తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Zomato Vs Swiggy: జొమాటో స్విగ్గీ ఫైట్‌లో నెగ్గేదెవరు?

Zomato vs Swiggy: జొమాటో స్విగ్గీ ఫైట్‌లో నెగ్గేదెవరు?

HT Telugu Desk HT Telugu

24 November 2022, 12:05 IST

    • జొమాటో తన మార్కెట్ షేర్ పెంచుకున్నట్టు బ్రోకరేజ్ సంస్థలు చెబుతున్నాయి.
ఫుడ్ డెలివరీ బిజినెస్‌లో జొమాటో వాటా ఎంత?
ఫుడ్ డెలివరీ బిజినెస్‌లో జొమాటో వాటా ఎంత?

ఫుడ్ డెలివరీ బిజినెస్‌లో జొమాటో వాటా ఎంత?

ఫుడ్ ఆర్డర్లలో జొమాటో గ్రాస్ మర్కండైజ్ వ్యాల్యూ (జీఎంవీ) క్యాలండర్ ఇయర్ ఫస్ట్ హాఫ్‌లో 56 శాతంగా ఉండగా, స్విగ్వీ జీఎంవీ 40 శాతంగా ఉంది. బ్రోకరేజ్ సంస్థ ఆంబిట్ చెబుతున్న లెక్కల ప్రకారం ఫుడ్ ఆర్డరింగ్ బిజినెస్‌లో జొమాటో సుమారు 55 శాతం వాటా కలిగి ఉంది.

‘మార్కెట్ వాటాను కోల్పోకుండా లాభదాయకతను పెంచుకోవడానికి స్విగ్గీ గట్టి ప్రయత్నాలే చేయాల్సి ఉంటుంది. అలాగే మెటీరియల్ కాంపిటీషన్ కూడా తట్టుకోవాల్సి ఉంటుంది. ఈ పరిణామం జొమాటో తన సమర్థతపై ఫోకస్ చేసేందుకు సాయపడుతుంది. రెండో త్రైమాసికంలో జొమాటా మార్జిన్ 170 బేసిస్ పాయింట్ల మేర మెరుగుపడింది. మొదటి త్రైమాసికంతో పోలిస్తే 4.5 శాతం మెరుగుపడింది. అలాగే జొమాటో ఫుడ్ ఆర్డరింగ్ బిజినెస్ లాభదాయకత సాధించేందుకు దీర్ఘకాల రోడ్‌మ్యాప్ కనిపిస్తోంది..’ అని బ్రోకరేజ్ సంస్థ విశ్లేషించింది.

జొమాటో షేర్లపై బ్రోకరేజ్ సంస్థ ఆంబిట్ ‘బయ్’ రేటింగ్ ఇచ్చింది. టార్గెట్ ధర రూ. 94గా పేర్కొంది. అంటే ప్రస్తుతం జొమాటో షేర్ ధరతో పోలిస్తే దాదాపు 50 శాతం అప్‌సైడ్ ట్రెండ్‌ను సూచిస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో జొమాటో లాభాల్లోకి వచ్చే అవకాశం ఉందని బ్రోకరేజ్ సంస్థ అంచనా వేసింది. ‘జొమాటోకు అనుబంధంగా ఉన్న రెస్టారెంట్ల సంఖ్య చిన్నదే. కానీ దీని డెలివరీ ఏజెంట్ల సంఖ్య చాలా ఎక్కువ..’ అని తెలిపింది.

ఈ ఏడాది తొలి అర్ధ సంవత్సరంలో జొమాటో ఫుడ్ డెలివరీ షేర్ 55 శాతంగా ఉందని ప్రొసస్ సంస్థ రిలీజ్ చేసిన మార్కెట్ షేర్ డేటా చెబుతోంది. జెఫెరీస్ బ్రోకరేజ్ సంస్థ ప్రకారం జొమాటో అత్యధిక మార్కెట్ వాటా కలిగి ఉంది.

‘స్విగ్గీ తన నష్టాలను తగ్గించుకోవడానికి ఫుడ్ డెలివరీలో తన దూకుడు వైఖరిని తగ్గించుకున్నట్టు గమనిస్తున్నాం. ఒకవేళ అలా జరగకపోతే జొమాటో తన దూకుడు పెంచాల్సి ఉంటుంది..’ అని జెఫెరీస్ విశ్లేషించింది.

స్విగ్గీ తన డిస్కౌంట్లు, ఫ్లాగ్‌షిఫ్ ప్రోగ్రామ్ అయిన స్విగ్వీ వన్‌ను కొనసాగిస్తే జొమాటో కూడా ప్రో మెంబర్‌షిప్ ప్రోగ్రామ్స్‌తో రావాల్సి ఉంటుందని అంచనా వేస్తోంది. ‘జొమాటో ఇప్పటికే కొన్ని ఆఫర్లతో వచ్చింది. ఉచిత డెలివరీ, రాయితీతో కూడిన డెలివరీ ఇస్తోంది. రానున్న వారాల్లో ఈ పరిణామాలను నిశితంగా తమనించాలి..’ అని పేర్కొంది.

((గమనిక: ఇక్కడ తెలియపరిచిన అభిప్రాయాలు, సిఫారసులు వ్యక్తిగత అనలిస్టులు, బ్రోకరేజ్ కంపెనీలవి మాత్రమే. హెచ్‌టీవి కావు.))

టాపిక్