10, 2024
  • కేబీఎల్​ సీఎస్​ఏ పరీక్ష తేదీ- డిసెంబర్​ 22, 2024
  • అడ్మిట్​ కార్డుల జారీ- తెలియాల్సి ఉంది.

అప్లికేషన్​ ఫీజు:- 

  • జనరల్​/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్​- రూ. 800
  • ఎస్​సీ/ఎస్​టీ- రూ. 700

డెబిట్​ కార్డు, క్రెడిట్​ కార్డు, నెట్​ బ్యాంకింగ్​, ఐఎంపీఎస్​ మార్గాల్లో ఫీజు కట్టవచ్చు.

కర్ణాటక బ్యాంక్​ ప్రొబేషనరీ ఆఫీసర్​ స్కేల్​ 1 రిక్రూట్​మెంట్​ 2024 కోసం ఇలా అప్లై చేసుకోండి..

స్టెప్​ 1:- సంస్థకు చెందిన అధికారిక వెబ్​సైట్​లో కనిపించే లింక్​పై క్లిక్​ చేయండి.

స్టెప్​ 2:- ఎలిజిపిలిటీ, ఐడీ ప్రూఫ్​, అడ్రెస్​ వివరాలు ఇతర బెసిక్​ డీటైల్స్​కి సంబంధించిన డాక్యుమెంట్స్​ని సమర్పించండి.

స్టెప్​ 3:- ఫొటో, సైన్​ చేసిన ఫొటో, ఐడీ ప్రూఫ్​ వంటివి సమర్పించండి.

స్టెప్​ 4:- సబ్మీట్​ చేసే ముందు ప్రివ్యూ చూసుకోండి. తప్పులను సరిచేసుకోండి. సబ్మీట్​ చేయండి.

స్టెప్​ 5:- తదుపరి అవసరాల కోసం ప్రింటౌట్​ తీసుకోండి.

మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్​సైట్​లోని అధికారిక నోటిఫికేషన్​ని చూడాల్సి ఉంటుంది.

ఎన్టీపీసీలో 50 అసిస్టెంట్ ఆఫీసర్ పోస్టులు..

నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) సంస్థలో అసిస్టెంట్ ఆఫీసర్‌(సేఫ్టీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 50 ఖాళీలను భర్తీ చేయనున్నారు. సంబంధిత ఇంజినీరింగ్‌ డిగ్రీ కలిగి అభ్యర్థులు డిసెంబరు 10వ తేదీ లోగా ఆన్‌లైన్‌(https://careers.ntpc.co.in) లో దరఖాస్తు చేసుకోవచ్చు. స్క్రీనింగ్‌ టెస్ట్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.30,000 - రూ.1,20,000 వరకు వేతనం చెల్లిస్తారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

తదుపరి వ్యాసం