TG EdCET Counseling 2024 : బీఈడీ ప్రవేశాలు - ప్రారంభమైన 'ఎడ్‌సెట్' కౌన్సెలింగ్, 30న సీట్ల కేటాయింపు
TG EdCET Counseling 2024: బీఈడీ ప్రవేశాల కోసం నిర్వహించే ఎడ్ సెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇవాళ్టి నుంచి ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆగస్టు 20వ తేదీని తుది గడువుగా పేర్కొన్నారు.
TG EdCET 2024 Counseling : తెలంగాణలోని బీఈడీ కాలేజీల్లో ప్రవేశాలు కోసం నిర్వహించే టీజీ ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత సాధించిన అభ్యర్థులు ఇవాళ్టి నుంచి ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆగస్టు 20వ తేదీని తుది గడువుగా పేర్కొన్నారు.ఈ తేదీల్లోనే అభ్యర్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కూడా నిర్వహిస్తారు. https://edcet.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి ప్రాసెస్ పూర్తి చేసుకోవాలి.
ఆగస్టు 12 నుంచి 16 వరకు స్పోర్ట్స్, ఎన్‌సీసీ, సీఏపీ, పీహెచ్ కేటగిరీల అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది. ఆగస్టు 21న అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తారు. ఆగస్టు 22, 23వ తేదీల్లో అభ్యర్థులు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. 24వ తేదీన వెబ్ ఆప్షన్స్ ఎడిట్ కు అవకాశం కల్పిస్తారు.
మొదటి విడత కౌన్సెలింగ్ లో భాగంగా ఆగస్టు 30న సీట్ల కేటాయింపు ఉంటుంది. ఫస్ట్ ఫేజ్ లో సీట్లు పొందిన అభ్యర్థులు ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 4 వరకు ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఆయా కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఆగస్టు 31 నుంచి బీఈడీ తరగతులు ప్రారంభం కానున్నాయి. సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ తేదీలను త్వరలోనే ప్రకటించనున్నారు.
ర్యాంకు కార్డు ఇలా డౌన్ లోడ్ చేసుకోండి?
- ఎడ్ సెట్ రాసిన అభ్యర్థులు ముందుగా https://edcet.tsche.ac.in/ అధికారిక వెబ్ సైట్ పై క్లిక్ చేయండి.
- ఆ తర్వాత హోంపేజీలో డౌన్ లోడ్ ర్యాంక్ కార్డుపై క్లిక్ చేయండి
- తర్వాత పేజీలో అభ్యర్థి ఎడ్ సెట్ హాల్ టికెట్ నెం, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేయాలి.
- వ్యూ ర్యాంక్ కార్డుపై క్లిక్ చేయండి.
- స్క్రీన్ పై విద్యార్థి ర్యాంకు కార్డు డిస్ ప్లే అవుతుంది. ర్యాంకు కార్డును డౌన్ లోడ్ చేసుకొని ప్రింట్ అవుట్ తీసుకోండి.
లాసెట్ కౌన్సెలింగ్…. రిజిస్ట్రేషన్లు ప్రారంభం
తెలంగాణలోని న్యాయ కళాశాల్లో ప్రవేశాల కోసం నిర్వహించే లాసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా ఆగస్టు 20వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. https://lawcet.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.
ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ కోసం రూ. 800 చెల్లించాలి. ఇక ఎస్సీ, ఎస్సీ, దివ్యాంగ అభ్యర్థులు మాత్రం రూ. 500 పేమెంట్ చేయాలి. ఆగస్టు 22వ తేదీ నుంచి వెబ్ ఆప్షన్లను ఎంచుకోవాల్సి ఉంటుంది. 23వ తేదీతో ఈ గడువు పూర్తి అవుతుంది. ఆగస్టు 24వ తేదీన వెబ్ ఆప్షన్లను ఎడిట్ చేసుకోవచ్చు. ఆగస్టు 27వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది. ఆగస్టు 28 నుంచి 30 తేదీల మధ్య సీట్లు పొందిన విద్యార్థులు ఆయా కాలేజీల్లో రిపోర్ట్ చేయాలి. రెండో విడత కౌన్సెలింగ్ తేదీలను త్వరలోనే ప్రకటించనున్నారు.
ఈ ఏడాది జరిగిన తెలంగాణ లాసెట్ పరీక్షకు 40,268 మంది హాజరయ్యారు. వీరిలో 29,258 మంది అర్హత సాధించారు. మొత్తంగా 72.66 శాతం మంది అభ్యర్థులు ఉత్తీర్ణులు అయ్యారు. పరీక్ష రాసిన అభ్యర్థులు https://lawcet.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి రిజల్ట్స్ ను చెక్ చేసుకోవచ్చు.
ర్యాంక్ కార్డు ఇలా డౌన్లోడ్ చేసుకోండి...
- లాసెట్ పరీక్ష రాసిన అభ్యర్థులు మొదటగా https://lawcet.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- Download Rank Card అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- Hall Ticket Number, పుట్టిన తేదీని ఎంట్రీ చేయాలి.
- -గెట్ రిజల్ట్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే మీ స్కోర్ తో పాటు ర్యాంక్ కార్డు డిస్ ప్లే అవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి ర్యాంక్ కార్డు కాపీని పొందవచ్చు.
- అడ్మిషన్ ప్రక్రియలో ర్యాంక్ కార్డు అత్యంత కీలకం.