తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Xiaomi Smarter Living Event: షావోమీ లాంచ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. ఏం లాంచ్ కావొచ్చంటే!

Xiaomi Smarter Living Event: షావోమీ లాంచ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. ఏం లాంచ్ కావొచ్చంటే!

09 April 2023, 22:25 IST

    • Xiaomi Smarter Living 2023 Event: షావోమీ స్మార్టర్ లివింగ్ లాంచ్ ఈవెంట్ డేట్ ఫిక్స్ అయింది. స్మార్ట్ ప్రొడక్టులను ఈ ఈవెంట్‍లో విడుదల చేయనుంది షావోమీ.
Xiaomi Smarter Living Event: షావోమీ లాంచ్ ఈవెంట్ డేట్ ఫిక్స్ (Photo: Xiaomi)
Xiaomi Smarter Living Event: షావోమీ లాంచ్ ఈవెంట్ డేట్ ఫిక్స్ (Photo: Xiaomi)

Xiaomi Smarter Living Event: షావోమీ లాంచ్ ఈవెంట్ డేట్ ఫిక్స్ (Photo: Xiaomi)

Xiaomi Smarter Living 2023 Event: స్మార్టర్ లివింగ్ 2023 (Smarter Living 2023) లాంచ్ ఈవెంట్‍ను ప్రముఖ సంస్థ షావోమీ (Xiaomi) ప్రకటించింది. ఈనెల 13వ తేదీన ఈ ఈవెంట్ జరగనుంది. ఇంటర్నెట్ ఆన్ థింగ్స్ (Internet on Things) సహా స్మార్ట్ ప్రొడక్టులను ఈ కార్యక్రమంలో షావోమీ విడుదల చేయనుంది. ‘మీ ఇంటిని స్మార్ట్‌గా అప్‍గ్రేడ్ చేసుకోండి’ అంటూ షావోమీ టీజ్ చేస్తోంది. ఈ ఈవెంట్‍లో కొత్త మొబైళ్లను షావోమీ లాంచ్ చేసే ఛాన్స్ లేదు. ఐవోటీ సహా స్మార్ట్ ప్రొడక్టులను తీసుకురానుంది. వివరాలివే..

షావోమీ స్మార్టర్ లివింగ్ ఈవెంట్ వివరాలు

Xiaomi Smarter Living 2023 Event: షావోమీ స్మార్టర్ లివింగ్ 2023 లాంచ్ ఈవెంట్ ఈనెల 13వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం అవుతుంది. ఈ విషయాన్ని షావోమీ అధికారంగా ప్రకటించింది. అయితే, ఈ ఈవెంట్‍లో ఏ ప్రొడక్టులను లాంచ్ చేయనున్నది షావోమీ స్పష్టంగా చెప్పలేదు. అయితే కొన్ని హింట్స్ ఇచ్చింది. వీటి ద్వారా కొన్ని వివరాలు తెలుస్తున్నాయి.

ఏ ప్రొడక్టులు లాంచ్ కానున్నాయంటే..

Xiaomi Smarter Living 2023 Event: ఈ ఈవెంట్ గురించి ట్విట్టర్‌లో ఓ టీజర్‌ను షావోమీ పోస్ట్ చేసింది. దీని ద్వారా కొన్ని ప్రొడక్టుల గురించి తెలుస్తోంది. కొత్త వాక్యూమ్ క్లీనర్, ఓ ఎలక్ట్రిక్ హెయిర్ ట్రిమ్మర్, ఎయిర్ ప్యూరిఫయర్, కొత్త ఎయిర్ ఫ్రయర్ సహా మరిన్ని ప్రొడక్టులను స్మార్టర్ లివింగ్ ఈవెంట్‍లో షావోమీ లాంచ్ చేయనుంది. ఎయిర్ ప్యూరిఫయర్ 4 సిరీస్‍ను ఆ కంపెనీ తీసుకురానుంది.

Xiaomi Smarter Living 2023 Event: షావోమీ స్మార్ట్ లివింగ్ లాంచ్ ఈవెంట్‍లో కొత్త స్మార్ట్ టీవీలు, నెక్స్ట్ జెన్ నోట్‍బుక్ ల్యాప్‍టాప్‍లతో పాటు మరిన్ని స్మార్ట్ ప్రొడక్టులు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే స్మార్టర్ లివింగ్ ఈవెంట్‍కు సంబంధించి అధికారిక వెబ్‍సైట్‍లో ఓ పేజీని ఏర్పాటు చేసింది షావోమీ. ఈ పేజీ ద్వారా వివరాలను క్రమంగా వెల్లడించనుంది.

ఇక, గ్లోబల్ మార్కెట్‍లో ఈనెలలోనే షావోమీ 13 అల్ట్రా ఫోన్ లాంచ్ కానుంది. స్నాప్‍డ్రాగన్ 8 జెన్ 2 సహా ప్రీమియమ్ స్పెసిఫికేషన్లతో ఈ మొబైల్ ఉంది. లీకా బ్రాండ్ కెమెరాలను ఈ ఫోన్ కలిగి ఉంటుంది. డబ్ల్యూక్యూహెచ్‍డీ+ డిస్‍ప్లేతో వస్తుంది.

టాపిక్

తదుపరి వ్యాసం