Revanth Reddy Return: హైదరాబాద్‌ చేరుకున్న సీఎం రేవంత్‌‌రెడ్డి బృందం, శంషాబాద్‌లో కాంగ్రెస్‌ శ్రేణుల ఘన స్వాగతం-cm revanth reddys team reached hyderabad and toured america and south korea ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Revanth Reddy Return: హైదరాబాద్‌ చేరుకున్న సీఎం రేవంత్‌‌రెడ్డి బృందం, శంషాబాద్‌లో కాంగ్రెస్‌ శ్రేణుల ఘన స్వాగతం

Revanth Reddy Return: హైదరాబాద్‌ చేరుకున్న సీఎం రేవంత్‌‌రెడ్డి బృందం, శంషాబాద్‌లో కాంగ్రెస్‌ శ్రేణుల ఘన స్వాగతం

Sarath chandra.B HT Telugu
Aug 14, 2024 12:20 PM IST

Revanth Reddy Return: పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు అమెరికా, కొరియాలలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి బృందం స్వదేశానికి చేరుకుంది. దక్షిణ కొరియా నుంచి బుధవారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న రేవంత్ బృందానికి కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.విదేశీ పర్యటనలో భారీగా పెట్టుబడులను ఆకర్షించారు.

హైదరాబాద్‌ చేరుకున్న రేవంత్‌ రెడ్డికి కాంగ్రెస్ శ్రేణుల ఘన స్వాగతం
హైదరాబాద్‌ చేరుకున్న రేవంత్‌ రెడ్డికి కాంగ్రెస్ శ్రేణుల ఘన స్వాగతం

Revanth Reddy Return: విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆగస్ట్‌ 3న విదేశీ పర్యటన ప్రారంభించిన తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి బృందం స్వదేశానికి చేరుకుంది. బుధవారం ఉదయం హైదరాబాద్‌ శంషాబాద్‌ విమానాశ్రయంలో సీఎం రేవంత్‌ రెడ్డికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.

తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా సాగిన సీఎం విదేశీ పర్యటన సాగింది. అమెరికాలోని పలు రాష్ట్రాలతో పాటు దక్షిణ కొరియాలో సీఎం పర్యటన జరిగింది. అమెరికా, దక్షిణకొరియాలో సీఎంతో పాటు, మంత్రి శ్రీధర్ బాబు, పలువురు అధికారులు పర్యటించారు. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా ఆయా దేశాల్లో వివిధ సంస్థల ప్రతినిధులతో సీఎయి బృందం సమావేశాలు నిర్వహించింది. రాష్ట్రానికి చేరుకున్న సీఎం బృందానికి శంషాబాద్ ఎయిర్పోర్టులో పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ శ్రేణులు స్వాగతం పలికారు.

రేవంత్ అమెరికా పర్యటనలో న్యూయార్క్, వాషింగ్టన్, డాలస్, శాన్‌ఫ్రాన్సిస్కో నగరాల్లో పర్యటించారు. పలు కంపెనీల సీఈఓలు, పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. ఆగస్టు 10న అమెరికా నుంచి బయలుదేరి 11న దక్షిణ కొరియాలోని సియోల్‌కు చేరుకు న్నారు. అక్కడ హ్యుందాయ్ కంపెనీ ప్రతినిధులు, కొరియన్ జౌళి పరిశ్ర మల సమాఖ్యతో భేటీ అయ్యారు.తెలంగాణలో పెట్టుబడుల కోసం ఆహ్వానించారు.

నేడు కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ శంకుస్థాపన…

ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్ హైదరాబాద్‌లో విస్తరణ చేపట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో ఒప్పందం చేసుకున్నారు. కోకాపేట జీఏఆర్ బిల్డింగ్ వద్ద కొత్త ప్రాంగణానికి బుధవారం కాగ్నిజెంట్ శంకుస్థాపన చేయనుంది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

అమెరికా పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్‌ఆ సంస్థ సీఈవో రవికుమార్‌తో చర్చలు జరిపారు. ఈ నెల 5న న్యూజెర్సీలో జరి గిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందానికి అనుగుణంగా కాగ్నిజెంట్ కంపెనీ పది రోజుల్లోనే కొత్త క్యాంపస్ విస్తరణకు ఏర్పాట్లు చేసింది.

తెలంగాణ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా హైదరాబాద్‌లో 10 లక్షల చద రపు అడుగుల కొత్త క్యాంపస్ నెలకొల్పనున్నారు. దీంతో అదనంగా 15 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని ఆ సంస్థ ప్రకటించింది.

1994లో చెన్నై కేంద్రంగా కాగ్నిజెంట్ ఆవిర్భవించింది. ఈ సంస్థ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కార్యకలాపాలాను విస్తరించింది. హైదరాబాద్‌లో 2002లో కార్యకలాపాలు ప్రారంభించిన కాగ్నిజెంట్ భాగ్యనగరంలోని ఐటీ కారిడార్లోని వివిధ ప్రాంతాల్లో ఐదు క్యాంపస్‌లలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ సంస్థలో దాదాపు 57 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

తెలంగాణలో ఐటీ రంగంలో అత్యధిక ఉద్యోగాలు కల్పిస్తున్న రెండో సంస్థగా కాగ్నిజెంట్‌ గుర్తింపు పొందింది. రెండేళ్లలో రాష్ట్రంలోని 34 వివిధ విద్యాసంస్థల నుంచి 7,500 మంది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లను తమ సంస్థల్లో అవకాశం కల్పించింది. గత ఏడాది తెలంగాణ నుంచి కాగ్నిజెంట్ రూ.7725 కోట్ల ఐటీ ఎగుమతులు నమోదు చేసింది.

సంబంధిత కథనం