తెలుగు న్యూస్  /  career  /  Braou B.ed Admissions : బీఆర్ అంబేడ్కర్ వర్సిటీ బీఈడీ అడ్మిషన్లకు నోటిఫికేషన్- అర్హతలు, దరఖాస్తు విధానం ఇలా

BRAOU B.ED Admissions : బీఆర్ అంబేడ్కర్ వర్సిటీ బీఈడీ అడ్మిషన్లకు నోటిఫికేషన్- అర్హతలు, దరఖాస్తు విధానం ఇలా

18 December 2024, 17:56 IST

google News
  • BRAOU B.ED Admissions : హైదరాబాద్ లోని బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో బీఈడీ ఓడీఎల్ కోర్సుల్లో ఎంట్రన్స్ ఎగ్జామ్, అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నెల 21 వరకు అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

బీఆర్ అంబేడ్కర్ వర్సిటీ బీఈడీ అడ్మిషన్లకు నోటిఫికేషన్- అర్హతలు, దరఖాస్తు విధానం ఇలా
బీఆర్ అంబేడ్కర్ వర్సిటీ బీఈడీ అడ్మిషన్లకు నోటిఫికేషన్- అర్హతలు, దరఖాస్తు విధానం ఇలా

బీఆర్ అంబేడ్కర్ వర్సిటీ బీఈడీ అడ్మిషన్లకు నోటిఫికేషన్- అర్హతలు, దరఖాస్తు విధానం ఇలా

BRAOU B.ED Admissions : హైదరాబాద్‌లోని బీఆర్‌ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2024-25 విద్యా సంవత్సరానికి బీఈడీ ఓడీఎల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానించింది. బీఈడీ ఓడీఎల్ కోర్సులు చేసిన వారికి టెట్‌తో పాటు డీఎస్సీ పరీక్ష రాసేందుకు అవకాశం కల్పిస్తారు. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా బీఈడీ కోర్సు చేసేందుకు ఇది చక్కటి అవకాశమని అంబేడ్కర్‌ వర్సిటీ పేర్కొంది. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్‌ 21 వ తేదీలోపు ఆన్‌లైన్‌ లో దరఖాస్తు చేసుకోవాలి. రెండేళ్ల వ్యవధితో తెలుగు మాధ్యమంలో కోర్సు ఉంటుంది. అభ్యర్థుల వయోపరిమితి 1 జులై, 2024 నాటికి 21 ఏళ్లు పూర్తై ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి లేదు.

బీఈడీ అడ్మిషన్ ఎంట్రన్స్ టెస్ట్ రాసేందుకు అభ్యర్థులు యూనివర్సిటీ పోర్టల్ www.braouonline.in లో నమోదు చేసుకోవాలి. ఆన్‌లైన్ ద్వారా జనరల్, బీసీ అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 1000, ఎస్.సి./ఎస్.టి/పీడబ్ల్యుడీ అభ్యర్థులు రూ. 750 చెల్లించాల్సి ఉంటుంది. బీఈడీ ఓడీఎల్‌ ప్రవేశాలకు కనీసం 50 శాతం మార్కులతో బీఏ, బీఎస్సీ, బీకాం, బీసీఏ, బీబీఏ, బీబీఎం, బీఈ, బీటెక్‌ ఏదైనా ఒక డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు ప్రాథమిక విద్యలో శిక్షణ పొంది ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులై ఉండాలి. లేదా ప్రాథమిక విద్యలో టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ చేసి ఉండాలి.

ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా తుది ఎంపిక ఉంటుంది. డిసెంబర్‌ 21 నాటికి ఆన్ లైన్ దరఖాస్తులు పూర్తవుతాయి. అయితే రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబర్‌ 25 దరఖాస్తు చేసుకోవచ్చు. బీఈడీ ప్రవేశ పరీక్ష డిసెంబర్‌ 31, 2024న నిర్వహిస్తారు.

ముఖ్యమైన తేదీలు

నోటిఫికేషన్ జారీ : 02-12-2024

ఆన్‌లైన్‌ అప్లికేషన్లు ప్రారంభం: 02-12-2024

ఆన్‌లైన్ దరఖాస్తులు చివరి తేదీ : 21-12-2024

రూ.500 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ : 25-12-2024

హాల్ టికెట్ల డౌన్‌లోడ్ : 28-12-2024

బి.ఎడ్ (ODL) ప్రవేశ పరీక్ష తేదీ : 31-12-2024(ఉదయం 09-00 నుండి 11-00)

ఫలితాలు, ర్యాంక్ కార్డుల డౌన్‌లోడ్ : జనవరి మొదటి వారం, 2025

ప్రవేశ కౌన్సెలింగ్ : జనవరి మూడో వారం, 2025

ఆన్ లైన్ దరఖాస్తు విధానం

1. బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పోర్టల్ www.braouonline.in ని సందర్శించండి.

2. ఆన్‌లైన్ దరఖాస్తుకు అవసరమైన పత్రాలు, ఇతర వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయండి

3. అప్లికేషన్ ఫారమ్‌ను సబ్మిట్ చేసి, ప్రింట్ అవుట్ తీసుకోండి.

4.రిఫరెన్స్ నంబర్‌తో రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించండి.

5. రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 1000, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ. 750 ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలి.

6.ఫీజు చెల్లించి రసీదు పొందండి.

7. అడ్మిషన్ కౌన్సెలింగ్ సమయంలో సబ్మిట్ చేసేందుకు దరఖాస్తు ఫారమ్, ఫీజు రసీదును ప్రింట్ అవుట్ తీసుకోండి.

8. దరఖాస్తును భౌతికంగా సమర్పించాల్సిన అవసరం లేదు.

తదుపరి వ్యాసం