తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Xiaomi 13 Pro 5g Price: ఇండియాలో షావోమీ 13 ప్రో 5జీ ధర ఇదే.. అధికారికంగా ప్రకటించిన షావోమీ

Xiaomi 13 Pro 5G Price: ఇండియాలో షావోమీ 13 ప్రో 5జీ ధర ఇదే.. అధికారికంగా ప్రకటించిన షావోమీ

28 February 2023, 15:36 IST

    • Xiaomi 13 Pro 5G price in India: షావోమీ 13 ప్రో 5జీ ధరను ఆ కంపెనీ ప్రకటించింది. ప్రీమియమ్ ఫ్లాగ్‍షిప్ రేంజ్‍లో ఈ మొబైల్ వచ్చింది. తొలి సేల్ సందర్భంగా రూ.10వేల వరకు బ్యాంక్ కార్డు డిస్కౌంట్ ఉంటుంది.
Xiaomi 13 Pro 5G Price: ఇండియాలో షావోమీ 13 ప్రో 5జీ ధర ఇదే.. అధికారికంగా ప్రకటించిన షావోమీ (Photo: Xiaomi)
Xiaomi 13 Pro 5G Price: ఇండియాలో షావోమీ 13 ప్రో 5జీ ధర ఇదే.. అధికారికంగా ప్రకటించిన షావోమీ (Photo: Xiaomi)

Xiaomi 13 Pro 5G Price: ఇండియాలో షావోమీ 13 ప్రో 5జీ ధర ఇదే.. అధికారికంగా ప్రకటించిన షావోమీ (Photo: Xiaomi)

Xiaomi 13 Pro 5G price in India: షావోమీ 13 ప్రో 5జీ ధర, సేల్, ఆఫర్ వివరాలు వెల్లడయ్యాయి. ఈ ప్రీమియమ్ ఫ్లాగ్‍షిప్‍ మొబైల్‍ను రెండు రోజుల క్రితం ఇండియాలో లాంచ్ చేసిన షావోమీ (Xiaomi).. నేడు (ఫిబ్రవరి 28) ధర వివరాలను ప్రకటించింది. స్పెసిఫికేషన్లకు తగ్గట్టే ప్రీమియమ్ రేంజ్‍లో ఈ షావోమీ 13 ప్రో 5జీ ఉంది. ముఖ్యంగా 1 ఇంచ్ హైపర్ ఐఓఎస్ ప్రైమరీ కెమెరా, ఫ్లోటింగ్ టెలిఫొటో కెమెరా ఈ మొబైల్‍కు హైలైట్‍గా ఉన్నాయి. శక్తిమంతమైన ప్రాసెసర్ ఉంది. షావోమీ 13 ప్రో 5జీ పూర్తి వివరాలు ఇవే.

ట్రెండింగ్ వార్తలు

iVOOMi JeetX ZE: ఐవూమి నుంచి మరో ఎలక్ట్రిక్ స్కూటర్; ధర, రేంజ్ ల్లో దీనికి సాటి లేదు..

Discounts on Hyundai cars: ఎక్స్టర్ ఎస్యూవీ సహా టాప్ మోడళ్లపై భారీ డిస్కౌంట్స్ ప్రకటించిన హ్యుందాయ్

2024 Maruti Suzuki Swift: 2024 మారుతి సుజుకీ స్విఫ్ట్ రేపు లాంచ్: టాప్ మైలేజ్ ఇచ్చే హ్యాచ్ బ్యాక్ ఇదే..

EPFO alert: ఉద్యోగులకు షాక్; గ్రాట్యుటీ పరిమితి పెంపు అమలుపై ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం

షావోమీ 13 ప్రో 5జీ ధర, సేల్, ఆఫర్

Xiaomi 13 Pro 5G Price in India: షావోమీ 13 ప్రో 5జీ మొబైల్ ఒకే వేరియంట్‍లో ఇండియాలో అందుబాటులోకి వస్తోంది. 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ఉన్న ఈ ఫోన్ ధర రూ.79,999గా ఉంది. సెరామిక్ బ్లాక్, సెరామిక్ వైట్ కలర్ ఆప్షన్‍లలో లభిస్తుంది. మార్చి 6వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఎర్లీ యాక్సెస్ సేల్‍కు ఈ ఫోన్ వస్తుందని షావోమీ పేర్కొంది. ఈ-కామర్స్ సైట్ అమెజాన్, షావోమీ వెబ్‍సైట్ (mi.com)లో ఈ మొబైల్ సేల్‍కు రానుంది. మార్చి 10వ తేదీ నుంచి పూర్తిస్థాయిలో సేల్‍లు ఈ ఫోన్ లభిస్తుంది.

Xiaomi 13 Pro 5G Offers: తొలి సేల్‍లో షావోమీ 13 ప్రో 5జీ ఫోన్‍ను ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డుతో కొంటే రూ.10,000 వరకు అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. అంటే రూ.69,999కు దక్కించుకోవచ్చు. ఒకవేళ హెచ్‍డీఎఫ్‍సీ క్రెడిట్ కార్డుతో కొంటే రూ.8,000 వరకు డిస్కౌంట్ ఉంటుంది.

షావోమీ 13 ప్రో 5జీ స్పెసిఫికేషన్లు

Xiaomi 13 Pro 5G Specifications: షావోమీ 13 ప్రో 5జీ ఫోన్ వెనుక లైకా (Leica) బ్రాండింగ్‍తో మూడు కెమెరాలు ఉన్నాయి. ఇందులో 50 మెగాపిక్సెల్ Sony IMX989 ప్రైమరీ కెమెరాగా ఉంది. ఈ కెమెరా లెన్స్ ఒక ఇంచు సైజ్‍లో ఉంటుంది. ఇంత సైజ్ లెన్స్ మొబైల్‍కు ఉండడం ఇదే తొలిసారి. 50 మెగాపిక్సెల్ ఫ్లోటింగ్ టెలిఫొటో కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉన్నాయి. 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో షావోమీ 13 ప్రో 5జీ వస్తోంది. ప్రత్యేకమైన లైకా కెమెరా ఫీచర్లు, మోడ్స్ అందుబాటులో ఉంటాయి.

1900 నిట్స్ పీక్ బ్రైట్‍నెస్ ఉండే 6.73 ఇంచుల 2K+ LTPO 3.0 10 బిట్ అమోలెడ్ డిస్‍ప్లేతో Xiaomi 13 Pro 5G వస్తోంది. డాల్బీ విజన్, హెచ్‍డీఆర్10+, గొరిల్లాగ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ ఉంటుంది. స్నాప్‍డ్రాగన్ 8 జెన్ 2 పవర్‌ఫుల్ ప్రాసెసర్ ఈ మొబైల్‍లో ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 బేస్డ్ ఎంఐయూఐ 14 ఆపరేటింగ్ సిస్టమ్‍తో వస్తోంది.

4,820mAh బ్యాటరీతో షావోమీ 13 ప్రో 5జీ వస్తోంది. 120 వాట్ల (W) వైర్డ్ హైపర్ చార్జ్‌ ఫాస్ట్ చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తుంది. 50W వైర్లెస్ టర్బో ఫాస్ట్ చార్జింగ్, 10W వైర్లెస్ రివర్స్ చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తుంది. డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉండే డ్యుయల్ స్టీరియో స్పీకర్లతో షావోమీ 13 ప్రో 5జీ వస్తోంది.