AIBE 19 Admit Card : ఏఐబీఈ 19 అడ్మిట్ కార్డు 2024 విడుదల- ఇలా డౌన్లోడ్ చేసుకోండి..
15 December 2024, 12:52 IST
AIBE 19 Admit Card : 2024 సంవత్సరానికి సంబంధించిన ఏఐబీఈ 19 అడ్మిట్ కార్డును డిసెంబర్ 15న విడుదల చేసింది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. డౌన్లోడ్ లింక్‌తో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఏఐబీఈ 19 అడ్మిట్ కార్డు 2024 విడుదల..
బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏఐబీఈ 19 అడ్మిట్ కార్డు 2024ను డిసెంబర్ 15, 2024 ఆదివారం విడుదల చేసినట్లు అధికారిక వర్గాలు హెచ్‌టీ డిజిటల్‌కి ధృవీకరించాయి. ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్-19కు హాజరయ్యే అభ్యర్థులు తమ హాల్ టికెట్లను అధికారిక వెబ్ సైట్ allindiabarexamination.com నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఏఐబీఈ 19 అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్‌కి సంబంధించిన డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఈ ఏఐబీఈ 19 పరీక్ష డిసెంబర్ 22న జరగనుంది. ఏఐబీఈ 19లో 19 టాపిక్స్ లేదా సబ్జెక్టుల నుంచి 100 ప్రశ్నలు ఉంటాయి. అవి..
- రాజ్యాంగ చట్టం: 10 ప్రశ్నలు
- పీ.సీ. (భారతీయ శిక్షాస్మృతి), (కొత్త) భారతీయ న్యాయ సంహిత: 8 ప్రశ్నలు
- సీఆర్ పీసీ (క్రిమినల్ ప్రొసీజర్ కోడ్), (కొత్త) భారతీయ నగరిక్ సురక్షా సంహిత: 10 ప్రశ్నలు
- సీ.పీ.సీ. (కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్): 10 ప్రశ్నలు
- ఎవిడెన్స్ యాక్ట్ (కొత్త) భారతీయ సాక్ష్య అధినియం: 8 ప్రశ్నలు
- మధ్యవర్తిత్వ చట్టంతో సహా ప్రత్యామ్నాయ వివాద పరిష్కారం: 4 ప్రశ్నలు
- ఫ్యామిలీ లా: 8 ప్రశ్నలు
- ప్రజా ప్రయోజన వ్యాజ్యం: 4 ప్రశ్నలు
- అడ్మినిస్ట్రేషన్ లా: 3 ప్రశ్నలు
- బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం ప్రొఫెషనల్ ఎథిక్స్ అండ్ ప్రొఫెషనల్ దుష్ప్రవర్తన కేసులు: 4 ప్రశ్నలు
- కంపెనీ లా: 2 ప్రశ్నలు
- ఎన్విరాన్మెంటల్ లా: 2 ప్రశ్నలు
- సైబర్ లా: 2 ప్రశ్నలు
- లేబర్ అండ్ ఇండస్ట్రియల్ లా: 4 ప్రశ్నలు
- మోటారు వాహన చట్టం, వినియోగదారుల రక్షణ చట్టంతో సహా టోర్ట్ చట్టం: 5 ప్రశ్నలు
- పన్నుకు సంబంధించిన చట్టం: 4 ప్రశ్నలు
- లా ఆఫ్ కాంట్రాక్ట్, స్పెసిఫిక్ రిలీఫ్, ప్రాపర్టీ లాస్, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్: 8 ప్రశ్నలు
- భూసేకరణ చట్టం: 2 ప్రశ్నలు
- మేధో సంపత్తి చట్టాలు: 2 ప్రశ్నలు
ఏఐబీఈ 19 అడ్మిట్ కార్డు 2024ని ఇలా డౌన్లోడ్ చేసుకోండి..
అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ స్టెప్స్‌ని అనుసరించవచ్చు:
- allindiabarexamination.com అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించండి.
- హోమ్ పేజీలో ఏఐబీఈ 19 అడ్మిట్ కార్డు 2024 లింక్‌పై క్లిక్ చేయాలి.
- మీ లాగిన్ క్రెడెన్షియల్స్ ఎంటర్ చేసి సబ్మిట్పై క్లిక్ చేయండి.
- ఏఐబీఈ 19 అడ్మిట్ కార్డు స్క్రీన్‌పై కనిపిస్తుంది.
- తదుపరి అవసరాల కోసం డౌన్లోడ్ చేసి ప్రింటౌట్ తీసుకోండి.
మరింత సంబంధిత సమాచారం కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించాలి.