Xiaomi 13 Pro 5G: అదిరిపోయేలా షావోమీ ప్రీమియమ్ ఫోన్ ఇండియాకు వచ్చేసింది: ప్రత్యేకతలివే
Xiaomi 13 Pro 5G launched in India: ఎట్టకేలకు షావోమీ 13 ప్రో 5జీ మొబైల్ ఇండియా మార్కెట్‍లో అడుగుపెట్టింది. ప్రీమియమ్ స్పెసిఫికేషన్లతో ఈ ఫోన్ వస్తోంది. ముఖ్యంగా ఫ్లాగ్‍షిప్ సెటప్‍తో కూడిన కెమెరాలు దీనికి మరింత ఎక్కువ ఆకర్షణగా ఉన్నాయి.
Xiaomi 13 Pro launched in India: షావోమీ (Xiaomi) ప్రీమియమ్ ఫ్లాగ్‍షిప్ స్మార్ట్‌ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది. షావోమీ 13 ప్రో 5జీ భారత మార్కెట్‍లో అడుగుపెట్టింది. ఇప్పటికే చైనా మార్కెట్‍లో అందుబాటులో ఉన్న ఈ మొబైల్.. ఇప్పుడు భారత్‍తో పాటు గ్లోబల్‍గా లాంచ్ అయింది. క్వాల్‍కామ్ స్నాప్‍డ్రాగన్ 8 జెన్ 2 (Snapdragon 8 Gen 2) శక్తివంతమైన ప్రాసెసర్‌తో ఈ ఫోన్ వస్తోంది. లీకా బ్రాండింగ్‍తో ఫ్లాగ్‍షిప్ కెమెరాలు Xiaomi 13 Pro ఫోన్‍కు ఉంటాయి. వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ సహా అన్ని విభాగాల్లో ప్రీమియమ్ స్పెసిఫికేషన్లను షావోమీ 13 ప్రో 5జీ కలిగి ఉంది.
2K+ డిస్‍ప్లే..
Xiaomi 13 Pro: 6.73 ఇంచుల 2K+ రెజల్యూషన్ LTPO 3.0 అమోలెడ్ డిస్‍ప్లేను షావోమీ 13 ప్రో కలిగి ఉంది. డాల్బీ విజన్, హెచ్‍డీఆర్10+ సపోర్ట్, 120 హెర్ట్జ్ వరకు రిఫ్రెష్ రేట్ ఉంటాయి. ఏకంగా 1,900 నిట్స్ పీక్ బ్రైట్‍నెస్ ఉంటుంది. డిస్‍ప్లేకు గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ ఉంటుంది.
తొలి “ఇంచు” కెమెరా
Xiaomi 13 Pro: ఒక ఇంచు సైజ్ ఉన్న కెమెరా సెన్సార్‌తో వచ్చిన తొలి ఫోన్‍గా షావోమీ 13 ప్రో ఉంది. లీకా (Leica) బ్రాండింగ్ ప్రీమియమ్ కెమెరాలను ఈ ఫోన్ కలిగి ఉంది. ఈ మొబైల్ వెనుక 50 మెగాపిక్సెల్ 1-inch Sony IMX989 ప్రైమరీ కెమెరా, 50 మెగాపిక్సెల్ ఫ్లోటింగ్ టెలిఫొటో కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను షావోమీ ఇచ్చింది.
పవర్‌ఫుల్ ప్రాసెసస్
Xiaomi 13 Pro: క్వాల్కామ్ లేటెస్ట్, పవర్‌ఫుల్ స్నాప్‍డ్రాగన్ 8 జెన్ 2 5జీ ప్రాసెసర్.. షావోమీ 13 ప్రో ఫోన్‍లో ఉంది. యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్, LPDDR5X ర్యామ్ ఈ మొబైల్‍లో ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 బేస్డ్ MIUI 14 ఆపరేటింగ్ సిస్టమ్‍తో అందుబాటులోకి వస్తోంది. డాల్బీ ఆడియో, హైరెస్ ఆడియో సపోర్ట్ ఉండే డ్యుయల్ స్టీరియో స్పీకర్లతో ఈ ఫోన్ వస్తోంది.
వైర్లెస్ ఫాస్ట్ చార్జింగ్ కూడా..
Xiaomi 13 Pro: షావోమీ 13 ప్రో మొబైల్‍లో 4,820mAh బ్యాటరీ ఉంటుంది. 120 వాట్ల వైర్డ్ హైపర్ చార్జ్ ఫాస్ట్ చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తుంది. 50 వాట్ల వైర్లెస్ ట్రర్బో ఫాస్ట్ చార్జింగ్, 10 వాట్ల వైర్లెస్ రివర్స్ చార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. డ్యుయల్ సిమ్, 5జీ, 4జీ ఎల్‍టీఈ, వైఫై 6, బ్లూటూత్, ఎన్ఎఫ్‍సీ, యూఎస్‍బీ టైప్-సీ పోర్టు కనెక్టివిటీ ఫీచర్లుగా ఉంటాయి. డస్ట్, వాటర్ రెసిస్టెంట్స్ కోసం ఐపీ68 రేటింగ్‍తో Xiaomi 13 Pro వస్తోంది.
షావోమీ 13 ప్రో ధర, సేల్
Xiaomi 13 5G Pro Price in India: షావోమీ 13 ప్రో ఇండియా ధరను ఆ కంపెనీ ఇంకా ప్రకటించలేదు. మొబైల్ లాంచ్ చేసినా.. రేట్లను మాత్రం వెల్లడించలేదు. రేపు (ఫిబ్రవరి 28) మధ్యాహ్నం 12 గంటలకు భారత్‍లో Xiaomi 13 Pro ధరలను ప్రకటించననున్నట్టు షావోమీ పేర్కొంది. ఈ-కామర్స్ సైట్ అమెజాన్ (Amazon), షావోమీ వెబ్‍సైట్ mi.comలో ఈ ఫోన్ అందుబాటులోకి వస్తుంది. Xiaomi 13 Pro మొబైల్ సెరామిక్ బ్లాక్, సెరామిక్ వైట్ కలర్ ఆప్షన్‍లలో లభిస్తుంది. 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ వరకు లభించే అవకాశం ఉంది. చైనాలో షావోమీ 13 ప్రో ప్రారంభ ధర 4,999 యువాన్లు (సుమారు రూ.61,000)గా ఉంది. ఇండియాలో దాదాపు ఆ దరిదాపుల్లోనే ధర ఉండే అవకాశం ఉంది. రేపు ఈ విషయం తెలియనుంది.