తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Zero Electric Bike : పేరుకే జీరో.. మైలేజీలో హీరో.. ఈ ఎలక్ట్రిక్ బైక్ ఒక్క ఛార్జ్‌తో ఈజీగా హైదరాబాద్ టూ వరంగల్‌ వెళ్తుంది

Zero Electric Bike : పేరుకే జీరో.. మైలేజీలో హీరో.. ఈ ఎలక్ట్రిక్ బైక్ ఒక్క ఛార్జ్‌తో ఈజీగా హైదరాబాద్ టూ వరంగల్‌ వెళ్తుంది

Anand Sai HT Telugu

14 August 2024, 14:07 IST

google News
    • Zero Electric Bike : అమెరికన్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ కంపెనీ జీరో మోటార్ సైకిల్ తన ఎలక్ట్రిక్ బైక్‌ను భారతదేశంలో లాంచ్ చేయాలని యోచిస్తోంది. ఇది మైలేజీ పరంగా కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ బైక్‌కు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం..
జీరో ఎలక్ట్రిక్ బైక్
జీరో ఎలక్ట్రిక్ బైక్

జీరో ఎలక్ట్రిక్ బైక్

అమెరికన్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ కంపెనీ జీరో మోటార్ సైకిల్ తన ఎలక్ట్రిక్ బైక్‌ను ఇండియాలో విడుదల చేసేందుకు ప్రణాళికలు వేస్తోంది. హీరో మోటోకార్ప్‌తో చేతులు కలిపి కొత్త బైక్‌లను అభివృద్ధి చేసి భారత్‌లో లాంచ్ చేయనుంది. వాస్తవానికి దీని జీరో ఎఫ్ఎక్స్ఈ బెంగళూరులో టెస్టింగ్ సమయంలో కనిపించింది. ఇది స్ట్రీట్ బైక్, దీని పనితీరు, రైడింగ్ రేంజ్ బాగుంది. టెస్టింగ్ సమయంలో 'కేఏ-01' టెస్ట్ నంబర్ ప్లేట్ ఉంది.

హీరో మోటోకార్ప్ బెంగళూరులో పనిచేసే ఎలక్ట్రిక్ వాహనాల కోసం పెద్ద బృందాన్ని కలిగి ఉంది. హీరో తన ఏకైక విడా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను బెంగళూరులో తయారు చేయడానికి చాలా ప్రణాళికలు చేస్తోంది. మరోవైపు జీరో ఎఫ్ఎక్స్ఈ గరిష్ట వేగం గంటకు 136 కిలోమీటర్లు. ఒకసారి ఛార్జ్ చేస్తే దీని రైడింగ్ రేంజ్ గంటకు 170 కిలోమీటర్ల వరకు ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఉదాహరణకు హైదరాబాద్ టూ వరంగల్ వెళ్లి.. మళ్లీ తిరిగి కొంచెం దూరం రావొచ్చన్నమాట. ఇందులో 7.2 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఉంది. దీని వల్ల ఈ మోటార్ సైకిల్‌తో చాలా దూరం వెళ్లవచ్చు.

ఎఫ్ఎక్స్ఈ అద్భుతమైన డిజైన్‌తోపాటు ప్రీమియం పొజిషనింగ్‌కు ప్రసిద్ధి చెందింది. ఎఫ్ఎక్స్ఈ విలువ అమెరికాలో రూ.10 లక్షలకు పైగా ఉంది. అంటే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ వాహనాల్లో ఇదొకటి. హీరో మోటోకార్ప్ జీరో బైక్ చౌకైన వేరియంట్లను భారత మార్కెట్లో విడుదల చేయనుంది. అందుకని బ్యాటరీ ప్యాక్‌ను తగ్గించి ధరను తగ్గించుకోవచ్చు. ఇందులో ఫీచర్ల సంఖ్యను కూడా తగ్గించుకోవచ్చు.

హీరో మోటోకార్ప్ జీరో బైక్‌ను భారతదేశంలో పూర్తిగా ఉత్పత్తి చేయాలని యోచిస్తున్నప్పటికీ, పూర్తిగా లోడ్ చేసిన జీరో ఈవీని సరసమైన ధరలో చూసే అవకాశం ఉంది. ఓలా ఎలక్ట్రిక్ కూడా తన మొదటి ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ను ఆగస్టు 15 న విడుదల చేస్తుంది. ఇదే సమయంలో జీరో ఎలక్ట్రిక్ బైక్ వివరాలు బయటకు రావడం విశేషం. అల్ట్రావయొలెట్ ఎఫ్ 77, ఒబెన్ రోర్, కోమాకి రేంజర్, టోర్క్ క్రాటోస్ వంటి మోడ్స్ ఇప్పటికే భారత మార్కెట్లో ఉన్నాయి.

తదుపరి వ్యాసం