CISF Constable Fire Admit Card : 1130 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి పరీక్ష- అడ్మిట్ కార్డులు విడుదల..
16 December 2024, 11:20 IST
CISF Constable Fire Admit Card 2024 : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కానిస్టేబుల్ ఫైర్ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులు అందుబాటులోకి వచ్చాయి. అభ్యర్థులు cisfrectt.cisf.gov.in ద్వారా అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఫైర్ అడ్మిట్ కార్డు 2024 విడుదల..
పీఈటీ, పీఎస్టీ, డీవీ పోస్టులకు సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఫైర్ అడ్మిట్ కార్డు 2024ను విడుదల చేసింది సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్). పీఈటీ/పీఎస్టీ/డీవీ పరీక్షలకు హాజరు కావాలనుకునే అభ్యర్థులు cisfrectt.cisf.gov.in సీఐఎస్ఎఫ్ అధికారిక వెబ్సైట్ ద్వారా అడ్మిట్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు.
కానిస్టేబుల్ (ఫైర్) 2024 ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్ (పీఈటీ)/ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్టీ) వెరిఫికేషన్ (డీవీ) డిసెంబర్ 24 నుంచి జనవరి 20, 2025 వరకు దేశవ్యాప్తంగా 35 కేంద్రాల్లో జరగనుంది.
అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ ఐడీ, పాస్వర్డ్ ఉపయోగించి పీఈటీ/ పీఎస్టీ/ డీవీ అడ్మిట్ కార్డును వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవవచ్చు. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ కింది స్టెప్స్ ఫాలో అవ్వండి.
సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఫైర్ అడ్మిట్ కార్డు 2024 డౌన్లోడ్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇలా డౌన్లోడ్ చేసుకోండి..
- cisfrectt.cisf.gov.in సీఐఎస్ఎఫ్ అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించండి.
- హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఫైర్ అడ్మిట్ కార్డు 2024 లింక్‌పై క్లిక్ చేయండి.
- అభ్యర్థులు లాగిన్ వివరాలను నమోదు చేయాల్సిన కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
- సబ్మిట్పై క్లిక్ చేస్తే మీ అడ్మిట్ కార్డు డిస్ప్లే అవుతుంది.
- అడ్మిట్ కార్డు చెక్ చేసుకుని పేజీని డౌన్లోడ్ చేసుకోవాలి.
- తదుపరి అవసరాల కోసం దాని హార్డ్ కాపీని తీసిపెట్టుకోండి.
వెబ్సైట్ నుంచి ఈ-అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోలేకపోతే అభ్యర్థులు పీఈటీ/పీఎస్టీ/డీవీకి పరీక్షకు కనీసం వారం రోజుల ముందు సీఐఎస్‌ఎఫ్‌ని సంప్రదించాలి. అడ్మిట్ కార్డులు రాకపోతే సీఐఎస్ఎఫ్ హెల్ప్‌లైన్ నంబర్ 011-24366431/24307933 (పనిదినాల్లో 1000 నుంచి 1800 గంటలు) సంప్రదించవచ్చు.
ఫిజికల్ ఎఫీషీయెన్సీ టెస్ట్ (పీఈటీ)/ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్టీ) వెరిఫికేషన్ (డీవీ), రాత పరీక్ష (ఓఎంఆర్/సీబీటీ), డిటైల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ (డీఎంఈ)/ రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ (ఆర్ఎంఈ) ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఓఎంఆర్/ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో రాత పరీక్షను ఇంగ్లిష్, హిందీ భాషల్లో మాత్రమే నిర్వహిస్తారు.
ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో 1130 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆగస్టు 31న ప్రారంభమైన రిజిస్ట్రేషన్ ప్రక్రియ 2024 సెప్టెంబర్ 30న ముగిసింది. మరిన్ని వివరాలకు అభ్యర్థులు సీఐఎస్ఎఫ్ అధికారిక వెబ్‌సైట్‌ని చూడవచ్చు.
అధికారిక ప్రకటన చూసేందుకు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.